Chanakya Nithi: మనలో చాలామంది జీవితంలో ఉన్నతస్థానాల్లో ఉండాలని ఆశిస్తుంటారు. అయితే మనకు ఉండే కొన్ని అలవాట్ల వల్ల ఉన్నత స్థానాలకు చేరుకునే విషయంలో ఇబ్బందులు ఎదురవుతూ ఉంటాయి. తీవ్రంగా శ్రమించడంతో పాటు పట్టుదల, ఓపిక, స్వయంకృషితో కష్టపడితే లక్ష్యాలు సులువుగా నెరవేరే అవకాశాలు అయితే ఉంటాయి. అయితే కొంతమందిలో ఈ లక్షణాలు ఉన్నా వాళ్లు చెడు అలవాట్లకు బానిసలై కెరీర్ ను నాశనం చేసుకుంటూ ఉంటారు.
మనిషి తన లైఫ్ లో సక్సెస్ కావాలంటే ముఖ్యంగా మూడు అలవాట్లకు దూరంగా ఉంటే మంచిదని చెప్పవచ్చు. మనిషి విజయం సాధించడానికి ముఖ్యంగా చెడు వ్యసనాలకు దూరంగా ఉండాలి. చెడు వ్యసనాల వల్ల ఇతరులకు మనపై దురభిప్రాయం కలిగే అవకాశాలు అయితే ఉంటాయని చెప్పవచ్చు. చెడు వ్యసనాల వల్ల కెరీర్ లో ఉన్నత లక్ష్యాలను సాధించే విషయంలో అవరోధాలు ఏర్పడతాయి.
Also Read: Chinajiyar Swamy: కేసీఆర్ తో గ్యాప్.. సమ్మక్క-సారక్క వివాదంపై చినజీయర్ స్వామి హాట్ కామెంట్స్
చెడు వ్యసనాల వల్ల శారీరక సమస్యలతో పాటు మానసిక సమస్యలు కూడా వేధించే అవకాశాలు అయితే ఉంటాయని చెప్పవచ్చు. మందు, డ్రగ్స్, ఇతర చెడు అలవాట్లు ఆరోగ్యానికి ఏమాత్రం మంచివి కాదు. మనిషికి హాని చేసేవాటిలో సోమరితనం కూడా ఒకటని చెప్పవచ్చు. మనిషికి ఎంత ప్రతిభ ఉన్నా సోమరితనం వల్ల లక్ష్యాలను సాధించే విషయంలో అవరోధాలు ఏర్పడతాయి.
బద్ధకంగా, సోమరితనంగా ఉండటం వల్ల ఏ పనిని సాధించడం సాధ్యం కాదు. అందువల్ల సోమరితనానికి వీలైనంత దూరంగా ఉంటే మంచిదని చెప్పవచ్చు. కష్టపడే గుణాన్ని అలవాటు చేసుకుంటే ఎంతో మేలు జరుగుతుంది. మనిషి యవ్వనంలో ఉన్న సమయంలో చెడు సహవాసాలకు దూరంగా ఉండాలి. చెడు సహవాసాలకు దూరంగా ఉండటం వల్ల క్రమశిక్షణతో మెలిగే అవకాశాలు అయితే ఉంటాయని చెప్పవచ్చు. ఇప్పటికే ఈ అలవాట్లు మీకు ఉంటే ఈ అలవాట్లకు వీలైనంత వేగంగా దూరమైతే మంచిదని చెప్పవచ్చు.
Also Read: Puri Jagannadh: అప్పట్లో ‘పూరి’ సినిమాలను రిజెక్ట్ చేసిన హీరో.. ఇప్పుడు ఒక్క హిట్ లేదు..