https://oktelugu.com/

Coconut Water : కొబ్బరి నీళ్లు తాగడం వల్ల కూడా అనారోగ్యాలున్నాయని తెలుసా?

Coconut Water : మనకు తక్షణమే శక్తినిచ్చే ద్రావణాలు కొన్ని ఉన్నాయి. ఇందులో కొబ్బరినీళ్లు కూడా ఉంటాయి. కొబ్బరి నీళ్లు తాగడం వల్ల ఆరోగ్యం కలుగుతుందని వైద్యులు సైతం చెబుతుంటారు. దీన్ని మ్యాజిక్ డ్రింక్, నేచురల్ డ్రింక్ గా భావిస్తుంటారు దీన్ని కూడా అధికంగా తాగితే అనార్థాలు వస్తాయని హెచ్చరిస్తున్నారు. అతి దేనికైనా ఇబ్బందులు తెస్తుందనే విషయం మనకు తెలిసిందే. ఈ నేపథ్యంలో కొబ్బరినీళ్లు కూడా మితంగానే తాగాలి. కొబ్బరినీళ్లు ఎక్కువగా తాగితే జీర్ణవ్యవస్థపై ప్రభావం పడుతుంది. […]

Written By:
  • Srinivas
  • , Updated On : March 27, 2023 / 09:03 AM IST
    Follow us on

    Coconut Water : మనకు తక్షణమే శక్తినిచ్చే ద్రావణాలు కొన్ని ఉన్నాయి. ఇందులో కొబ్బరినీళ్లు కూడా ఉంటాయి. కొబ్బరి నీళ్లు తాగడం వల్ల ఆరోగ్యం కలుగుతుందని వైద్యులు సైతం చెబుతుంటారు. దీన్ని మ్యాజిక్ డ్రింక్, నేచురల్ డ్రింక్ గా భావిస్తుంటారు దీన్ని కూడా అధికంగా తాగితే అనార్థాలు వస్తాయని హెచ్చరిస్తున్నారు. అతి దేనికైనా ఇబ్బందులు తెస్తుందనే విషయం మనకు తెలిసిందే. ఈ నేపథ్యంలో కొబ్బరినీళ్లు కూడా మితంగానే తాగాలి. కొబ్బరినీళ్లు ఎక్కువగా తాగితే జీర్ణవ్యవస్థపై ప్రభావం పడుతుంది. దీని వల్ల పేగుల్లో కదలికల సమస్య ఏర్పడుతుంది. ఇది డయేరియాకు దారి తీసే పరిస్థితులు ఉంటాయి.

    కసరత్తులు చేసేవారు..

    జిమ్ కు వెళ్లే వారు శరీరం హైడ్రేడ్ గా ఉండటానికి కొబ్బరినీళ్లు తీసుకోకూడదు. వీటికి బదులు మంచినీళ్లు తాగడమే మంచిది. కొబ్బరినీళ్లలో సోడియం తక్కువగా ఉంటుంది. కార్బోహైడ్రేడ్ల కంటెంట్ కూడా తక్కువగా ఉంటుంది. రాత్రిపూట కొబ్బరినీళ్లు తాగడం వల్ల మధుమేహం ఉన్న వారికి రక్తంలో చక్కెర స్థాయిలు పెరిగే ప్రమాదం ఉంటుంది. మూత్ర విసర్జన ఎక్కువవుతుంది. దీంతో నిద్రకు ఇబ్బంది కలుగుతుంది. ఇలాంటి సమస్యలున్నందున కొబ్బరి నీళ్లు తాగేటప్పుడు జాగ్రత్తలు తీసుకోవడం తప్పనిసరి.

    పొటాషియం

    కొబ్బరినీళ్లలో కార్బోహైడ్రేడ్లు, కేలరీలు అధికంగా ఉంటాయి. చక్కెర వ్యాధి ఉన్న వారు రోజుకు ఒక గ్లాసు కంటే ఎక్కువగా తీసుకుంటే ఇబ్బందులు వచ్చే అవకాశం ఉంటుంది. కొబ్బరినీళ్లలో పొటాషియం ఎక్కువగా ఉంటుంది. దీని వల్ల హైపర్ కలేమియా ఏర్పడి స్ప్రహ కోల్పోయే ప్రమాదముంది. మూత్ర పిండాల వ్యాధి ఉన్న వారు కొబ్బరినీళ్లు తీసుకోవద్దు. ఇందులోని పొటాషియం కంటెంట్ హైపర్ కలేమియా రావడానికి కారణంగా నిలుస్తోంది. దీని వల్ల కొబ్బరినీళ్లు తీసుకోవడానికి ముందు ఈ విషయాలు తెలుసుకోవడం మంచిది.

    లోబీపీ

    కొబ్బరినీళ్లు రక్తపోటును నియంత్రిస్తాయి. అందుకే లోబీపీ ఉన్న వారు వీటిని తీసుకోకపోవడమే సురక్షితం. ఇందులో ఉండే పొటాషియం కంటెంట్ లోబీపీకి కారణమవుతుంది. దీంతో లోబీపీ ఉన్నవారు వీటిని తీసుకోకపోవడమే మంచి మార్గం. కొబ్బరి సంబంధిత పదార్థాలు తీసుకుంటే కొందరికి అలర్జీలు వస్తాయి. దీని వల్ల కొబ్బరి నీళ్లకు కూడా దూరంగా ఉండాలి. ఇన్ని రకాల ఇబ్బందులున్నందున కొబ్బరినీళ్లు తీసుకోవడంలో సమస్యలు ఉన్న వారు జాగ్రత్తలు తీసుకోవాలి. ఇతర వ్యాధులు ఉన్న వారు వాటికి దూరంగా ఉండటమే శ్రేయస్కరం.