https://oktelugu.com/

Periods Problem: ఈ ద్రావణం తాగితే నెలసరి సమస్యలు ఉండవు తెలుసా?

Periods Problem: ఇటీవల కాలంలో చాలా మంది రుతుక్రమం సమస్యలతో బాధపుతున్నారు. కొంత మంది రెండు మూడు నెలలకోసారి అవుతున్నారు. దీని వల్ల ఆరోగ్య సమస్యలు వస్తాయి. వారు ఎవరికి చెప్పుకోలేక సతమతమవుతుంటారు. దీని నుంచి బయట పడేందుకు ఇంగ్లిష్ మందులు వేసుకున్నా ఫలితం ఉండదు. పైగా అలాంటి మందులతో సైడ్ ఎఫెక్ట్ లు వస్తాయి. ఈ నేపథ్యంలో నెలసరి ఇబ్బందుల నుంచి రక్షించుకోవాలని అందరు భావిస్తారు. దీనికి సులభంగా ఉండే చిట్కా ఒకటి ఉందనే విషయం […]

Written By:
  • Srinivas
  • , Updated On : March 26, 2023 / 11:15 AM IST
    Follow us on

    Periods Problem

    Periods Problem: ఇటీవల కాలంలో చాలా మంది రుతుక్రమం సమస్యలతో బాధపుతున్నారు. కొంత మంది రెండు మూడు నెలలకోసారి అవుతున్నారు. దీని వల్ల ఆరోగ్య సమస్యలు వస్తాయి. వారు ఎవరికి చెప్పుకోలేక సతమతమవుతుంటారు. దీని నుంచి బయట పడేందుకు ఇంగ్లిష్ మందులు వేసుకున్నా ఫలితం ఉండదు. పైగా అలాంటి మందులతో సైడ్ ఎఫెక్ట్ లు వస్తాయి. ఈ నేపథ్యంలో నెలసరి ఇబ్బందుల నుంచి రక్షించుకోవాలని అందరు భావిస్తారు. దీనికి సులభంగా ఉండే చిట్కా ఒకటి ఉందనే విషయం చాలా మందికి తెలియదు. కానీ దాని గురించి తెలుసుకుని ఆచరిస్తే ఎంతో ప్రయోజనం కలుగుతుంది.

    ప్రస్తుతం చాలా మంది అధిక బరువు సమస్యతో బాధపడుతున్నారు. దీంతో పీసీవోడీ సమస్య కూడా ఇబ్బందులకు గురిచేస్తోంది. పలు రకాల మందులు వాడుతూ ఆస్పత్రుల చుట్టూ తిరుగుతున్నారు. మందులు వాడినా ప్రయోజనం లేకపోవడంతో నిరాశ చెందుతున్నారు. ఈ చిట్కా ఆచరిస్తే కేవలం ముప్పై నిమిషాల్లోనే సహజంగా పీరియడ్ వస్తుంది. ఈ పానీయం తాగడం వల్ల తాగిన 30 నిమిషాల్లోనే నెలసరి రావడం గమనించుకోవచ్చు. ఇంతటి సింపుల్ చిట్కాతో ఆడవారికి ఇబ్బందులు లేకుండా పోతాయి.

    ఒక పాత్రలో 200 ఎంఎల్ నీరు పోయాలి. దాన్ని వేడి చేయాలి. వేడి అవుతున్న క్రమంలో ఒక టీ స్పూన్ కొత్తిమీర, ఒక టీ స్పూన్ జీలకర్ర వేసి పది నిమిషాలు మరిగించాలి. కొద్దిసేపటి తరువాత అందులో రెండు చెంచాల బెల్లం వేసి ఉడకనివ్వాలి. పావుగంట తరువాత దాన్ని చల్లారనివ్వాలి. ఇప్పుడు వడకట్టి దాన్ని ఉదయం పూట పరగడుపున ఒక గ్లాసు తీసుకుంటే ఎంతో ప్రయోజనం ఉంటుంది. నెలసరి అరగంట తరువాత ప్రారంభం అవుతుంది. ఇలా చేయడం వల్ల సైడ్ ఎఫెక్టులు కూడా ఉండవు.

    Periods Problem

    నెలసరి రెండు మూడు రోజుల ముందు రావాలనుకునే వారు కూడా దీన్ని తాగితే ఫలితం ఉంటుంది. ఈ పానీయాన్ని వరుసగా మూడో రోజులు తాగడం వల్ల రుతుక్రమం వస్తుంది. దీంతో రక్త శుద్ధి అవుతుంది. ఇది తాగిన తరువాత 45 నిమిషాల పాటు ఏమి తినకూడదు. రెండు మూడు నెలలకొకసారి నెలసరి వచ్చే వారు దీన్ని తాగడం వల్ల రుతుక్రమం సమస్యలు లేకుండా పోతాయి. చాలా మంది ఈ ఇబ్బందులు ఎదుర్కొంటున్నందున ఈ సులభమైన చిట్కా ఉపయోగించుకుని నెలసరి సమస్య నుంచి ఉపశమనం పొందొచ్చు.