Debts : అప్పులన్నీ పోవాలంటే ఇలా చేయాలి

Debts : ఈ రోజుల్లో ఆర్థిక ఇబ్బందులు వేధిస్తున్నాయి. అప్పుల భారం పెరిగిపోతోంది. ఏ ఇల్లు చూసినా అప్పులే పలకరిస్తున్నాయి. దీంతో ఏం చేయాలో తోచడం లేదు. ఆర్థిక కష్టాల నుంచి బయట పడటానికి నానా తంటాలు పడాల్సి వస్తోంది. ఎన్నో మార్గాలు పాటించినా ఫలితం కానరావడం లేదు. ఇక ఏం చేయాలో తోచక బిక్కుబిక్కుమంటున్నారు. పలు రకాల పరిహారాలు పాటిస్తున్నా తగిన ఫలితం రావడం లేదని మధనపడుతున్నారు. అప్పుల భారం నుంచి గట్టెక్కడానికి ఎన్నో బాధలు […]

Written By: Srinivas, Updated On : March 22, 2023 5:26 pm
Follow us on

Debts : ఈ రోజుల్లో ఆర్థిక ఇబ్బందులు వేధిస్తున్నాయి. అప్పుల భారం పెరిగిపోతోంది. ఏ ఇల్లు చూసినా అప్పులే పలకరిస్తున్నాయి. దీంతో ఏం చేయాలో తోచడం లేదు. ఆర్థిక కష్టాల నుంచి బయట పడటానికి నానా తంటాలు పడాల్సి వస్తోంది. ఎన్నో మార్గాలు పాటించినా ఫలితం కానరావడం లేదు. ఇక ఏం చేయాలో తోచక బిక్కుబిక్కుమంటున్నారు. పలు రకాల పరిహారాలు పాటిస్తున్నా తగిన ఫలితం రావడం లేదని మధనపడుతున్నారు. అప్పుల భారం నుంచి గట్టెక్కడానికి ఎన్నో బాధలు పడాల్సి వస్తోంది. అయినా డబ్బు కష్టాలు తీరడం లేదు.

ఆర్థిక ఇబ్బందుల నుంచి బయట పడాలంటే రూ. 21 రూపాయి బిళ్లలతో అద్భుతమైన పరిహారం ఉంది. దీనికి కావాల్సింది రూపాయి బిళ్లలే కావడంతో ఖర్చు తక్కువే. ఒక గాజు పాత్ర తీసుకుని అందులో నీళ్లు పోయాలి. అనంతరం దొడ్డు ఉప్పు వేసి తరువాత దొడ్డు ఉప్పుతో గాజు పాత్రను శుభ్రం చేసుకోవాలి. దొడ్డు ఉప్పు కలిపిన నీళ్లు పారబోయాలి. గాజు పాత్రను శుభ్రంగా కడిగిన తరువాత పూజా గదిలో అమ్మవారి ఫొటో ముందు పెట్టి ప్రతి రోజు పూజ చేసుకుని ఆవు నెయ్యితో కానీ నువ్వుల నూనెతో కానీ దీపం వెలిగించాలి.

తరువాత ఆ గాజు పాత్రలో ఒక రూపాయి బిళ్ల వేయాలి. అది వేసేటప్పుడు ఓం ఐం హ్రీమ్ చాముండాయ విచ్చే అనే మంత్రాన్ని 11 సార్లు పఠించాలి. ఇలా ప్రతి రోజు చేయాలి. 21 రోజులు రోజు 21 బిళ్లలు వేయడం పూర్తయిన తరువాత 22వ రోజు ఉదయం స్నానంచేసి తరువాత గాజు పాత్రలో ఉన్న నీళ్లు తీసుకుని ఒక పాత్రలో పోసి దానిలో మామిడాకులు వేసి వాటితో ఇల్లంతా చల్లాలి. దీంతో ఇంట్లో ఉన్న నెగెటివ్ ఎనర్జీ పోతుంది. దీంతో మనకు ఆర్థిక ఇబ్బందులు కూడా తొలగిపోవడం ఖాయం.

ఇక ఆ పాత్రలో ఉన్న 21 రూపాయి బిళ్లలను తీసి బీరువాలో దాచండి. ఇందులో నుంచి నాలుగు బిళ్లలను మీ పర్సులో పెట్టుకోండి. ఇలా చేయడం వల్ల ఆర్థిక ఇబ్బందుల నుంచి గట్టెక్కవచ్చు. గాజు పాత్రలో 21 బిళ్లలను వేయడం ద్వారా మనకు మంచి జరుగుతుందని నమ్ముతారు. ఈ పరిహారం పాటిస్తే మనకు సకల శుభాలు కలుగుతాయి. 22వ రోజు ఆ నీళ్లు తీసేసి మామిడి ఆకుతో ఆ నీళ్లను ఇల్లంతా చల్లడం వల్ల మనకు ప్రతికూల ప్రభావాలు లేకుండా పోతాయి.

Tags