Chapatis : చపాతీలు మెత్తగా రావాలంటే ఇలా చేయండి

chapatis : చపాతీలు కాల్చడానికి నెయ్యి ఉపయోగించండి. చివరగా చపాతీలను కాల్చిన తర్వాత వాటిని హాట్ బాక్స్లో ఉంచుకోండి.

Written By: NARESH, Updated On : June 11, 2024 8:10 pm

chapatis

Follow us on

chapatis : మీరు చపాతీలు చేస్తే.. ఇవి చపాతీలా? లేదా పాపడాల అని అడుగుతున్నారా? ఎందుకంటే మీ తపాతీలు కరకరలాడుతుంటాయి. ఇక ఈ మధ్య బరువు తగ్గాలనుకునే వారు ఎక్కువగా చపాతీలు తింటున్నారు. షుగర్ బాధితులు నైట్‌ అన్నం మొత్తం మానేసారు. దీనికి బదులు చపాతీలను తింటున్నారు. కానీ ఈ చపాతీలు చేస్తే కాసేపటి తర్వాత గాలి తగిలి గట్టిగా మారిపోతుంటాయి. చాలా మందికి ఇదే సమస్య ఉంటుంది. మరి చపాతీలు మెత్తగా రావాలంటే ఏం చేయాలి? ఈ సమస్య నుంచి బయట పడాలంటే కొన్ని టిప్స్ చూసేయండి.

చపాతీలు చేసేందుకు మార్కెట్లో దొరికే ఏదో ఒక పిండి తెచ్చి ఉపయోగిస్తారు. కానీ, చపాతీలు చేసేందుకు స్వచ్ఛమైన పిండిని మాత్రమే వాడాలి. కుదిరితే గోధుమలను కొని పిండి పట్టించుకుని, చపాతీలు చేసుకుంటే సూపర్ సాఫ్ట్గా ప్రిపరే చేసుకోవచ్చు. కుదరకపోతే మార్కెట్లో మంచి బ్రాండెడ్‌ గోధుమ పిండి ప్యాకెట్‌లను తెచ్చుకోండి. ఇక చపాతీల పిండి మెత్తగా ఉండేలా చూసుకోండి. ఒకవేళ బరకగా ఉంటే పిండిని జల్లెడపట్టడం మర్చిపోకండి. చపాతీలు చేయడానికి కావాల్సినంత పిండి తీసుకోవాలి. ఈ పిండిలో కాస్త నూనె, గోరువెచ్చని నీరు, కొద్దిగా పాలు పోసి మెత్తగా కలుపుకోండి.

పిండి గట్టిగా ఉంటే చపాతీలు కూడా మెత్తగా వస్తాయి. లేదంటే గట్టిగా వస్తాయి. అందుకే పిండి మెత్తగా ఉండేలా కలుపుకోండి. ఈ పిండి ముద్దను ఓ తడి క్లాత్ తో కప్పి సుమారు అరగంట పాటు పక్కన పెట్టుకోండి. దీనివల్ల చపాతీలు మెత్తగా వస్తాయి. ఈ పిండి ముద్దను తీసుకుని చిన్న చిన్న ఉండలు గా చేసుకోండి. చపాతీలు చేసేటప్పుడు పీట మీద పొడి పిండిని చల్లుతుంటారు. దీని వల్ల గట్టిగా వస్తాయి. అందుకే పొడి పిండికి బదులుగా ఆయిల్‌ను పీటపైన రాసి చపాతీలు చేయవచ్చు.

చపాతీలు చేసి దాన్ని ఫోల్ద్ చేయాలి. దీన్ని మరోసారి చపాతీగా చేసి కాల్చాలి. అప్పుడు మంచిగా పొంగుతాయి. ఇక చపాతీలు చేసిన వెంటనే వాటిని కాల్చితే సూపర్ సాఫ్ట్ గా వస్తాయి. ఎండిన తర్వాత కాల్చితే ఎండినట్టే ఉంటాయి. చపాతీలను కాల్చే పెనం వేడిగా ఉండాలి. కానీ తక్కువ మంట మీద కాల్చాలి. మంట ఎక్కువ ఉంటే పిండి త్వరగా కాలుతుంది. దీని వల్ల చపాతీలు గట్టిగా వస్తాయి. చపాతీలు కాల్చడానికి నెయ్యి ఉపయోగించండి. చివరగా చపాతీలను కాల్చిన తర్వాత వాటిని హాట్ బాక్స్లో ఉంచుకోండి.