https://oktelugu.com/

Prevent Heart Disease: ఇవి తీసుకోవడం వల్ల గుండెజబ్బు ముప్పు నుంచి తప్పించుకోవచ్చు తెలుసా?

Prevent Heart Disease: గుండె జబ్బుల ప్రమాదాలు ఎక్కువవుతున్నాయి. రెండు తెలుగు రాష్ట్రాల్లో పాతికేళ్ల వారే ఎక్కువగా గుండె జబ్బుల బారిన పడి ప్రాణాలు కోల్పోయారు. ఉన్నట్లుండి కిందపడిపోయి ఆస్పత్రిలో చేర్చేలోగానే ప్రాణాలు గాల్లో కలిసిపోవడం ఆందోళన కలిగిస్తోంది. దీనికి ప్రధాన కారణం ఉప్పు వాడకమే అని చెబుతున్నారు. దీంతో ఉప్పును ఎంత తక్కువగా వాడితే అంత మంచిది. మన శరీరంలో రక్తప్రసరణ ద్వారా గుండె సరిగా పనిచేస్తుంది. రక్తప్రసరణలో తేడాలు వచ్చిన నాడు గుండెపోటు రావడం […]

Written By:
  • Srinivas
  • , Updated On : March 13, 2023 / 08:59 AM IST
    Follow us on

    Prevent Heart Disease: గుండె జబ్బుల ప్రమాదాలు ఎక్కువవుతున్నాయి. రెండు తెలుగు రాష్ట్రాల్లో పాతికేళ్ల వారే ఎక్కువగా గుండె జబ్బుల బారిన పడి ప్రాణాలు కోల్పోయారు. ఉన్నట్లుండి కిందపడిపోయి ఆస్పత్రిలో చేర్చేలోగానే ప్రాణాలు గాల్లో కలిసిపోవడం ఆందోళన కలిగిస్తోంది. దీనికి ప్రధాన కారణం ఉప్పు వాడకమే అని చెబుతున్నారు. దీంతో ఉప్పును ఎంత తక్కువగా వాడితే అంత మంచిది. మన శరీరంలో రక్తప్రసరణ ద్వారా గుండె సరిగా పనిచేస్తుంది. రక్తప్రసరణలో తేడాలు వచ్చిన నాడు గుండెపోటు రావడం సహజం. మరి రక్తనాళాల్లో అవాంతరాలు లేకుండా చూసుకుంటేనే గుండె జబ్బులు రాకుండా ఉంటాయి. దీనికి మనం సరైన ఆహారాలు తీసుకోవడమే ఉత్తమం.

    ఏ ఆహారాలు తీసుకోవాలి?

    గుండెకు రక్త సరఫరా సరిగా జరగాలంటే ఒమేగా 3 యాసిడ్స్ ఉండే ఆహారాలు తీసుకోవాలి. ఇవి చేపల్లో ఎక్కువగా ఉంటుంది. శాఖాహారంలో అయితే అవిసె గింజలు చాలా బాగా ఉపయోగపడతాయి. వీటిని తేనె, ఖర్జూరాలతో ఉండలు చేసుకుని తినొచ్చు. వేయించి పొడి చేసుకుని కూరల్లో వాడుకోవచ్చు. ఎలాగైనా వీటిని తీసుకోవడం వల్ల మనకు చెడు కొవ్వు పెరగకుండా చేయడంలో ప్రధాన పాత్ర పోషిస్తాయి. అందుకే ఆరోగ్య నిపుణులు అవిసె గింజలను వాడుకోండి అని చెబుతున్నారు.

    బ్రెయిన్ స్ట్రోక్స్

    రక్తప్రసరణ మెదడుకు సరిగా సరఫరా కాకపోతే బ్రెయిన్ స్ర్టోక్స్ వచ్చే అవకాశం ఉంటుంది. బ్రెయిన్ స్ర్టోక్స్ వస్తే ఇక ప్రాణాలు పోయినట్లే. ఏది పనిచేయదు. నరాలు చచ్చుబడిపోయి శవం మాదిరి ఉండాల్సిందే. ఇలాంటి ప్రమాదాలు వస్తున్నందున వాటి నుంచి తప్పించుకునేందుకు మనం ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాల్సిందే. మన ఆహారాల్లో మార్పులు చేసుకోవాల్సిందే. లేదంటే తగిన మూల్యం చెల్లించుకోవాల్సి రావొచ్చు. రక్తనాళాల్లో చెడు కొలెస్ట్రాల్ పెరిగితే వచ్చే ముప్పులే ఈ హార్ట్ స్ట్రోక్, బ్రెయిన్ స్ర్టోక్స్.

    అన్ని అవయవాలకు..

    రక్త ప్రసరణ అన్ని అవయవాలకు అందితేనే సరిగ పనిచేస్తాయి. రక్తప్రసరణ అందకపోతే ఆ భాగాలకు గాలి, నీరు, పోషకాలు అందకుండా ఇబ్బంది పడతాయి. మిగతా వాటికి అంత తేలిగ్గా ఏం కాదు కానీ గుండె, బ్రెయిన్ కు మాత్రం త్వరగా ఫలితం కనిపిస్తుంది. దీంతో ప్రాణాంతక జబ్బులు గుండెపోటు, బ్రెయిన్ స్ట్రోక్స్ వచ్చే అవకాశాలు ఎక్కువ. అందుకే తగిన ఆహారాలు తీసుకుని మన గుండె, బ్రెయిన్ ను కాపాడుకోవాల్సిన అవసరం మన మీదే ఉంది. తగిన జాగ్రత్తలు తీసుకోకపోతే భవిష్యత్ లో ఇబ్బందులు ఎదుర్కోక తప్పదు.

    బ్యాడ్ కొలెస్ట్రాల్

    రక్తనాళాల్లో బ్యాడ్ కొలెస్ట్రాల్ పేరుకుపోకుండా చూసుకోవాలి. కాలువల్లో చెత్త పేరుకుపోతే నీటి సరఫరా ఎలా నిలిచిపోతోందో రక్త నాళాల్లో చెడు కొవ్వు పేరుకుపోతే రక్తప్రసరణ సరిగా జరగక ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుంది. దీంతో మనకు గుండెపోటు, బ్రెయిన్ స్ర్టోక్స్ వంటివి వస్తే తట్టుకోవడం కష్టమే. అందుకే వాటి నుంచి తప్పించుకోవాలంటే సరైన ఆహారం తీసుకుని ఆరోగ్యాన్ని రక్షించుకోవాల్సిన విధంగా మన డైట్ ప్లాన్ చేసుకోవడం ఉత్తమం.