Homeలైఫ్ స్టైల్Daytime napping side effects: పగటిపూట కునుకు ప్రమాదమే..!

Daytime napping side effects: పగటిపూట కునుకు ప్రమాదమే..!

Daytime napping side effects: పగటి పూట కునుకు తీయడం చాలా మందికి సహజ అలవాటు. ముఖ్యంగా భోజనం తర్వాత కొద్దిసేపు విశ్రాంతి తీసుకుంటే శరీరానికి తేలికగా అనిపిస్తుంది. ఇలాంటి సమయంలో కొందరు నిద్రపోతుంటారు. అయితే ఈ అలవాటు మితిమీరితే ఆరోగ్యానికి మేలు కంటే నష్టం ఎక్కువ అవుతుందని తాజా అధ్యయనాలు సూచిస్తున్నాయి. ముఖ్యంగా వయస్సు పెరిగిన వారిలో ఇది మరింత జాగ్రత్తగా చూసుకోవాల్సిన అంశంగా మారింది. దీని గురించి పూర్తి వివరాల్లోకి వెళితె..

అమెరికాలోని Rush University నిర్వహించిన ఒక పరిశోధనలో ఈ విషయం స్పష్టమైంది. 55 ఏళ్లు పైబడిన వెయ్యికి పైగా వ్యక్తులను సుమారు 8.3 సంవత్సరాల పాటు పరిశీలించారు. ఈ ఆధ్యయనంలో పాల్గొన్నవారికి చేతికి ధరించే ప్రత్యేక పరికరాలను ఇచ్చారు. ఆ తరువాత వారి కదలికలు, నిద్ర, విశ్రాంతి అలవాట్లను నిరంతరం రికార్డు చేశారు. ఈ విధంగా పొందిన డేటాతో వారి రోజువారీ జీవనశైలిని విశ్లేషించారు.

ఈ అధ్యయనంలో బయటపడిన విషయమేంటంటే.. పగటి పూట ఎక్కువసేపు కునుకు తీసుకునే వారిలో మరణ ముప్పు పెరుగుతుందని తేలింది. ప్రతి అదనపు గంట కునుకు తీసుకుంటే సుమారు 13 శాతం వరకు మరణ ప్రమాదం పెరుగుతుందని గుర్తించారు. అంటే ఒకటి రెండు నిమిషాల విశ్రాంతి కాకుండా, గంటల కొద్దీ నిద్రపోవడం ప్రమాదకరంగా మారవచ్చు.

అదేవిధంగా రోజులో ఒకటి కంటే ఎక్కువసార్లు కునుకు తీసుకునే అలవాటు ఉన్నవారిలో కూడా ప్రమాదం పెరుగుతుంది. ప్రతి అదనపు నాప్‌తో దాదాపు 7 శాతం వరకు ముప్పు పెరుగుతుందని పరిశోధకులు పేర్కొన్నారు. ఇది శరీరంలో ఏదో లోపం లేదా అలసటను సూచించే సంకేతం కావచ్చని వారు అభిప్రాయపడుతున్నారు.
ఉదయం సమయంలోనే కునుకు తీసుకునే వారిలో ప్రమాదం మరింత ఎక్కువగా ఉండటం మరింత ఆందోళన కలిగిస్తోంది. సాధారణంగా ఉదయం సమయంలో శరీరం యాక్టివ్‌గా ఉండాలి. అయితే ఆ సమయంలోనే నిద్ర రావడం అనేది ఆరోగ్య సమస్యల సంకేతంగా భావిస్తున్నారు. ఇది హృదయ సంబంధిత వ్యాధులు, మెటబాలిక్ సమస్యలు లేదా నిద్రలేమి వంటి సమస్యల వల్ల రావచ్చు.

పరిశోధకుల అభిప్రాయం ప్రకారం.. పగటి పూట వచ్చే అధిక నిద్రమత్తు అనేది చాలా సార్లు తెలియని ఆరోగ్య సమస్యల సూచిక. ఉదాహరణకు, Sleep Apnea, డిప్రెషన్, డయాబెటిస్, గుండె సమస్యలు వంటి వ్యాధులు ఉన్నప్పుడు శరీరం అలసటగా అనిపించి తరచుగా కునుకు తీసుకోవాలనిపిస్తుంది. ఈ పరిస్థితి దీర్ఘకాలంలో మరణ ముప్పును పెంచే అవకాశం ఉంది. అయితే నిపుణులు తెలుపుతున్న ప్రకారం.. రోజుకు 20 నుంచి 30 నిమిషాల వరకు తీసుకునే చిన్న నాప్ శరీరానికి మేలు చేస్తుంది. ఇది మెదడు పనితీరును మెరుగుపరచడమే కాకుండా, ఒత్తిడిని తగ్గిస్తుంది. కానీ దీన్ని గంటలకొద్దీ నిద్రగా మార్చితే మాత్రం ప్రమాదం మొదలవుతుంది.

పగటి పూట కునుకు అలవాటు ఉంటే దాన్ని నియంత్రించడం చాలా ముఖ్యం. ఎక్కువగా నిద్ర రావడం, తరచుగా కునుకు అవసరం అనిపించడం వంటి లక్షణాలు కనిపిస్తే వాటిని నిర్లక్ష్యం చేయకుండా వైద్యులను సంప్రదించడం మంచిది. సరైన నిద్రపాటు, ఆరోగ్యకరమైన జీవనశైలి పాటించడం ద్వారా ఈ ప్రమాదాలను తగ్గించుకోవచ్చు.

S. Vas Chaimuchata
S. Vas Chaimuchatahttps://oktelugu.com/
Srinivas is a Senior content writer who has good knoeledge in the field of Auto mobile, General, Business and lifestyle news. He covers all kind of general news content in our website.

Related News

Most Popular

India vs Zimbabwe : ఆరు ఓటముల తర్వాత.. అయ్యర్ పొలంలో మొలకలు.. కానీ ఇది సరిపోదు..

India vs Zimbabwe : ఐర్లాండ్ చేతిలో వైట్ వాష్.. ఇంగ్లాండ్ చేతిలోను వైట్ వాష్.. బ్యాటింగ్ బలంగా లేదు. బౌలింగ్ గొప్పగా లేదు.. ఫీల్డింగ్ చెప్పుకొనే స్థాయిలో లేదు. ఆటగాళ్లు ఏమైనా...

Dharmendra Pradhan : ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా.. నరేంద్ర మోడీ తదుపరి ఏం చేయబోతున్నారు..

Dharmendra Pradhan : సెంట్రల్ ఎడ్యుకేషన్ మినిస్టర్ ప్రధాన్ రాజీనామా చేశారు. కాక్రోచ్ జనతా పార్టీ చేస్తున్న ఆందోళనలకు తలవంచి.. నరేంద్ర మోడీ ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. వాస్తవానికి ప్రధానమంత్రి నరేంద్ర...

Narendra Modi : కొత్త విద్యాశాఖ మంత్రి ఇతనే అనూహ్యంగా మోడీ మనస్సు ఇతడి మీదికే ఎందుకంటే..

Narendra Modi : ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేసిన తర్వాత కొత్త విద్యాశాఖ మంత్రి ఎవరు అనే చర్చ మొదలైంది. వాస్తవానికి ధర్మేంద్ర రాజీనామా చేయాలని నిర్ణయించుకున్న తర్వాత.. నరేంద్ర మోడీ వెంటనే...

Donald Trump : ఈయూ జరిమానాలపై కన్నెర్రజేసిన ట్రంప్‌.. అమెరికా కంపెనీల రక్షణకు చర్యలు!

Donald Trump : అగ్రరాజ్యం అమెరికా అధ్యక్షుడిగా డొనాల్డ్‌ ట్రంప్‌ రెండోసారి అధ్యక్షుడు అయ్యాక ఏడాది కాలంపాటు అమెరికాలో అక్రమంగా ఉంటున్నవారిని తరలించడం, అమెరికా వివిధ దేశాల నుంచి దిగుమతి చేసుకుంటున్న సరుకులపై...

Harish Rao : బిజెపిలోకి హరీష్ రావు.. కేటీఆర్ ఏమన్నారంటే..

Harish Rao : తెలంగాణ రాష్ట్ర రాజకీయాలలో ఏదో ఒక సందర్భంలో మీడియాలో బలంగా ప్రచారానికి.. నాయకుల మధ్య చర్చకు కారణమయ్యే అంశం ఏదైనా ఉందంటే అది భారతీయ జనతా పార్టీలో హరీష్...
Oktelugu Epaper
Exit mobile version