Corona Vaccine: కరోనా వ్యాక్సిన్ తీసుకున్న వాళ్లకు షాకింగ్ న్యూస్.. ఆ వ్యాక్సిన్ పని చేయదట?

Corona Vaccine: దేశంలోని కోట్ల సంఖ్యలో ప్రజలు ఇప్పటికే కరోనా వ్యాక్సిన్ ను తీసుకున్నారు. మన దేశంలో ప్రధానంగా కోవిషీల్డ్, కోవాగ్జిన్ వ్యాక్సిన్లను ఎక్కువమంది తీసుకున్నారు. అయితే ఐసీఎంఆర్‌ కు చెందిన నేషనల్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ వైరాలజీ ఒమైక్రాన్ వేరియంట్ పై కోవిషీల్డ్ ప్రభావవంతంగా పని చేయదని వెల్లడించింది. ఢిల్లీకి చెందిన ఆరోగ్య కార్యకర్త ఒకరు కోవిషీల్డ్ వ్యాక్సిన్ తీసుకోక ముందు, వ్యాక్సిన్ ను తీసుకున్న తర్వాత కూడా కరోనా బారిన పడ్డారు. కొవిషీల్డ్‌ వ్యాక్సిన్ రెండు […]

Written By: Kusuma Aggunna, Updated On : April 26, 2022 2:47 pm
Follow us on

Corona Vaccine: దేశంలోని కోట్ల సంఖ్యలో ప్రజలు ఇప్పటికే కరోనా వ్యాక్సిన్ ను తీసుకున్నారు. మన దేశంలో ప్రధానంగా కోవిషీల్డ్, కోవాగ్జిన్ వ్యాక్సిన్లను ఎక్కువమంది తీసుకున్నారు. అయితే ఐసీఎంఆర్‌ కు చెందిన నేషనల్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ వైరాలజీ ఒమైక్రాన్ వేరియంట్ పై కోవిషీల్డ్ ప్రభావవంతంగా పని చేయదని వెల్లడించింది. ఢిల్లీకి చెందిన ఆరోగ్య కార్యకర్త ఒకరు కోవిషీల్డ్ వ్యాక్సిన్ తీసుకోక ముందు, వ్యాక్సిన్ ను తీసుకున్న తర్వాత కూడా కరోనా బారిన పడ్డారు.

కొవిషీల్డ్‌ వ్యాక్సిన్ రెండు డోసులు తీసుకున్న వాళ్లకు సైతం ఒమిక్రాన్ వేరియంట్ సోకే ఛాన్స్ అయితే ఉందని శాస్త్రవేత్తల పరిశోధనలలో వెల్లడైంది. కోవిషీల్డ్ వ్యాక్సిన్ రెండు డోసులు తీసుకున్న వాళ్లు కరోనా వ్యాక్సిన్ బూస్టర్ డోసును తీసుకుంటే మంచిదని శాస్త్రవేత్తలు వెల్లడిస్తున్నారు. కోవిషీల్డ్ వ్యాక్సిన్ ను తీసుకున్న వాళ్లు బూస్టర్ డోస్ ను తీసుకోవడం ద్వారా ఒమిక్రాన్ వేరియంట్ నుంచి మనల్ని మనం రక్షించుకోవచ్చు.

పరిశోధకులు చెబుతున్న వివరాల ప్రకారం 2020 సంవత్సరం అక్టోబర్ 9వ తేదీన ఆరోగ్య కార్యకర్తగా పని చేసే ఒక వ్యక్తికి కరోనా నిర్ధారణ అయింది. సంవత్సరం తర్వాత ఆ వ్యక్తికి డెల్టా వేరియంట్, ఈ ఏడాది ఒమిక్రాన్ వేరియంట్ సోకింది. జర్నల్‌ ఆఫ్‌ ఇన్ఫెక్షన్‌ లో కోవిషీల్డ్ వ్యాక్సిన్ ను తీసుకున్న వాళ్లు కరోనా బూస్టర్ డోస్ ను తీసుకోవడం ద్వారా రక్షణ పొందవచ్చని పరిశోధకులు పేర్కొన్నారు.

దేశంలో ఎక్కువ సంఖ్యలో ప్రజలు వేయించుకున్న వ్యాక్సిన్ కోవిషీల్డ్ వ్యాక్సిన్ అనే సంగతి తెలిసిందే. కరోనా వైరస్ కు సంబంధించి, కరోనా వ్యాక్సిన్ కు సంబంధించి కొత్తకొత్త విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. కరోనా కేసులు తగ్గుతున్నా ప్రజలు అప్రమత్తంగా ఉంటే మాత్రమే వైరస్ సోకకుండా మనల్ని మనం రక్షించుకునే ఛాన్స్ ఉంటుంది.