Goddess Lakshmi : శుక్రవారం లక్ష్మీదేవి అనుగ్రహం కావలంటే ఇలా చేయండి

Goddess Lakshmi : లక్ష్మీదేవి కటాక్షం కోసం అందరు తపిస్తుంటారు. తమ ఇంటిలో లక్ష్మీదేవి కొలువుండాలని పూజలు చేస్తుంటారు. ఇందులో భాగంగా శుక్రవారం రోజు లక్ష్మీదేవికి ప్రత్యేక పూజలు చేస్తుంటారు. శుక్రవారం నాడు లక్ష్మీదేవిని పూజిసతే ఇంట్లో సంతోషం కలుగుతుందని నమ్ముతుంటారు దీంతో లక్ష్మీదేవికి ఇష్టమైన పనులు చేసేందుకు సిద్ధపడుతుంటారు. ఆర్థిక ఇబ్బందులు లేకుండా ఉండాలంటే లక్ష్మీదేవి అనుగ్రహం కావాలని ఆశిస్తారు. దీని కోసం ఆమెను ప్రసన్నం చేసుకునేందుకు పలు మార్గాలు అన్వేషిస్తుంటారు. వారికి తెలిసిన పద్ధతుల్లో […]

Written By: Srinivas, Updated On : March 31, 2023 10:12 am
Follow us on

Goddess Lakshmi : లక్ష్మీదేవి కటాక్షం కోసం అందరు తపిస్తుంటారు. తమ ఇంటిలో లక్ష్మీదేవి కొలువుండాలని పూజలు చేస్తుంటారు. ఇందులో భాగంగా శుక్రవారం రోజు లక్ష్మీదేవికి ప్రత్యేక పూజలు చేస్తుంటారు. శుక్రవారం నాడు లక్ష్మీదేవిని పూజిసతే ఇంట్లో సంతోషం కలుగుతుందని నమ్ముతుంటారు దీంతో లక్ష్మీదేవికి ఇష్టమైన పనులు చేసేందుకు సిద్ధపడుతుంటారు. ఆర్థిక ఇబ్బందులు లేకుండా ఉండాలంటే లక్ష్మీదేవి అనుగ్రహం కావాలని ఆశిస్తారు. దీని కోసం ఆమెను ప్రసన్నం చేసుకునేందుకు పలు మార్గాలు అన్వేషిస్తుంటారు. వారికి తెలిసిన పద్ధతుల్లో ఆమెను కొలిచి ప్రసన్నం చేసుకోవాలని భావిస్తారు. ఇలా లక్ష్మీదేవి దయ కోసం అందరు ఎంతో శ్రమిస్తుంటారు.

కష్టపడి పనిచేసే వారికి లక్ష్మీదేవి కటాక్షం తప్పకుండా ఉంటుంది. ఇంకా ఆహారాన్ని పొదుపు చేసే వారి ఇంట్లో కూడా లక్ష్మీదేవి కొలువుంటుందని నమ్ముతుంటారు. బద్ధకాన్ని వదిలిపెడితే మనకు అదృష్టం కలిసి వస్తుందని చెబుతారు. ఊరికే కూర్చుంటే ఏదీ రాదు. కష్టపడితేనే ఏదైనా సాధ్యమవుతుంది. అలాంటి వారి ఇంట్లోనే లక్ష్మీదేవి నిలుస్తుంది. శుక్రవారం లక్ష్మీదేవికి పూజలు చేరయడం వల్ల కుటుంబ కలహాలు దూరమవుతాయి. భార్యాభర్తల మధ్య గొడవలు లేకుండా పోతాయి.

ఇంట్లో నెగెటివ్ ఎనర్జీ ఉన్న ఇంట్లో లక్ష్మీదేవి నివాసం ఉండదు. దీంతో వైవాహిక జీవితంలో ఆర్థిక, మానసిక సమస్యలు రావడానికి ఆస్కారం ఉంటుంది. ఇంట్లో ప్రశాంత వాతావరణం ఉంటే కూడా లక్ష్మీదేవికి ఆ ఇంట్లో ఉండాలనే కోరిక కలుగుతుందట. అంతేకాని నిత్యం గొడవలతో ఉండే ఇంట్లో లక్ష్మీదేవి నివాసం ఉండటానికి ఇష్టపడదట. దీంతో ఇంట్లో సానుకూల వాతావరణం ఉండేలా జాగ్రత్తలు తీసుకోవాలి. చీటికి మాటికి ఏవో గొడవలకు దిగే వారి ఇంట్లో లక్ష్మీదేవి నివాసం ఏర్పరుచుకోదు.

ఏ ఇంట్లో అయితే ప్రేమానురాగాలు ఉంటాయో అక్కడ లక్ష్మీదేవి కొలువుంటుంది. మూర్ఖులు, కపట బుద్ధి గల వారి ఇంట లక్ష్మీదేవి ఒక్క క్షణం కూడా ఉండదు. అలాంటి వారికి దూరంగా ఉండేందుకు నిర్ణయించుకుంటుంది. లక్ష్మీకటాక్షం కావాలంటే మనం నిజాయితీగా ఉంటేనే సాధ్యమవుతుంది. కష్టపడి పనిచేసే వారికి లక్ష్మీదేవి దయ కచ్చితంగా ఉంటుంది. ఇన్ని రకాలుగా జాగ్రత్తలు తీసుకుంటేనే లక్ష్మీదేవి మన ఇంట్లో ఉండేందుకు సుముఖత వ్యక్తం చేస్తుందట.