https://oktelugu.com/

Pneumonia : న్యూమోనియా రావద్దంటే ఇలా చేయండి

Pneumonia :  మన శరీరంలో నిరంతరం పనిచేసే అవయవాల్లో ఊపిరితిత్తులు కూడా ఒకటి. మనకు శ్వాస తీసుకోవడంలో ఇవి ప్రధాన భూమిక పోషిస్తాయి. శ్వాస సంబంధమైన సమస్యలు వస్తే ఊపిరితిత్తులకు నష్టం కలిగినట్లే. ఈ నేపథ్యంలో ఊపిరితిత్తులను కూడా కాపాడుకోవాల్సిన అవసరం ఉంది. ఊపిరితిత్తుల ఆరోగ్యం కోసం జాగ్రత్తలు తీసుకోవాలి. ఊపిరితిత్తులకు ఏర్పడే సమస్యల్లో న్యూమోనియా ఒకటి. వైరస్, బ్యాక్టీరియా, ఫంగస్ వంటి క్రిములు తీవ్రమైన ఇన్ఫెక్షన్ ను కలిగించినప్పుడు ఊపిరితిత్తుల్లో ఉండే గాలి తిత్తుల్లో వచ్చే […]

Written By: , Updated On : April 2, 2023 / 12:50 PM IST
Follow us on


Pneumonia :
  మన శరీరంలో నిరంతరం పనిచేసే అవయవాల్లో ఊపిరితిత్తులు కూడా ఒకటి. మనకు శ్వాస తీసుకోవడంలో ఇవి ప్రధాన భూమిక పోషిస్తాయి. శ్వాస సంబంధమైన సమస్యలు వస్తే ఊపిరితిత్తులకు నష్టం కలిగినట్లే. ఈ నేపథ్యంలో ఊపిరితిత్తులను కూడా కాపాడుకోవాల్సిన అవసరం ఉంది. ఊపిరితిత్తుల ఆరోగ్యం కోసం జాగ్రత్తలు తీసుకోవాలి. ఊపిరితిత్తులకు ఏర్పడే సమస్యల్లో న్యూమోనియా ఒకటి. వైరస్, బ్యాక్టీరియా, ఫంగస్ వంటి క్రిములు తీవ్రమైన ఇన్ఫెక్షన్ ను కలిగించినప్పుడు ఊపిరితిత్తుల్లో ఉండే గాలి తిత్తుల్లో వచ్చే సమస్యే న్యూమోనియా.

ఆయాసం, జ్వరం, కఫం, చాతిలో అసౌకర్యం, నిద్రలేమి వంటి లక్షణాలు న్యూమోనియా వల్ల కనిపిస్తాయి. వైరస్, బ్యాక్టీరియాలు, ఫంగస్ క్రిములు దాడి చేయడం వల్ల గాలి తిత్తుల్లో కఫం, శ్లేష్మం బాగా పేరుకుపోతుంది. దీంతో శ్వాస తీసుకోవడం ఇబ్బందిగా మారుతుంది. అస్తమా ఉన్న వారికి రోగనిరోధక శక్తి తక్కువగా ఉండటం వల్ల ఇబ్బంది ఏర్పడుతుంది. ధూమపానం చేసే వారికి కూడా సమస్యలు వస్తాయి. సీవోపీడీ ఉన్న వారికి న్యూమోనియా వచ్చే వీలుంటుంది. ఇలా న్యూ మోనియా వల్ల మనకు ఇబ్బందులు రావడం సహజమే.

న్యూమోనియా నుంచి బయట పడటానికి ఒక గ్లాస్ గోరువెచ్చని నీటిలో నాలుగు టీ స్పూన్ల తేనె, ఒక నిమ్మకాయ రసం, కొద్దిగా మిరియాల పొడి, కొద్దిగా యాలకుల పొడి కలిపి తాగాలి. తరువాత రెండున్నర గంటలకోసారి తేనె నీళ్లు తాగుతూ మధ్యలో నీళ్లు తాగుతూ ఉపవాసం చేయడం వల్ల సహజసిద్ధంగా ఇన్ ఫ్లమేషన్ తగ్గుతుంది. ఇలా చేస్తే వైరస్, బ్యాక్టీరియాలు దూరం అవుతాయి. యాంటీ బాడీస్ తయారవుతాయి. ఇలా మూడు నుంచి నాలుగు రోజుల పాటు ఉపవాసం చేస్తే ఫలితం వస్తుంది. వేడి నీటిలో పసుపు, యూకలిప్టస్ ఆయిల్, తులసి ఆకులు వేసి పది నిమిషాలకోసారి ఆవిరి పడితే శ్వాస నాళాలు స్పందించి మనకు రోగాలు రాకుండా చేస్తాయి.

వేడి నీటితో స్నానం చేయాలి. వేడి నీటి బ్యాగులను ఊపిరితిత్తుల మీద ఉంచుకోవడం వల్ల కఫం, శ్లేష్మం బయటకు పోవడానికి కారణమవుతుంది. ఉపవాసం చేయడం వల్ల నీరసం రాకుండా చేస్తుంది. మూడు నుంచి నాలుగు రోజులు ఉపవాసం చేస్తే ఈ సమస్య తగ్గిపోతుంది. న్యూమోనియా వస్తే దగ్గు ఎక్కువగా వస్తుంది. నిద్రకు ఆటంకం ఏర్పడుతుంది. దీంతో న్యూ మోనియా సమస్య రాకుండా చేసుకోవడానికి జాగ్రత్తలు తీసుకోవాలి. అప్పుడే మన ఆరోగ్యం మన చేతుల్లో ఉంటుంది.