Cost Of Living in The USA: అమెరికా వెళ్లి బాగా డబ్బు సంపాదించి అక్కడే స్థిరపడాలనేది మన భారతీయుల కోరిక. ఆ దిశగానే చాలా మంది ప్రయత్నాలు చేస్తుంటారు. ఉన్నత విద్య అభ్యసించడానికి అమెరికా వెళ్లి అక్కడే ఉద్యోగం సంపాదించుకుని అక్కడే ఉండిపోయిన వారు చాలా మంది ఉన్నారు. కానీ అమెరికా ఖరీదైన దేశం. అక్కడ బతకాలంటే చాలా డబ్బు కావాలి. అక్కడి డాలర్ మనకు దాదాపు రూ.70లతో సమానం. దీంతో అక్కడ ఉండాలంటే ఎంత డబ్బు కావాలో అర్థమైపోతోంది. ఖర్చులు కూడా అదే రేంజిలో ఉంటాయి. ఏది కొనాలన్నా డబ్బులు కావాల్సిందే. అంతటి అగ్రదేశంలో బతకాలంటే డాలర్లతో కుస్తీ పట్టాల్సిందే.
మన దేశంలో మాదిరి కాకుండా అమెరికాలో ప్రతి నగరంలో ఖర్చుల తీరు మారుతాయి. అందులో ఖరీదైన నగరంగా శాన్ ఫ్రాన్సిస్ కో ఉంది. ఇక్కడ నివసించాలంటే దాదాపు రూ. 8 కోట్ల డబ్బు అవసరమవుతుందని తేలింది. అంత డబ్బు మనం సంపాదించడం కష్టమే. కానీ అక్కడ ఉండాలంటే అంత మొత్తంలో డబ్బు ఉంటేనే సాధ్యమవుతుంది. ఇక ఇంకా చిన్న నగరాల్లో కొంచెం అటు ఇటుగా డబ్బు మాత్రం ఉండాల్సిందే. దీంతో అమెరికాలో నివసించాలంటే మనతో సాధ్యం కాదని తెలిసిపోతోంది.
Also Read: Balakrishna- Honey Rose: బాలకృష్ణకు మలయాళీ భామను సెట్ చేసిన అనిల్ రావిపూడి
అమెరికా అంటేనే విలాసవంతమైన దేశం. అక్కడ ఏది కావాలన్నా ఖరీదే. దీంతో అక్కడ మన సంపాదనతో బతకాలంటే భారమే. బాగా డబ్బు సంపాదించే వారికే అమెరికాలో నివసించే అర్హత ఉంటుంది. కానీ మనలా పదో పరకో సంపాదించే వారు అక్కడ ఉండటానికి అనర్హులే. దీంతో అమెరికాలో ఉండాలనే కోరిక ఉంటే చాలదు అందుకనుగుణంగా సంపాదన కూడా ఉంటేనే సాధ్యమవుతుంది. అయినా ఈ రోజుల్లో ఎక్కడైనా బతికే వీలున్నా ఎందుకో అమెరికా అంటే అందరికి కూడా ఇష్టమే. ఏదో సాధిస్తారని కాదు అదో క్రేజీ అంతే మరి.
అమెరికాలో ఆర్థికంగా సుఖంగా జీవించాలంటే 7.74 లక్షల డాలర్లు అవసరమవుతాయని ఓ సర్వే వెల్లడించింది. దీంతో అమెరికాలో జీవించాలంటే డబ్బు ఎక్కువగా ఉండాల్సిందే. లేకపోతే మనుగడ కష్టమే. అగ్రరాజ్యం కావడంతో విలాసవంతమైన జీవితాలు అనుభవించే వారే ఎక్కువగా ఉంటారు. మనం కూడా అక్కడ ఉండాలంటే డబ్బు ఉండాలి. ఖరీదైన వస్తువులు కావాలి. దీంతో అమెరికాలో ఉండాలంటే డబ్బు పెద్ద మొత్తంలోనే కావాల్సి ఉంటుంది. మనదేశంలో మాదిరి ఎంత ఉంటే అంతలో సర్దుకుపోవాలంటే కుదరదు.
న్యూయార్క్, శాన్ ఫ్రాన్సిస్కో నగరాలు అత్యంత విలాసవంతమైనవిగా గుర్తింపు పొందాయి. ఇక్కడ మంచి జీవితం సాగించాలంటే దాదాపు ఒక మిలియన్ డాలర్ల ఆదాయం అవసరముంటుంది. మనదేశ రూపాయల్లో రూ. 8 కోట్ల లెక్క. ఇంత మొత్తంలో ఆదాయం ఉంటేనే అక్కడ బతకడం సాధ్యమవుతుంది. ఆ దేశంతో పాటు అక్కడ జీవన విధానం కూడా విలాసవంతమే కావడం గమనార్హం. అమెరికాలో ఉండాలంటే డబ్బులు సంపాదించుకోవాల్సిందే. లేకపోతే బతుకు భారమే. నివాస యోగ్యం కాదని తెలిసిందే.
అమెరికాలో 12 ఖరీదైన నగరాలు ఉన్నాయి. అందులో శాన్ ఫ్రాన్సిస్కో ఒకటి. ఇక్కడ నివసించాలంటే దాదాపు 1.7 మిలియన్ డాలర్లు అవసరం. అవి మనదేశంలో రూ. 15 కోట్లతో సమానం. ఇంతటి భారీ ఆదాయం ఉంటేనే అమెరికాలో ఉండగలం. బతికి బట్టకట్టగలం. అంతేకాని ఏదో చిన్న చితకా ఉద్యోగం చేసి జీవించాలంటే కుదరదు. అందుకే ఖరీదైన దేశంలో ఖర్చులు కూడా అదే రేంజిలో ఉండటం మామూలే.
ఫిబ్రవరి 2022లో 21 ఏళ్ల నుంచి 75 ఏళ్ల మధ్య ఉన్న వ్యక్తులను సర్వే నిర్వహించి సూచించిన లెక్కల ప్రకారం మెట్రో నగరాల్లో నివసించే వారిపై నిర్వహించిన సర్వేలో వెల్లడైన విషయాలు. దీంతో అమెరికా వాసం అంటే అంత తేలికైనది కాదు. దానికి ఎంతో డబ్బు కావాలి. డబ్బు లేనిదే ఏది సాధ్యం కాదని తెలుస్తోంది. అందుకే ఖరీదైన అమెరికా కంటే మన దేశంలోనే ఉన్నదాంట్లో తృప్తిపడటం మంచిది. పొరుగూరి బోగం దానికంటే ఉన్న ఊరి ఊసుగండ్లదే నయం అనే సామెత గుర్తుండే ఉంటుంది.
Also Read:Janasena Chief Pawan Kalyan: పవన్ కు ఏపీ కంటే తెలంగాణపై ఎందుకంత ప్రేమ?