Heart Attack: ఒంటరిగా వున్నప్పుడు గుండెనొప్పి వస్తే.. ? ఇక ఆ మనిషి బతకడం సాధ్యం కాదు అంటూ ఓ నమ్మకం ప్రజలలో బలంగా నాటుకుపోయింది. ఐతే, గుండెనొప్పి వచ్చినప్పుడు ఒకవేళ మనం ఒంటరిగా ఉన్నా మనల్ని మనం రక్షించుకోవచ్చు. ఓ వ్యక్తి తన జీవితంలో జరిగిన ఓ సంఘటన గురించి చెబుతూ ఇలా మాట్లాడాడు.
అప్పుడు రాత్రి 7 అయింది , ఆరోజు ఎక్కువ పని.. బాగా అలసిపోయి తిరిగి వచ్చాను. ఎంతో నిస్సత్తువగా వుంది. ఇంతలో అకస్మాత్తుగా గుండెలో ఎదో గట్టిగా పట్టేసినట్లు తీవ్రంగా నొప్పి. ఆ నొప్పి అలా భుజాల వరకు, ఇంకా పైకి దవడల వైపు కూడా ప్రాకుతుంది. ఇలాంటి క్లిష్ట సమయంలో హాస్పిటల్ చికిత్స అందే లోపల ఎవరికి వారే చికిత్స చేసుకునే విధానం తెలియక ఎంతో మంది ప్రాణాలు కోల్పోతున్నారు, మరేం చేయాలి ?
Also Read: రైల్‌టెల్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియాలో జాబ్స్.. భారీ వేతనంతో?
ఇటువంటి సంకట పరిస్థితిలో హాస్పిటల్ చికిత్స అందే లోపల మన ప్రాణాలను మనమే ఎలా కాపాడుకోవచ్చో తెలుసా ? ఆ క్లిష్టమైన ఘడియలలో గుండె కొట్టుకోవడంలో లయ తప్పుతుందని మనకు అర్థం అవుతున్న సమయంలో, దగ్గరలో ఎటువంటి సహాయం అందే మార్గం లేనప్పుడు, ఇక స్పృహ కోల్పోతామేమో… మనకు ఇంకా ఓ పది సెకన్ల సమయం మాత్రం మన చేతిలో వుంది, ఆ అమూల్యమైన సమయంలో మనం చేయాల్సిన పని ఒక్కటే.. ఒక్క దగ్గటం మాత్రమే.
అవును, మీరు విన్నది, నిజమే. ఆశ్చర్యంగా వుంది కదూ ! ఆ దగ్గు రిపీట్ చేస్తుండటమే. అది ఎలా అంటే, దగ్గే ముందు ఊపిరి బాగా పీల్చుకుంటూ దగ్గుతుండాలి, ఒకసారి ఊపిరి పీల్చుకుని దగ్గటానికి రెండు సెకండ్ల చొప్పున కేటాయిస్తూ,బాగా లోతునుంచి, ఒకవేళ కఫం వున్నట్లయితే,అది బయటకు వచ్చేటట్లు ఎలా దగ్గుతామో అంత ఉదృతంగా, ఆగకుండా దగ్గాలి. ఈ దగ్గటం మనకు ఎంతలా సహాయ పడుతుందంటే , మనం గట్టిగా ఊపిరి పీల్చినప్పుడు, మన ఊపిరి తిత్తులలో ఆక్సిజన్ పూర్తిగా నిండి, గుండె మీద ఒత్తిడి తెచ్చి పెడుతుంది.
Also Read:రాత్రి సమయంలో వేడి నీళ్లు తాగితే ఇన్ని ఉపయోగాలు ఉన్నాయా?