Walking Benefits: కూర్చుని తింటే కొండలైనా కరుగుతాయి. ఇది పాత సామెత. కూర్చుని ఉంటే కొండలాగా దేహం పెరుగుతుంది ఇది కొత్త సామెత. ఎందుకంటే అదే పనిగా కూర్చుని ఉంటే శరీరంలో బద్ధకం మొదలవుతుంది. ఏ పని చేయాలన్నా సరే ఇబ్బందిగా ఉంటుంది. చివరికి అడుగు తీసి అడుగు వేయాలంటే కూడా కష్టంగా ఉంటుంది. పరిస్థితి ఇంతకంటే విషమిస్తే అప్పుడు శరీరం లావెక్కి పోతుంది. ఒక్కసారి లావు ఎక్కిన శరీరం తగ్గాలి అంటే చాలా కష్టం.
శరీరం లావెక్కకూడదు.. బద్ధకం అసలు రాకూడదు. సైజ్ జీరో సినిమా లో అనుష్క లాగా అసలు ఉండకూడదు అనుకుంటే.. కచ్చితంగా నాలుగు అడుగులు వేయాలి. నాలుగు అంటే నాలుగు మాత్రమే కాదు అంతకుమించి అని అర్థం. ఇప్పటి ఉరుకుల పరుగుల జీవితంలో నడవడం అనేది తగ్గిపోయింది. ప్రతి దానికి వాహనాల మీద ప్రయాణం చేయడం పెరిగిపోయింది. దీనివల్ల శరీరానికి వ్యాయామం అనేది లేకుండా పోయింది. ఫలితంగా రకరకాల వ్యాధులు వస్తున్నాయి. శరీరం లావు కావడం.. కొవ్వు నిల్వలు పేరుకుపోవడం.. గుండె జబ్బులు వంటివి రావడం వల్ల చిన్న వయసులోనే చాలామంది ప్రాణాలు కోల్పోతున్నారు. అయితే ఇటువంటి పరిస్థితికి చెక్ పెట్టాలంటే నడవాలని వైద్యులు సూచిస్తున్నారు.
రోజు నడక వల్ల గుండె ఆరోగ్యానికి మంచిదట. తీపి తో పాటు షుగర్ కూడా అదుపులో ఉంటుందట. కీళ్లు దృఢంగా ఉంటాయట. క్యాలరీలు కరిగిపోతాయట. బరువు కూడా అదుపులో ఉంటుందట. ఒత్తిడి పూర్తిగా తగ్గి.. మానసిక ప్రశాంతత లభిస్తుందట. నాణ్యమైన నిద్ర కూడా వస్తుందట. సంపూర్ణ ఆరోగ్యానికి ప్రతిరోజు నడకను జీవనశైలిలో భాగం చేసుకోవాలని వైద్యులు చెబుతున్నారు.
అయితే మోకాళ్ల నొప్పులు.. కీళ్లనొప్పులు.. ఇతర సమస్యలు ఉన్నవారు వైద్యుల సలహాలతోనే నడవాలని నిపుణులు సూచిస్తున్నారు. మోకాళ్ళ నొప్పులకు శస్త్ర చికిత్స చేయించుకున్న వారు సాధ్యమైనంత వరకు వైద్యుల సూచనతోనే నడక కొనసాగించాలని చెబుతున్నారు. అయితే నడక వాళ్ల ఆరోగ్యం మెరుగుపడుతుందట. అంతేకాదు చర్మం కూడా తేజోమయంగా కనిపిస్తుందట. ఫలితంగా రక్త ప్రసరణ వ్యవస్థ సమర్థవంతంగా సాగిపోతూ ఉంటుందట. చర్మం మీద ముడతలు రావట. దీంతో వయసు పెరిగిన సరే.. ముఖంలో ఆ మార్పు కనిపించదట. అందువల్లే నడకను జీవనశైలిలో ఒక భాగంగా చేసుకోవాలని వైద్యులు చెబుతున్నారు.
ముఖ్య గమనిక
ఈ సమాచారం వివిధ వేదికల వద్ద పాఠకుల కోసం సేకరించాం. ఇది ఎట్టి పరిస్థితుల్లో వైద్య చికిత్సకు ప్రత్యామ్నాయం కాదు. ఈ కథనాన్ని కేవలం అవగాహన కోసం మాత్రమే పాఠకుల కోసం అందించాం.