https://oktelugu.com/

Diabetes : షుగర్ ఉన్న వారు ఈ చిన్న పని చేయండి చాలు

Diabetes : మధుమేహం ఈ రోజుల్లో చాపకింద నీరులా విస్తరిస్తోంది. అన్నంలో ఉండే పిండి పదార్థాలు ఎక్కువగా ఉండటం వల్ల షుగర్ వస్తుంది. డయాబెటిస్ బారిన పడిన వారు ఏ ఆహారాలు తీసుకోవాలో అని తర్జనభర్జన పడుతుంటారు. ఏం తీసుకుంటే షుగర్ కంట్రోల్ అవుతుందోనని భయపడుతుంటారు. మధుమేహం ఉన్న వారు నిబంధనలు కచ్చితంగా పాటించాల్సిందే. లేదంటే డయాబెటిస్ ఎక్కువవుతుంది. దీంతో అనారోగ్య సమస్య వెంటాడుతుంది. షుగర్ ఉన్న వారు తమ తిండి విషయంలో జాగ్రత్తలు పాటించాలి. డయాబెటిస్ […]

Written By:
  • Srinivas
  • , Updated On : March 18, 2023 / 04:13 PM IST
    Follow us on

    Diabetes : మధుమేహం ఈ రోజుల్లో చాపకింద నీరులా విస్తరిస్తోంది. అన్నంలో ఉండే పిండి పదార్థాలు ఎక్కువగా ఉండటం వల్ల షుగర్ వస్తుంది. డయాబెటిస్ బారిన పడిన వారు ఏ ఆహారాలు తీసుకోవాలో అని తర్జనభర్జన పడుతుంటారు. ఏం తీసుకుంటే షుగర్ కంట్రోల్ అవుతుందోనని భయపడుతుంటారు. మధుమేహం ఉన్న వారు నిబంధనలు కచ్చితంగా పాటించాల్సిందే. లేదంటే డయాబెటిస్ ఎక్కువవుతుంది. దీంతో అనారోగ్య సమస్య వెంటాడుతుంది. షుగర్ ఉన్న వారు తమ తిండి విషయంలో జాగ్రత్తలు పాటించాలి.

    డయాబెటిస్ నియంత్రణలో ఉండాలంటే ఆహారంలో అదుపు ఉండాల్సిందే. అన్నం తినడం వల్ల షుగర్ పెరుగుతుంది. అందుకే చక్కెర కంట్రోల్ లో ఉండాలంటే పుల్కాలు తినడమే మంచిది. కిలో పావు గోధుమలు, పావు కిలో రాగులు, పావు కిలో జొన్నలు, పావు కిలో సజ్జలు, 100 గ్రాముల సోయాబీన్స్ కలిపి పట్టించుకోవాలి. వీటితో పుల్కాలు చేసుకోవడం తినడం వల్ల షుగర్ కంట్రోల్ అవుతుంది. దీంతో ఆరోగ్యానికి ఇబ్బందులు ఉండవు. చక్కెర పెరగకుండా నిరోధించడంలో ఇవి ప్రధాన పాత్ర పోషిస్తాయి.

    ఇంకా మామూలు గోధుమల కంటే నల్ల గోధుమలు డయాబెటిస్ వారికి మంచిది. ఇందులో షుగర్ కంటెంట్ తక్కువగా ఉంటుంది. పిండి పదార్థాలు కూడా తక్కువగా ఉంటాయి. దీంతో వీటిని తీసుకోవడం వల్ల డయాబెటిస్ అదుపులో ఉంటుంది. ఈ పుల్కాల్లో మునగాకు అయినా, మెంతి కూర, పాలకూర అయినా వేసుకోవడం వల్ల ఎన్నో ప్రయోజనాలు దక్కుతాయి. ఇలా డయాబెటిస్ ను ఎప్పుడు నియంత్రణలో ఉంచుకోవడం వల్ల మనకు ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ రావు. పుల్కాలు తినడం వల్ల ఆరోగ్యం సిద్ధిస్తుంది.


    రెండు పుల్కాలు తీసుకుని రె ండు రకాల కూరగాయలతో వండుకున్న కూర పెట్టుకుని తినడం శ్రేయస్కరం. ఉదయం సమయంలో ఇడ్లీ, దోశ, వడ, పూరీ, పరోటా లాంటివి తీసుకోకూడదు. మొలకెత్తిన విత్తనాలు, నానబెట్టిన డ్రై ఫ్రైట్స్ గింజలు తినడం ఎంతో మంచిది. అన్నం తింటూ షుగర్ పెంచుకుని మాత్రలు వేసుకునే బదులు ఇలా జాగ్రత్తలు తీసుకుంటే డయాబెటిస్ నియంత్రణలో ఉంటుంది. దీంతో పాటు ఉదయం, సాయంత్రం రెండు పూటల వాకింగ్ చేయడం వల్ల షుగర్ తగ్గించుకోవచ్చు.