Sugar Control: షుగర్ వచ్చిన వారు అత్యంత జాగ్రత్తగా ఉండాల్సిందే. అధిక బరువుతోనే షుగర్ ముప్పు ఏర్పడుతుంది. ప్రస్తుతం కాలం మారుతోంది. ఎన్నో రకాల మందులు వస్తున్నాయి. కానీ మన వంటింట్లో దొరికే వాటితోనే మనకు ఎన్నో లాభాలు ఉన్న సంగతి మరిచిపోతున్నాం. ఫలితంగా ఇంగ్లిష్ మందులకు ఆకర్షితులమవుతున్నాం. మన వంటింట్లో లభించే వాటిని వాడుకోలేకపోతున్నాం. ఫలితంగా రోగాలను పెంచిపోషిస్తున్నాం. వాటి నివారణకు చర్యలు తీసుకోవడం లేదు.
మధుమేహం ఒకసారి వచ్చిందంటే ఇక పోదనే అపోహలోనే ఉంటున్నాం. క్రమం తప్పకుండా వ్యాయామం చేయడం వల్ల ఉపశమనం కలుగుతుంది. రోజు ఉదయం, సాయంత్రం నడక సాగించడం వల్ల ఎంతో మేలు చేకూరుతుంది. జీవనశైలిలో మార్పులు చేసుకుంటే ఉత్తమ ఫలితాలు వస్తాయి. ఈ నేపథ్యంలో చక్కెర వ్యాధిగ్రస్తులు 26-65 ఏళ్ల వయసున్న వారిపై జరిపిన అధ్యయనంలో ఆసక్తికర విషయాలు వెలుగు చూశాయి. చెన్నైలోని మద్రాస్ షుగర్ పరిశోధన సంస్థ చేసిన పరిశోధనలో ఈ విషయాలు బయటపడ్డాయి.
Also Read: Tea: ఈ టీ శరీరంలో 40 రోగాలను దూరం చేస్తుంది తెలుసా?
వరుసగా 12 రోజుల పాటు నిర్వహించిన అధ్యయనంలో నిత్యం బాదంలను తినడం వల్ల ఎన్నో లాభాలు దాగి ఉన్నాయి. దీంతో ఇన్సులిన్ నిరోధకత తగ్గుతుంది. షుగర్ ను కంట్రోల్ లో ఉంచడంలో బాదంలు ప్రధాన పాత్ర పోషిస్తాయి. బీఎంఐ ఇండెక్స్ లోనూ తగ్గుదల నమోదవుతుంది. అధిక బరువుతో బాధపడేవారికి షుగర్ వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది.
ప్రతి రోజు 12 రోజులపాటు రాత్రి నానబెట్టిన బాదంలను ఉదయం పరగడుపున తీసుకున్నట్లయితే డయాబెటిస్ తో పాటు అధిక బరువు కూడా తగ్గుతుందని అధ్యయనంలో తేలింది. ఇందులో ఉండే విటమిన్లు, ఫైబర్, ప్రొటీన్లు షుగర్ లెవల్స్ ను నియంత్రించడంలో ప్రధాన పాత్ర పోషిస్తాయి. బాదంలలో ఉండే ప్రొటీన్లతో మనకు ఎన్నో రకాల ప్రయోజనాలు కలుగుతాయి. మధుమేహ వ్యాధి గ్రస్తులు ఈ చిట్కాను పాటించి షుగర్ ను నియంత్రణలో ఉంచుకునేందుకు ప్రయత్నించాలి.
Also Read: KCR vs Governor : ఆగ్రహం ‘బిల్లు’బుకుతోంది.. సుప్రీంకు చేరిన కేసీఆర్ వర్సెస్ గవర్నర్ పంచాయితీ