https://oktelugu.com/

Health Tips: ప్రతిరోజు ఉదయం బ్రేక్ ఫాస్ట్ గా బ్రెడ్ తింటున్నారా… ఈ ప్రమాదంలో పడినట్లే!

Health Tips: ప్రస్తుత కాలంలో చాలా మంది పని ఒత్తిడిలో పడి సరైన తిండి తినడానికి కూడా సమయం కేటాయించడం లేదు. ఈ క్రమంలోనే నగరాల్లో ఇప్పటికీ ఎంతోమంది ప్రతిరోజు ఉదయం బ్రెడ్ అల్పాహారంగా తీసుకొని వారి పనులకు వెళ్ళటం మనం చూస్తుంటాము. ఈ క్రమంలోనే చాలామంది ప్రతిరోజూ ఉదయం బ్రెడ్ శాండ్విచ్ తో కడుపు నింపుకొని వారి పనులలో బిజీ అవుతున్నారు. అయితే ప్రతిరోజు ఇదే బ్రేక్ ఫాస్ట్ చేసే వారు తప్పనిసరిగా వారి ఆహార […]

Written By:
  • Kusuma Aggunna
  • , Updated On : April 25, 2022 / 12:32 PM IST
    Follow us on

    Health Tips: ప్రస్తుత కాలంలో చాలా మంది పని ఒత్తిడిలో పడి సరైన తిండి తినడానికి కూడా సమయం కేటాయించడం లేదు. ఈ క్రమంలోనే నగరాల్లో ఇప్పటికీ ఎంతోమంది ప్రతిరోజు ఉదయం బ్రెడ్ అల్పాహారంగా తీసుకొని వారి పనులకు వెళ్ళటం మనం చూస్తుంటాము. ఈ క్రమంలోనే చాలామంది ప్రతిరోజూ ఉదయం బ్రెడ్ శాండ్విచ్ తో కడుపు నింపుకొని వారి పనులలో బిజీ అవుతున్నారు. అయితే ప్రతిరోజు ఇదే బ్రేక్ ఫాస్ట్ చేసే వారు తప్పనిసరిగా వారి ఆహార విషయంలో మార్పులు చేసుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు.

    సాధారణంగా బ్రెడ్, శాండ్విచ్ తయారు చేయడానికి ఉపయోగించే మైదా పిండిని తయారు చేసేటప్పుడు గోధుమల పై భాగం మొత్తం తొలగించబడుతుంది. గోధుమల పైభాగంలో మన శరీరానికి కావాల్సిన ఎంతో ఫైబర్ ఉంటుంది. ఈ క్రమంలోనే గోధుమలలో ఉన్నటువంటి ఫైబర్ మొత్తం కోల్పోతాము.ఈ విధంగా గోధుమలలో ఉన్న ఫైబర్ పూర్తిగా తొలగించినప్పుడు మైదా ఎంతో మెత్తగా తయారవుతుంది. గోధుమలో ఉన్నటువంటి పోషకాలన్నీ తొలగిపోయి బ్రెడ్ లో కార్బోహైడ్రేట్లు శుద్ధి చేయబడి ఉంటాయి. అంటే ఇవి శరీరానికి ఏ మాత్రం ప్రయోజనకరం కాదని చెప్పాలి.

    ఈ విధంగా తరచు బ్రెడ్ తీసుకోవడం వల్ల ట్రైగ్లిజరైడ్ స్థాయిలు పెరుగుతాయి.దీని వల్ల మధుమేహం గుండె సంబంధిత వ్యాధులు వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఈ విధంగా బ్రెడ్ ను తీసుకోవడం ఒక్కసారిగా మానేస్తే ఈ వ్యాధుల బారిన పడకుండా మన ఆరోగ్యాన్ని రక్షించుకోవచ్చు.అలాగే బ్రెడ్ తరచూ తీసుకోవడం ఊబకాయానికి దారితీస్తుంది. ఫలితంగా శరీరంలో కొవ్వు పేరుకుపోవడం వల్ల గుండెపోటు వచ్చే అవకాశాలు కూడా అధికంగా ఉన్నాయి. అందుకే వీలైనంత వరకు బ్రెడ్ పూర్తిగా అవాయిడ్ చేయడం ఎంతో మంచిది.