Walking: ఎంత నడిస్తే అన్ని డబ్బులు.. ఈ యాడ్ డౌన్లోడ్ చేస్తే చాలు..

సాధారణంగా మనం రోజుకు రెండు కిలోమీటర్ల కంటే ఎక్కువ నడవలేం. కానీ డబ్బిస్తానంటే పోట పడి మరీ ఎక్కువ నడుస్తారు. దీంతో వారి ఆరోగ్యం కూడా మెరుగుపెడుతుందని కొన్ని సంస్థలు భావిస్తున్నాయి.

Written By: Chai Muchhata, Updated On : May 9, 2023 2:54 pm

Walking

Follow us on

Walking: ఆరోగ్యంగా ఉండేందుకు ప్రతిరోజూ వ్యాయామం చేయాలని ఇప్పుడు ఏ డాక్టర్ దగ్గిరికెళ్లినా చెబుతున్నారు. అప్పటి వరకు ఓకే అంటూ ఆ తరువాత దాని గురించి చాలా మంది పట్టించుకోవడం లేదు. కనీసం వాకింగ్ చేసైనా ఫిట్ నెస్ కాపాడుకోండని పలు సంస్థలు సైతం ప్రచారం చేయడంతో ఈమధ్య కొంత మంది నాలుగడుగులు అటూ ఇటూ వేస్తున్నారు. అయితే ఊరికే వాకింగ్ చేయడం వల్ల నిజంగానే ఆరోగ్యంగా ఉంటారా? అనేది చాలా మందికి డౌట్ తో కూడిన ప్రశ్న. వాకింగ్ చేస్తే ఆరోగ్యంగా ఉంటారో లేదో తెలియదు గానీ.. డబ్బు అయితే సంపాదించవచ్చని కొన్ని అప్లికేషన్లు చెబుతున్నాయి. అదెలాగో తెలుసుకుందాం..

సాధారణంగా మనం రోజుకు రెండు కిలోమీటర్ల కంటే ఎక్కువ నడవలేం. కానీ డబ్బిస్తానంటే పోట పడి మరీ ఎక్కువ నడుస్తారు. దీంతో వారి ఆరోగ్యం కూడా మెరుగుపెడుతుందని కొన్ని సంస్థలు భావిస్తున్నాయి. దీంతో ఎంత ఎక్కువ నడిస్తే అంత డబ్బు తీసుకోండని ఆఫర్ చేస్తున్నాయి. అయితే ఇందుకు స్మార్ట్ ఫోన్ అవసరం ఉంటుంది. అందులో కొన్ని అప్లికేషన్లు డౌన్ లోడ్ చేసుకోవాల్సి ఉంటుంది. వాటి వివరాలేంటంటే?

గ్రో ఫిట్టర్: Growfitter అనే యాప్ మీకు డబ్బు ఇస్తుంది. అయితే క్యాష్ రూపంలో కాదు. కొన్ని పాయింట్స్ ఇస్తే వాటితో మీరు షాపింగ్ చేయాల్సి ఉంటుంది. అందుకోసం ముందుగా గూగుల్ ప్లే స్టోర్ నుంచి ఈ యాప్ ను డౌన్లోడ్ చేసుకోవాలి. మీరు సైన్ ఇన్ అయితే 20 పాయింట్స్ వస్తాయి. వేరొకిరికి రెఫర్ పంపితే 15 పాయింట్స్ ను పొందుతారు వీటితో పాటు మీరు ప్రతిరోజూ 1000 అడుగులు వేస్తే ఒక పాయింట్ వస్తుంది. ఇలా మీరు ఎన్ని వేల అడుగులు వేసి అన్ని పాయింట్ష్ పొందవచ్చు . వీటితో ఆన్లైన్లో వస్తువులు కొనుగోలు చేయొచ్చు.

Step Set Go: ఇది పెడో మీటర్,క్యాలరీ కౌంటర్ స్పోర్ట్స్ ట్రాకర్. ఇది మీరు వేసే ప్రతి అడుగుకు కౌంట్ వేస్తుంది. దీని ద్వారా ఐపోన్, తదితర బహుమతులు కూడా పొందవచ్చు. భారత్ లోఎక్కువగా దీనినే డౌన్లోడ్ చేసుకుంటున్నారు.

Hav Fitness: ఒకప్పుడు ఇది ఫుడ్ యాప్. ఇప్పుడు నీరు, నిద్ర, శారీరక శ్రమను ట్రాక్ చే్తుంది. నడిచేటప్పుడు డబ్బు సంపాదించడానికి మంచి యాప్ ఇది. దీని ద్వారా వచ్చిన పాయింట్స్ తో వస్తువులు కొనుగోలు చేయొచ్చు.