kids : వామ్మో చలి వణికిస్తుంది. చలికాలం ఫుల్ గా స్ట్రార్ట్ అయింది. ఈ చలిలో లేవాలంటే కూడా బద్దకంగా అనిపిస్తుంది కదా. ఇక ఈ సమయంలో అనారోగ్య సమస్యలు వచ్చే అవకాశం ఎక్కువ ఉంటుంది. ఈ సమయంలో పిల్లలు అనారోగ్యానికి గురయ్యే వాతావరణం ఉంటుంది. ఈ సమయంలో పిల్లలకు టానిక్ లు, ఫుడ్ తినిపించడం చాలా కష్టం. సరిగ్గా తినరు కాబట్టి శక్తి అందదు తద్వారా రోగాల బారిన పడతారు పిల్లలు. ఈ సమయంలో దగ్గు వచ్చిందంటే చాలు దాన్ని విదిలించుకోవడం చాలా కష్టం. చలికాలంలో పిల్లల్లో జలుబు, దగ్గు లక్షణాలు సాధారణంగా ఉంటాయి. ఇది చాలా రోజులు ఇబ్బంది పెడుతుంది.
పిల్లలకు దగ్గు ఎలా తగ్గించాలో? ఏ మందు వేయాలో కూడా అర్థం కాదు. అది కాకుండా పిల్లల్లో డాక్టర్లు ఇచ్చిన సిరప్‌లు, మందుల వేసుకోరు. వేయాలంటే పెద్ద టాస్క్. మొండి పట్టు పడతారు. వారికి మందులు వేయించాలంటే తల్లిదండ్రులకు పెద్ద సవాల్ తో కూడుకున్న పని. అయితే, మందులు, సిరప్‌లు తాగని పిల్లల కోసం కొన్ని హోమ్ రెమెడీలను ఉపయోగించవచ్చు. వీటితో వారి దగ్గును నయం చేసుకోవచ్చు అంటున్నారు నిపుణులు. మరి అవేంటో ఎలాంటి రెమెడీలు ఉపయోగించవచ్చో చూసేద్దాం.
జాజికాయతో దగ్గును దూరం చేయవచ్చు. దీంతో.. పిల్లల్లో దగ్గును ఎలా తగ్గించుకోవచ్చు అనుకుంటున్నారా? ఆహారపు రుచిని పెంచుతుంది. ఆరోగ్యానికి చాలా మేలు చేస్తుంది. ఆయుర్వేదం, ఔషధాల తయారీల్లో జాజికాయ విస్తృతంగా ఉపయోగిస్తున్నారు. జాజికాయ పిల్లలకు చాలా మేలు చేస్తుంది. మీ పిల్లలకు దగ్గు ఉంటే చిటికెడు జాజికాయ పొడిని తినిపించాలి. ఇలా చేస్తే జలుబు, దగ్గు నుంచి ఉపశమనం లభిస్తుంది.
శరీరంలో రోగ నిరోధక శక్తి తగ్గితే ఎన్నో వ్యాధులు, ఇన్ఫెక్షన్లు చుట్టుముడుతాయి. చలికాలంలో పిల్లలకు వ్యాధుల ఎక్కువ వస్తాయి. దీంతో పిల్లల్లో ఇమ్యూనిటీ పవర్ తగ్గిపోతుంది. అందుకే వారికి జలుబు, దగ్గు, గొంతు నొప్పి వంటి సమస్యలు వస్తాయి. అందుకే పిల్లలకు పాలలో చిటికెడు జాజికాయ పొడిని కలిపి తాగించాలి. దీని వల్ల రోగనిరోధక శక్తి పెరుగుతుంది.
జాజికాయలో ఉండే జీర్ణ ఎంజైమ్‌లు పిల్లల జీర్ణవ్యవస్థను బలపరుస్తాయి. ఈ రోజుల్లో చాలా మంది పిల్లలు కడుపు నొప్పి, గ్యాస్ వంటి సమస్యలతో ఇబ్బంది పడుతుంటారు. అలాంటి వారికి చిటికెడు జాజికాయ పొడిని తేనెలో కలిపి ఇవ్వాలి. దీంతో.. పిల్లలకు కడుపునొప్పి, గ్యాస్ సమస్యల నుంచి ఉపశమనం లభిస్తుంది అంటున్నారు నిపుణులు.
చలికాలంలో పిల్లలకు జాజికాయ బెస్ట్ ఆప్షన్ గా పరిగణిస్తారు. ఈ సీజన్‌లో పిల్లలు జలుబు, దగ్గు సమస్యలతో ఇబ్బంది పడతారు కాబట్టి అలాంటప్పుడు కాస్త ఆవనూనెలో జాజికాయ పొడిని కలపండి. కొద్దిగా వేడి చేసి పిల్లల ఛాతీకి మసాజ్ చేస్తే సరిపోతుంది. జలుబు, దగ్గు మాయం అవుతాయి. ఈ రెండింటి మిశ్రమంలో ఉండే యాంటీ ఇన్‌ఫ్లమేటరీ గుణాలు పిల్లలకు మేలు చేస్తాయి.
కొందరి పిల్లలకు దంతాలు విరిగిపోతాయి. అవి త్వరగా రావు అంతేకాకుండా వారి దంతాలు ఊడినప్పుడు సమస్యలు వస్తాయి. అలాంటి పరిస్థితుల్లో జాజికాయను, పంచాదరను మెత్తగా చేసి పొడిలా చేసి పాలలో లేదా నీళ్లలో కలిపి పిల్లలకు ఇవ్వాలి. దీని కారణంగా వారికి దంతాలు త్వరగా వస్తాయి అంటున్నారు నిపుణులు. జాజికాయ నూనె దంతాల నొప్పిని తగ్గిస్తుంది. అంతేకాదు ఈ నూనె పిల్లల చర్మాన్ని మృదువుగా మారుతుంది.