Fasting: మనలో చాలామందికి బరువు తగ్గాలని కోరిక ఉంటుంది. అయితే కొంతమంది ఎంత ప్రయత్నించినా బరువు తగ్గే విషయంలో విఫలమవుతూ ఉంటారు. బరువు తగ్గాలని భావించే వాళ్లు ఇంటర్‌మిటెంట్ ఫాస్టింగ్ ద్వారా సులభంగా బరువు తగ్గవచ్చు. ఇంటర్‌మిటెంట్ ఫాస్టింగ్ కు తెలుగులో అర్థం అప్పుడప్పుడు ఉపవాసం కాగా ఈ ఉపవాసం చేయడం వల్ల ఊహించని స్థాయిలో లాభాలు పొందే ఛాన్స్ అయితే ఉంటుంది. ఉదయం బ్రేక్ ఫాస్ట్ కు దూరంగా ఉండటంతో పాటు రాత్రి డిన్నర్ కు దూరంగా ఉంటూ మధ్యాహ్నం తక్కువ మొత్తం ఆహారం తీసుకోవడాన్ని ఇంటర్‌మిటెంట్ ఫాస్టింగ్ అని అంటారు.
సాధారణంగా మనలో చాలామంది పండుగల సమయంలో శుభఫలితాలు పొందడానికి ఉపవాసంపై దృష్టి పెడతారు. ప్రస్తుతం చాలామంది రుచికరమైన ఆహారానికి ప్రాధాన్యత ఇవ్వడంతో పాటు జంక్ ఫుడ్ కు అలవాటు పడుతుండటంతో రోగాలు చుట్టుముడుతున్నాయి. ఎవరైతే ఇంటర్‌మిటెంట్ ఫాస్టింగ్ చేస్తారో వాళ్ల లైఫ్ టైమ్ పెరుగుతుందని జీర్ణక్రియ మెరుగు పడుతుందని బరువు అదుపులో ఉంటుందని వైద్య నిపుణులు వెల్లడిస్తున్నారు.
ఇంటర్‌మిటెంట్ ఫాస్టింగ్ వల్ల మెదడు, నరాల చురుకుదనంపై అనుకూల ఫలితాలు ఉంటాయి. ఇంటర్‌మిటెంట్ ఫాస్టింగ్ వల్ల మన శరీరంలో న్యూరోజెనిసిస్ ప్రేరేపించబడి కొత్త న్యూరాన్ల ఉత్పత్తి జరుగుతుంది. ఇలా ఉపవాసం చేస్తే మెటబాలిజం, హృదయ సంబంధిత వ్యాధులు దరి చేరవని వైద్యులు వెల్లడిస్తున్నారు. ఇంటర్‌మిటెంట్ ఫాస్టింగ్ క్యాన్సర్ వచ్చే అవకాశాలను కూడా తగ్గిస్తుంది.
ఇంటర్‌మిటెంట్ ఫాస్టింగ్ చేసేవాళ్లు వారంలో రెండు రోజులు పూర్తిగా ఉపవాసం ఉండాలి. రాత్రి భోజనం చేస్తే మరుసటి రోజు రాత్రి వరకు ఎలాంటి ఆహారం తీసుకోకూడదు. ఉపవాసం సమయంలో నీళ్లు, కాఫీ, జీరో కేలరీలు ఉండే పానీయాలను తీసుకోవాలి. ఉపవాసం శ్రేయస్కరం అయినా అతిగా చేస్తే మంచిది కాదు. కొన్నిసార్లు సైడ్ ఎఫెక్ట్స్ కూడా వచ్చే ఛాన్స్ ఉంటుంది. ఉపవాసం చేసేవాళ్లు ఈ విషయాలను గుర్తుంచుకోవాలి. వైద్యుల సలహాలు తీసుకొని ఇంటర్‌మిటెంట్ ఫాస్టింగ్ చేస్తే మంచిది.