Diet Soda: అత్యంత ప్రమాదకరమైన వ్యాధి మధుమేహం. దీంతో అన్ని అవయవాలు పాడైపోయే ప్రమాదం పొంచి ఉందని తెలిసిందే. దీంతో లోపల అవయవాలు అన్నిటిపై ప్రభావం చూపుతుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఈ నేపథ్యంలో షుగర్ వ్యాధి పట్ల అప్రమత్తంగా ఉండకపోతే ఒళ్లు గుళ్ల కావడం మామూలు విషయమే. దీంతో మధుమేహులు తమ ఆరోగ్యంపై జాగ్రత్తలు తీసుకోవాల్సిందే. ప్రతి రోజు వ్యాయామం చేయాలి. ఉదయం, సాయంత్రం నడక కొనసాగించాలి. దీంతో షుగర్ లెవల్స్ పెరగకుండా నిరంతరం చూసుకోవాలి.
చక్కెర స్థాయి పెరిగితే దాని ప్రభావం గుండె, ఊపిరితిత్తులు, కిడ్నీలు, లివర్ తదితర అవయవాలపై తీవ్ర ప్రభావం చూపుతుంది. ఇంకా కళ్లు కూడా చూపు కోల్పోయే అవకాశం ఉంటుంది. చాలా మందిలో డయాబెటిస్ రెటినోపతి ద్వారా కంటి చూపు మందగించే ప్రమాదం ఉంది. ఈ క్రమంలో డయాబెటిక్ పేషెంట్లు ఎప్పటికప్పుడు షుగర్ ను అదుపులో ఉంచుకునేందుకు ప్రాధాన్యం ఇవ్వాలి. లేదంటే ప్రమాదాన్ని జేబులో పెట్టుకుని తిరిగినట్లే అని గుర్తుంచుకోవాలి. షుగర్ లెవల్స్ ఎప్పుడు కూడా పెరగకుండా నియంత్రించే పద్ధతులు అనుసరించాలి.
Also Read: Lord Krishna House: బయటపడ్డ ఐదు వేల ఏళ్లనాటి శ్రీకృష్ణుడి ఇల్లు..
నిరంతరం వైద్యుల పర్యవేక్షణలోనే ఉండాలి. క్రమం తప్పకుండా షుగర్ టెస్టులు చేయించుకోవాలి. దీంతో చక్కెర ఎక్కువ కాకుండా చూసుకోవాలి. గర్భవతులు, పొగాకు వాడేవారు, అధిక రక్తపోటు ఉన్నవారు, శరీరంలో కొవ్వు పేరుకుపోయిన వారు జాగ్రత్తలు తీసుకోవాలి. అన్ని అవయవాలు పరీక్షించుకుంటూ ఉండాలి. కళ్లకు ఇబ్బందులు ఏర్పడితే తక్షణమే వైద్యుడిని సంప్రదించి సరైన చికిత్స తీసుకోవాలి. లేదంటే రెటినోపతి దెబ్బతిని కంటి చూపు పోయే ప్రమాదం ఉంటుంది. దీని వల్ల అనేక అనర్థాలు చోటుచేసుకునే వీలుంది.
షుగర్ లెవల్స్ పెరిగితే రక్తనాళాలు దెబ్బతిని రక్తసరఫరా నిలిచిపోతుంది. తద్వారా అవయవాలు దెబ్బతింటాయి. దీంతో మనకు ముప్పు ఏర్పడే అవకాశం ఉంది. అందుకే ఎప్పుడైనా మనం నిర్లక్ష్యంగా ఉండకుండా జాగ్రత్తలు తీసుకుని టెస్టులు చేయించుకుంటుండాలి. దీంతో మనకు ఆరోగ్య సమస్యలు రాకుండా ఉంటాయనడంలో సందేహం లేదు. మధుమేహులు జాగ్రత్త సుమా. తమ శరీరాన్ని కాపాడుకునే క్రమంలో నిరంతరం పరీక్షలు చేయించుకోవడం తప్పనిసరి అని గుర్తుంచుకోండి.
మధుమేహులు ఎక్కువగా డైట్ సోడా తీసుకోకూడదు. కూల్ డ్రింక్స్ తాగకూడదు. వీటిలో ఉండే పదార్థాలతో కంటి చూపుపై ప్రభావం పడనుంది. ప్రతి రోజు 1.5 లీటర్ల డైట్ సోడా తాగితే కంటిచూపు కోల్పోయే ప్రమాదం పొంచి ఉంది. ఇంకా కూల్ డ్రింక్స్ వల్ల కూడా అధిక నష్టమే జరగనుంది. అందుకే వాటి జోలికి వెళ్లకపోవడమే మంచిది. నిరంతరం వాటిని తీసుకుంటే కచ్చితంగా కంటి చూపు దెబ్బతిని గుడ్డివాడిగా మారే సూచనలు కనిపిస్తున్నాయి. షుగర్ పేషెంట్టు వాటిని తీసుకోవద్దని డాక్టర్లు హెచ్చరిస్తున్నారు.