Banana Ripening: మంచి ప్రొటీన్లు ఉన్న పండ్లలో అరటి కూడా ఒకటి. ఇది సహజసిద్ధంగా ఏడాదంతా పండుతుంది. దీంతో ఇవి ఏకాలంలో అయినా దొరుకుతాయి. ఇందులో ఎథిలీన్ అనే వాయువు ఉంటుంది. ఇది అవి త్వరగా మగ్గేందుకు దోహదపడుతుంది. దీంతో మనం ఓ డజన్ పండ్లు తీసుకుని తినడం ప్రారంభిస్తే అరడజన్ తినేసరికి మిగతా పండ్లు కూడా పక్వానికి వస్తాయి. ఇలా అరటిపండ్లు వేగంగా పండుతాయి కనుకే వాటిని తొందరగా మగ్గకుండా కొన్ని చిట్కాలు పాటించడం సహజమే.
తొందరగా మగ్గకుండా ఏం చేయాలి?
అరటిపండ్లు త్వరగా మగ్గకుండా ఉండాలంటే అరటిపండ్ల హస్నాన్ని విడదీయకుండా అలాగే వేలాడదీయాలి. ఒకదానికి మరొకటి తాకకుండా జాగ్రత్తలు తీసుకోవాలి. ఒకవేళ తాకితే త్వరగా పక్వానికి రావడం ఖాయం. ఇలా చేస్తే యాసిడ్ బ్రేక్ డౌన్ ప్రక్రియ నెమ్మదిగా అయిపోయి మగ్గకుండా ఉంటాయి. దీంతో అవి తాజాగా కనిపిస్తాయి. ఇలా మన చిట్కాలు పాటిస్తే అరటిపండ్లను రక్షించుకోవచ్చు.
ఎక్కడ ఉంచాలి?
అరటిపండ్లను 13 డిగ్రీల ఉష్ణోగ్రత ఉండేలా చూసుకుని భద్రపరచాలి. వేడి తగిలే చోట ఉంచితే త్వరగా మగ్గుతాయి. వంట గదిలో అసలు ఉంచకూడదు. ఇలా జాగ్రత్తలు తీసుకుని అరటిపండ్లు వేగంగా పక్వానికి రాకుండా చూసుకోవడం మంచిది. చీకటి ప్రదేశంలో అరటిపండ్లను వేలాడదీస్తే తొందరగా పండకుండా ఉంటాయి. ఇలా మనం అరటిపండ్లను చూసుకుంటే త్వరగా పక్వానికి రావు.
ఇంకా ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటే..
అరటి కాయల్లో ఎథలీన్ విడుదల కావడంతోనే తొందరగా మగ్గుతాయని తెలుసుకున్నాం. దీని బారి నుంచి కాపాడుకోవడానికి వాటిని స్టెమ్ ను అల్యూమినియం లేదా ఫాయిల్ తో చుట్టాలి. అరటిపండ్లను విడదీసి స్టెమ్ ను విడివిడిగా ఫాయిల్ చుట్టాలి. తరువాత వీటిని ఫ్రిజ్ లో నిలువ ఉంచుకోవచ్చు. అందులో ఉంచితే పండు గోధుమ రంగులోకి మారుతుంది. లోపల పండు మాత్రం తాజాగానే ఉంటుంది. ఇలా అరటిపండ్లు జాగ్రత్తగా కాపాడుకుంటే త్వరగా మగ్గకుండా ఉంటాయి.