Do you Drink Tea and Coffee: అప్పుడెప్పుడో ఆంగ్లేయులు నేర్పిన అలవాటును మానలేకపోతున్నాం. వాటి వల్ల ఉపయోగం కంటే నష్టమే ఎక్కువగా ఉంటోంది. అయినా వదలడం లేదు. తెల్లవారిందంటే చాలు అందరికి కడుపులో కాసిన్ని కాఫీ, టీ నీళ్లు పడాల్సిందే. మరి వీటికి బదులు ఆరోగ్యాన్నిచ్చే అల్లంతో తయారు చేసిన టీని తాగమంటే తాగరు. టీ, కాఫీలతో మన ఆరోగ్యం దెబ్బతినడం ఖాయం. కానీ ఎవరు కూడా పట్టించుకోవడం లేదు. వాటినే ఆశ్రయిస్తున్నారు. వాటితోనే కాలక్షేపం చేస్తున్నారు. ఫలితంగా నూరేళ్ల జీవితానికి గుడ్ బై చెబుతున్నారు. మధ్యంతరంగానే కాలం ముగించేస్తున్నారు. అయినా విడిచిపెట్టడం లేదు. ప్రతి రోజు ఉదయం కాఫీ, టీలకు బదులు ఆరోగ్యాన్నిచ్చే పానీయాలు తాగడం మంచిది. ధనియాలు, మెంతులు, పుదీనా, తులసి, నిమ్మరసం, తేనె వంటి వాటిని కలుపుకుని తాగితే ప్రయోజనం ఉంటుంది. రోజుకు ఐదు కప్పుల కంటే ఎక్కువ టీ తాగితే ప్రొస్టేట్ క్యాన్సర్ బారిన పడే ప్రమాదం ఉంది. ఎక్కువ మొత్తంలో టీ తాగుతుంటే ఎముకలు గుళ్లబారిపోతాయని తెలుస్తోంది. గుండె వేగంగా కొట్టుకుంటుంది. జీర్ణవ్యవస్థ దెబ్బతినే ప్రమాదం పొంచి ఉందని చెబుతున్నారు. పిల్లలకైతే టీ, కాఫీలు తాగించడం అంత మంచిది కాదని సూచిస్తున్నారు.
Also Read: problems come with romance aside: శృంగారాన్ని పక్కన పెడితే ఏ సమస్యలు వస్తాయో తెలుసా?
చాలా మంది ఆరోగ్యాన్ని నిర్లక్ష్యం చేస్తున్నారు. ఉదయం లేవగానే టీ, కాఫీ తాగుతున్నారు. దీంతో ప్రతికూల ప్రభావాలు ఏర్పడే అవకాశం ఉంది. టీ ఎక్కువగా తాగడం వల్ల గ్యాస్ సమస్య వస్తుంది. తలనొప్పి కూడా వేధిస్తుంది. కడుపులో యాసిడ్ ఎక్కువగా ప్రొడ్యూస్ అయి ఎసిడిటి సమస్య వస్తుందని చెబుతున్నారు. ఎసిడిటితో కడుపులో నొప్పి, వికారం, చాతిలో మంట, ఉబ్బరం వంటి లక్షణాలు కనిపిస్తాయి. ఆయుర్వేదంలో కూడా టీ తాగడం మంచి అలవాటు కాదని చెబుతోంది. ఎక్కువగా టీ తాగడం వల్ల మానసిక ఒత్తిడి, నిద్ర లేమి కూడా బాధిస్తాయి. ఉదయం నిద్ర లేవగానే టీ, కాఫీలు తాగడం అంత మంచిది కాదని తెలిసినా మానడం లేదు. ఇందులో ఉండే కెఫిన్ వల్ల మనకు తక్షణమే ఉత్తేజం వచ్చినట్లు అవుతుంది. కానీ తరువాత అన్ని ప్రతికూల న్రబావాలే ఉంటాయి. దీన్ని గుర్తుంచుకుని మనం టీ, కాఫీలు మానేయడమే మంచిది. కానీ ఎవరు వింటారు. అవి లేకపోతే జీవితమే లేదనే స్థాయికి వచ్చేశారు. ఫలితంగా రోగాల బారిన పడుతున్నారు. కానీ వాటిని మానడం లేదు.
Also Read: Lottery: రూ.10 వేల కోట్ల లాటరీ.. బహుమతి తీసుకెళ్లే వాళ్లే లేరు..!