https://oktelugu.com/

Eat : శృంగారానికి ముందు వీటిని అసలు తినద్దు. లేదంటే డేంజర్

శృంగారానికి ముందు క్యాలీఫ్లవర్ తినకూడదు. ఇందులో క్లిష్టమైన చక్కెరలు ఉంటాయి. ఇది హార్మోన్లను ప్రభావితం చేస్తుంది. దీంతో.. గ్యాస్ వంటి సమస్యలు వస్తాయి. అందుకే శృంగారానికి ముందు క్యాలీఫ్లవర్ స్కిప్ చేయడమే బెటర్ అంటున్నారు పండితులు.

Written By:
  • Swathi Chilukuri
  • , Updated On : November 14, 2024 / 10:22 AM IST

    Do not eat these before sex. Otherwise it is dangerous

    Follow us on

    Eat : వివాహ బంధంలో శృంగారం చాలా ముఖ్యం.శారీరక సాన్నిహిత్యం చాలా కీలకం. దీన్ని నిర్లక్ష్యం చేయకూడదు. ఎంత సంతోషంగా ఉన్నా సరే శృంగారం లేకపోతే ఆ వివాహ బంధంలో కల్లోలం తప్పదు అంటున్నారు నిపుణులు. దీని వల్ల గొడవలు వచ్చే ప్రమాదముంది. అయితే, కొన్ని ఫుడ్స్ తింటే శృంగారంపై ఎఫెక్ట్ ఉంటుంది. వీటిని లైంగిక కలయికకు ముందు అసలు తినకూడదు. ఇంతకీ ఎలాంటి ఆహారం తీసుకోవద్దు అనుకుంటున్నారా? అయితే చదివేయండి.

    శృంగారానికి ముందు క్యాలీఫ్లవర్ తినకూడదు. ఇందులో క్లిష్టమైన చక్కెరలు ఉంటాయి. ఇది హార్మోన్లను ప్రభావితం చేస్తుంది. దీంతో.. గ్యాస్ వంటి సమస్యలు వస్తాయి. అందుకే శృంగారానికి ముందు క్యాలీఫ్లవర్ స్కిప్ చేయడమే బెటర్ అంటున్నారు పండితులు.

    బీన్స్ లేదా చిక్కుళ్లు ఆరోగ్యానికి చాలా ప్రయోజనాలను అందిస్తాయి. కానీ ఇందులో చక్కెర అణువుల శాతం ఎక్కువ. ఇవి జీర్ణం కావడానికి చాలా సమయం పడుతుంది. దీంతో.. కడుపులో గందరగోళంగా ఉంటుంది. ఈ పరిస్థితి శృంగారానికి అనువైనది కాదు. సో స్కిప్.

    పాప్ కార్న్ జోలికి కూడా పోవద్దు అంటున్నారు నిపుణులు. శృంగారానికి ముందు ఈ పాప్ కార్న్ తింటే పురుషుల్లో టెస్టోస్టిరాన్ హార్మోన్ స్థాయిలు తగ్గుతాయి. ఫలితంగా స్పెర్మ్ కౌంట్ తగ్గే అవకాశం ఎక్కువ. అందుకే కలయికకు ముందు పాప్ కార్న్ స్కిప్ చేయండి. ముఖ్యంగా మగవారు ఎక్కువ గుర్తు పెట్టుకోవాలి.

    బేకరీ ఐటమ్స్ అంటే చాలా ఇష్టం కదా మీకు. కుకీలు, కేకులు, బిస్కెట్స్ వంటి వాటిని కలయికకు ముందు ముట్టుకోవద్దు. వీటిలో చక్కెర శాతం ఎక్కువ. అంతేకాకుండా ట్రాన్స్ ఫ్యాట్ ఎక్కువగా ఉండటం వల్ల మీకు మంచిది కాదు. అంటే ఇవి లైంగిక ఆసక్తిని తగ్గిస్తుంటాయి. అందుకే షుగరీ డ్రింక్స్ ఫుడ్స్‌ను శృంగారానికి ముందు స్కిప్ చేయడమే ఉత్తమం అంటున్నారు నిపుణులు.

    జంక్ ఫుడ్‌కి చాలా మంది అలవాటు పడిపోయారు. టేస్ట్ రుచిగా ఉంటుంది కాబట్టి తెగ తింటున్నారు. అయితే, ఇవి ఆరోగ్యానికి మంచిది కాదు. వీటిని ఎక్కువగా తినడం తింటే లైంగికంగా చురుగ్గా ఉండలేరు. జంక్ ఫుడ్స్ తింటే బద్ధకం, ఎక్కువ అవుతుంది. నిద్ర మత్తు కూడా. సో స్కిప్ చేయండి.

    ప్యాకేజ్డ్ ఆహారాలు కూడా తినవద్దు. ఇందులో ఉప్పు అధికంగా ఉంటుంది. ఇలాంటి ఆహారాలు కలయికకు ముందు మంచివి కావు. ప్రాసెస్ చేసిన భోజనం, స్నాక్స్ కు వీలైనంత దూరంగా ఉండండి. ఎక్కువ ఉప్పు తీసుకోవడం వల్ల కడుపు ఉబ్బరం, గ్యాస్ట్రిక్ సమస్యలు వస్తుంటాయి. అంతేకాదు రక్తప్రసరణను తగ్గిస్తాయి. దీంతో.. లైంగిక ఆసక్తి తగ్గిపోతుంది అంటున్నారు నిపుణులు.

    శృంగారానికి ముందు ఆల్కహాల్, ధూమపానానికి ఎంత దూరంగా ఉంటే అంత బెటర్. షుగరీ డ్రింక్స్, కూల్ డ్రింక్స్, వేయించిన ఆహారాలను కూడా ముట్టుకోవద్దు. వీటి వల్ల నిద్ర ఎక్కువ వస్తుంది. అంతేకాకుండా లైంగిక కోరికలు తగ్గుతాయి. సో వీటికి దూరంగా ఉండటం బెటర్.