Financial problems: జ్యోతిష్యం శాస్త్రం ప్రకారం మన ఇంట్లో.. మన చుట్టుపక్కల ఉండే వస్తువులే.. మన అదృష్టాన్ని, ఆర్థిక పరిస్థితులను ప్రభావితం చేస్తాయి. ఆ వస్తువులు మన ఇంట్లో ఉంటే మన పరిస్థితి తలకిందులు అవుతుంది. జ్యోతిష్యం ప్రకారం ఇంట్లో ఈ వస్తువులు ఉంటే మీరు వెంటనే తీసేయండి.. లేదంటే అష్ట దరిద్రంతో రూపాయి లేక తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటారు.
Financial problems
-ఇంట్లో పావురం గూడు ఉంటే మీ ఆర్థిక పరిస్థితిని అది తీవ్రంగా దెబ్బతీస్తుంది. మీ ఇంట్లో ఎప్పుడూ పావురాలు పెంచరాదు. ఒకవేళ మీకు తెలియకుండా పావురాల గూడు పెట్టినా మీరు వెంటనే తీసేయండి..
-ఇక ఇంట్లో తేనెతెట్టే ఉండడం కూడా మంచిది కాదు. అది గనుక మీ ఇంట్లో ఉంటే మీకు తీవ్ర దురదృష్టాన్ని కలిగిస్తుంది. సాలెగూడు ఉంటే అది కూడా మీకు అకస్మాత్తుగా కలిగే నష్టాలను సూచిస్తుంది.
-ఇంట్లో గబ్బిలాలు ఉంటే అరిష్టం.. మరణ సూచకం. వాటిని ఇంట్లోకి రాకుండా చూసుకోండి
Also Read: MLA Rajaiah Brother: ఎమ్మెల్యే తాటికొండ తమ్ముడి అరాచకాలు.. ఆత్మహత్యే శరణ్యమంటున్న మహిళ..
-ఇక మీ ఇంట్లో గోడలు, పైకప్పు పెచ్చులు రాలిపోకుండా చూసుకోవాలి. రంగుపోయినట్టు ఉండడం కూడా దురదృష్టానికి సూచిక.. అలా ఉన్న ఇంటికి దారిద్రదేవత ఆకర్షితులవుతుంది.
-ఇక ఇంట్లో కుళాయిలు ఎప్పుడూ ఆఫ్ లోనే ఉండాలి. నీళ్లు కారుతుంటే అలానే సంపాదన కూడా ఆవిరైపోతుందని అర్థం.
-పనికిరాని వస్తువులు స్టోర్ చేయవద్దు. అలా ఉంటే బయట పడేయడమో.. ఎవరికైనా ఇవ్వడమో చేయండి. అలానే పెట్టుకుంటే అష్ట దరిద్రం..
-ఇంట్లో దైవారాదన రెగ్యులర్ చేయాలి. లేకుంటే దరిద్ర దేవత ఆవహిస్తుంది. దేవుడిని పూజించిన పువ్వులు ఎవ్వరూ తొక్కని ప్రదేశాల్లో పారేయాలి.
-మీ ఇంటి ఆవరణను కూడా ఎప్పటికప్పుడు శుభ్రం చేసుకోవాలి. అలా ఉంచుకోకుంటే నెగెటివ్ ఎనర్జీ మిమ్మల్ని ఆవహిస్తుంది.
ఇలాంటివి పాటించి జాగ్రత్తలు తీసుకుంటే మీ ఇంట్లోకి దరిద్ర దేవత రాదు. మీ ఆర్థిక పరిస్థితులు దిగజారవు. సో ఇంట్లో ఇవి పాటించడం మరిచిపోకండి
Also Read: Vijayasai Reddy: ప్రమోషనా.. డిమోషనా? వైసీపీలో విజయసాయి స్థానం ఏంటి?
Recommended Videos: