
దేశంలో డయాబెటిస్ రోగుల సంఖ్య సంవత్సరంసంవత్సరానికి పెరుగుతున్న సంగతి తెలిసిందే. షుగర్ బారిన పడుతున్న వాళ్లు ఇతర ఆరోగ్య సమస్యల వల్ల చనిపోతున్న ఘటనలు సైతం చోటు చేసుకుంటున్నాయి. కరోనాతో చనిపోతున్న వాళ్లలో ఎక్కువమంది షుగర్ రోగులే కావడం గమనార్హం. అయితే రక్తంలో షుగర్ లెవెల్స్ ను అదుపులో ఉంచుకోవాలని అనుకునే వాళ్లు గుర్మార్ ఆకుల సహాయంతో షుగర్ లెవెల్స్ ను కంట్రోల్ చేసుకోవచ్చు.
యాంటీఆక్సిడెంట్ గుణాలు, యాంటీ డయాబెటిక్ లక్షణాలు, యాంటీ అథెరోస్క్లెరోటిక్ లక్షణాలు పుష్కలంగా ఉన్న గుర్మార్ తో డయాబెటిస్ తో పాటు ఇతర అనారోగ్య సమస్యలకు సైతం చెక్ పెట్టవచ్చు. టైప్ 2 డయాబెటిస్ ఉన్న రోగులు గుర్మార్ తీసుకోవడం ద్వారా శరీరంలో తీపి రుచి తగ్గుతుంది. ఖాళీ కడుపుతో గుర్మార్ ఆకులను తీసుకుంటే మంచిది. ఆకులు తిన్న తరువాత నీటిని తీసుకోవడం ద్వారా చక్కెర స్థాయిలను నియంత్రించవచ్చు.
గుర్మార్ శరీరంలో కొలెస్ట్రాల్ లెవెల్స్ ను అదుపులో ఉంచుతుంది. కామెర్ల చికిత్సకు కూడా గుర్మార్ ను వినియోగిస్తారు. ఉబ్బసం, కంటి సమస్య, మలబద్ధకం, అజీర్ణం, సూక్ష్మజీవుల సంక్రమణ, కార్డియోపతి, హైపర్ కొలెస్టెరోలేమియా మొదలైన సమస్యలకు గుర్మార్ చెక్ పెడుతుంది. గుర్మార్ చర్మానికి మేలు చేయడంతో పాటు చర్మ సంబంధిత సమస్యలను దూరం చేస్తుంది.
చర్మంపై తెల్లమని మచ్చలను తొలగించడంలో గుర్మార్ తోడ్పడుతుంది. గుర్మార్ గుళికలలో యాంటీ బాక్టీరియల్ లక్షణాలు పుష్కలంగా ఉంటాయి. గుర్మార్ ఆకులు తిన్న తరువాత నీటిని తీసుకుంటే చక్కెర స్థాయి పెరిగే అవకాశం ఉండదు.