ప్రస్తుత కాలంలో ఎంతోమందిని వేధిస్తున్న ఆరోగ్య సమస్యలలో షుగర్ కూడా ఒకటి. వయస్సుతో సంబంధం లేకుండా ఎంతోమంది షుగర్ బారిన పడుతున్నారు. షుగర్ బారిన పడిన వాళ్లు చక్కెర స్థాయిలను అదుపులో ఉంచుకుంటే మాత్రమే ఇతర ఆరోగ్య సమస్యల బారిన పడకుండా రక్షించుకునే ఛాన్స్ ఉంటుంది. షుగర్ వచ్చిన వాళ్లను గుండె జబ్బులు, దృష్టి సమస్యలు, ఇతర ఆరోగ్య సమస్యలు వేధించే ఛాన్స్ ఉంటుంది.
శరీరంలో షుగర్ లెవెల్స్ తక్కువగా ఉన్నా కూడా ఆరోగ్య సమస్యలు వస్తాయి. గందరగోళం, మైకంతోపాటు విపరీతంగా ఆకలి వేయడం, భయం, ఆందోళన, చిరాకు, వణుకు, చెమటలు పట్టడం ఇతర ఆరోగ్య సమస్యలు వేధించే అవకాశం ఉంటుంది. అయితే ఈ లక్షణాలు ఒక్కో వ్యక్తిలో ఒక్కో విధంగా ఉంటాయి. రక్తంలో షుగర్ లెవెల్స్ పెరిగినా తగ్గినా గ్యాస్ట్రోపరేసిస్ అనే పరిస్థితి వస్తుంది. వాగస్ నరాల వ్యవస్థను లో బ్లడ్ షుగర్ ప్రభావితం చేస్తుంది.
లో బ్లడ్ షుగర్ వల్ల బలహీనత, తల తిరగడం, ఇతర లక్షణాలు కనిపించే అవకాశాలు ఉంటాయి. రక్తంలో చక్కెర స్థాయిలు మరింత ఎక్కువగా తగ్గితే మూర్ఛలు, స్పృహ కోల్పోవడం, ప్రాణాలు కోల్పోవడం జరగవచ్చు. షుగర్ లెవెల్స్ కంట్రోల్ లో ఉండాలంటే గ్లైసెమిక్ ఇండెక్స్ తక్కువగా ఉండే ఆహార పదార్థాలను తీసుకోవాలి. బార్లీ, పెరుగు, వోట్స్, బీన్స్, చిక్కుళ్లు తక్కువ్ గ్లైసెమిక్ ఇండెక్స్ ను కలిగి ఉంటాయి.
నీళ్లు తాగడం ద్వారా శరీరాన్ని హైడ్రేట్ గా ఉంచుకునే అవకాశం ఉంటుంది. నీళ్లు చక్కెర స్థాయిలను ఆరోగ్యకరమైన పరిధిలో ఉంచుతాయి. నూడుల్స్, బ్రెడ్, పాస్తా, ఇతర ఆహారాలకు దూరంగా ఉండటం ద్వారా బ్లడ్ షుగర్ లెవెల్స్ ను కంట్రోల్ చేసుకోవచ్చు. ప్రతిరోజూ వ్యాయామం చేయడం ద్వారా షుగర్ లెవెల్స్ కంట్రోల్ లో ఉండటంతో పాటు ఇన్సులిన్ సెన్సిటివిటీ పెరుగుతుంది.