Salt Tea: ఉదయం లేవగానే ఓ సిప్ టీ పడక పోతే ఏదోలా ఉంటుంది. అందుకే సింగిల్ టీ అయినా తాగాల్సిందే. కొందరు అల్లం టీ, మసాలా టీ, లెమన్ టీ అంటూ రకరకాల టీలను తాగుతుంటారు. కానీ మరో రకం టీని కూడా చాలా మంది తాగుతుంటారు. అదేనండి సాల్ట్ టీ. ఈ టీ ఈ మధ్య చాలా ఫేమస్ అవుతుంది. మరి ఉప్పు టీ తాగడం వల్ల ప్రయోజనాలు ఉన్నాయా? లేదా ఏమైనా చెడు ప్రభావాలను చూపిస్తుందా అనే వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం.
ప్రతి దేశంలో కూడా ఈ టీని తాగుతుంటారు. కొందరు పాలతో చేసిన టీని తాగితే మరికొందరు మసాలాలతో చేసిన టీని తాగుతారు. కానీ టీ మాత్రం తాగాల్సిందే అంటారు. ఇక మధ్యప్రదేశ్ లోని ఉజ్జయిని జిల్లాలో ఉప్పు టీని తాగుతారు. కొన్ని సంవత్సరాల నుంచి ఇక్కడ సాల్ట్ టీ చాలా ఫేమస్ అయిందట. అయితే ఈ టీని వారు సులైమాన్ టీ అంటారు. వీరు ఆరోగ్యానికి ఈ టీ మంచిదని నమ్ముతారు.
ఈ టీ గొంతు నొప్పికి చాలా బాగా పనిచేస్తుందట. అన్ని గొంతు సమస్యలను దూరం చేస్తుందట ఉప్పు టీ. చలికాలంలో ఈ టీని తాగడానికి మరింత ఇష్టపడతారు. ఉప్పు టీ టాన్సిల్స్ ను నయం చేస్తోంది. కొందరు నిపుణులు కూడా ఏకంగా ఈ టీని రోజుకు 5 కప్పుల వరకు తాగుతారు. గొంతు, దగ్గు, అధిక రక్తపోటు ఉన్న రోగులకు ఈ టీని సజెస్ట్ చేస్తారట నిపుణులు. చలికాలంలో కాస్త ఉప్పు వేసి తాగితే చాలు రోగనిరోధక శక్తి పెరుగుతుందట. దీనివల్ల జలుబు మాయం, శరీరంలో శక్తి వస్తుంది, జీర్ణక్రియ మెరుగుపడుతుంది అంటారు నిపుణులు.
మరి ఈ సులైమాన్ టీని ఎలా తయారు చేస్తారంటే. వేడి నీటిని తీసుకుని అందులో టీ పొడి, చక్కెర వేసి, కాస్త ఉప్పు వేయాలి. ఇదంతా చాలా సేపు అంటే ఓ గంట సేపు మరగనివ్వాలి. పాలను విడిగా వేడి చేయాలి. ఒక కప్పు బ్లాక్ టీ ని తీసుకొని అందులో పాలు పోసి మిక్స్ చేయాలి. అంటే సులైమాన్ టీ రెడీ. మరి ఇష్టం లేకపోతే తాగాల్సిన అవసరం లేదు. నచ్చితే వదిలి పెట్టాల్సిన అవసరం లేదు.