Eye site: సర్వేంద్రియాణాం నయనం ప్రధానం అన్నారు. ఈ లోకాన్ని చూడాలి అన్నా, మనల్ని మనకు చూపాలన్నా మన కళ్ళే కారణం. అందుకే కళ్ళు శరీరానికి అమరిన సహజ సౌందర్యాభరణాలు అంటారు పెద్దలు. అయితే, ఈ రోజుల్లో కంటి సమస్యలు లేని కుటుంబం లేదు. చిన్న చిన్న పిల్లలకు కూడా కంటి సమస్యలు వస్తున్నాయి. ఆయుర్వేద రీత్యా వాత దోషం ప్రకోపించడం వలన కంటిపొరలు ఏర్పడి అనేక సమస్యలు వస్తుంటాయి.
ఈ వాత దోషం కంటిని పొడిబారినట్టు చేసి పారదర్శకత లోపించేట్టు చేస్తోంది. ఎప్పుడైతే, కంట్లో పొరలు ఏర్పడతాయో.. అప్పుడు దృష్టి లోపం కలుగుతుంది. ఈ లోపం సరిచేయడానికి వాత దోష ప్రకోపాన్ని తగ్గించే ప్రయత్నాలు చేస్తే మంచిది. అయితే, మీకు తెలుసా ? ఈ కంటి పొరలను ప్రత్యేకించి కొన్ని మూలికలతో కలిపిన ఆవు నెయ్యిని వాడితే.. ఈ లోపం పూర్తిగా తగ్గుతుంది.
అలాగే కంటి సమస్యల పరిష్కారానికి అనేక మార్గాలు ఉన్నాయి. అవేమిటో చూద్దాం.
1. రెండు స్పూన్ల నెయ్యికి కొద్దిగా త్రిఫల చూర్ణం బాగా కలపాలి. దాన్ని రాత్రి నానబెట్టి ఉదయాన్నే వడబోసి సగం తాగి మిగిలిన నీటితో కళ్లను బాగా కడుక్కుంటే.. మన కంటి చూపు బాగా మెరుగవుతుంది.
2. అలాగే బియ్యాన్ని నీటిలో మెత్తగా నూరి.. కళ్ళ మీద పెడితే అతిగా వ్యాపించే కంటి శుక్లాలు చాలా త్వరగా తగ్గుతాయి.
3. అదే విధంగా.. పొద్దు తిరుగుడు చెట్టు గింజల చూర్ణాన్ని కూడా రోజుకు మూడు వేళ్లకు పట్టించి కంటి పై సున్నితంగా మర్దన చేస్తే.. ఇలా 21 రోజుల పాటు చేస్తే కంటి పొరలు తగ్గుతాయి. అయితే, ఎప్పుడైనా సరే.. మీకు కంటి సమస్య ఉన్నప్పుడు ముందుగా ఆయుర్వేద వైద్యున్ని సంప్రదించాకే.. వారి సలహా మేరకు ఇవ్వన్నీ అనుసరించడం మంచిది.