
Chanakya Niti: ఆచార్య చాణక్యుడు మనకు జీవితంలో ఏం చేయాలో ఏం చేయకూడదో అనే విషయాలు వివరించాడు. అప్పుడు ఆయన చెప్పినవి నేటికి కూడా మనకు మార్గదర్శకంగా నిలుస్తున్నాయి. జీవితంలో బాధలు అనుభవించేందుకు మనం ఆచరించే విషయాలే కారణాలుగా నిలుస్తాయి. దీంతో మనం ఎప్పుడు మంచి విషయాలపైనే ధ్యాస పెట్టాలి. అప్పుడే మనకు మంచి ఫలితాలు అందుతాయి. మనం చెడు దృష్టితో చూస్తే అన్ని చెడు ఫలితాలు కనిపిస్తాయి. చెడ్డ వారితో స్నేహం చేస్తే మనకు కూడా ఆ లక్షణాలే వస్తాయి. దీంతో సమాజంలో పరువు లేకుండా పోతుంది. చెడు సహవాసం మంచిది కాదని ఎన్నో కథల్లో చదువుకున్నాం.
చెడు అలవాట్లు
చెడ్డ అలవాట్లు ఉన్న వ్యక్తులతో కలిసి తిరడం వల్ల మనకు కూడా చెడ్డ పేరు వస్తుంది. వారి అలవాట్లు మనల్ని కూడా ప్రభావితం చేస్తాయి. సంసారంలో భర్త లేదా భార్య ఎవరో ఒకరు తప్పు చేయడం వల్ల ఆ కుటుంబానికే చెడ్డ పేరు వస్తుంది. ఫలానా వ్యక్తి అలా చేస్తున్నారని ఆ నోటా ఈ నోటా ఊరంతా తెలుస్తుంది. దీంతో మన పరువు కాస్త గంగలో కలుస్తుంది. అందుకే చెడు వారి స్నేహం కరెక్టు కాదని చాణక్యుడు సూచిస్తున్నాడు. వారి వల్ల మనకు ఉన్న పేరు కూడా పోతుంది.
డబ్బు మీద..
డబ్బు మీద అత్యాశ ఉన్న వారు శత్రువులను కూడా డబ్బు అడుగుతుంటారు. వారికి ఎవరైనా ఫర్వాలేదు. డబ్బు ఇచ్చే వారైతే చాలు. డబ్బు మీద అత్యాశతో ఏం చేయడానికి అయినా వెనకాడరు. అలాంటి వ్యక్తులతో జాగ్రత్తగా ఉండాలి. జీవితంలో వారికి డబ్బే ముఖ్యం. దాని కోసం ఎంతకైనా తెగిస్తారు. వారిని కూడా ఎవరైనా డబ్బులు అడిగితే శత్రువులుగా భావిస్తారు. ఇలా డబ్బు కోసం ఏదైనా చేయడానికి ఇష్టపడే వారితో మనం అప్రమత్తంగా ఉండాలి. లేదంటే ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుంది.
వితండవాదులు
కొందరు తాము చెప్పిందే వేదంగా మాట్లాడతారు. తమకు తెలిసిందే వాస్తవంగా చెబుతారు. ఎదుటి వారిని మాట్లాడనివ్వరు. అలాంటి వారితో కూడా జాగ్రత్తగా ఉండాలి. మొండిగా వాదించినా ఫలితం ఉండదు. తమకు తెలిసిందే వేదంగా వారికి మిడిమిడి తెలివి ఉంటుంది. దీంతో వారు ఇతరులు చెప్పేది విశ్వసించరు. తమకు తోచిందే కరెక్టని వితండవాదం చేస్తారు. వారితో గొడవపడేకంటే మౌనంగా ఉండటమే శ్రేయస్కరం. ఇలా చాణక్యుడు మూర్ఖుల వాదన గురించి కూడా మనల్ని మనం కాపాడుకోవాల్సిన అవసరం ఉందని చెబుతాడు.

తప్పులు చేసే వారు..
తప్పులు చేసే వారు ఇతరులను కూడా తప్పుగానే చూస్తారు. తప్పు చేసే వ్యక్తులకు మంచి చేసే వారు కూడా తప్పులు చేసే వారిగానే కనిపించడం సహజం. తప్పులు చేసే వారికి అవే లక్షణాలు ఉంటాయి. దీంతోనే వారు ఇతరులను కూడా తప్పుడు భావంతోనే చూడటం పరిపాటి. చాణక్యుడి నీతి ప్రకారం తప్పు చేసే వ్యక్తులే ఎదుటి వారిని అనుమానంతో చూస్తుంటారు. వారికి వారు చేసేది తప్ప ఇతరులు చేసేవి అన్ని తప్పులుగానే కనిపిస్తాయి. ఈ క్రమంలో తప్పుడు పనులు చేసే వారికి తప్పుడు సంకేతాలు రావడం కామనే.
అనుమానించే వారు..
కొంతమంది చీటికి మాటికి అనుమానాలు వ్యక్తం చేస్తుంటారు. జీవితంలో ఏ చిన్న పొరపాటు జరిగినా దాన్ని పెద్ద కోణంలో ఆలోచించి మెదడును పాడు చేసుకుంటారు. భార్యాభర్తల్లో కూడా ఇలాంటి అనుమానాలు ఉండటం చూస్తుంటాం. ఈ అనుమానాలే పెద్ద సమస్యలకు దారి తీస్తాయి. అలాంటి వారి వల్ల కూడా మనం జాగ్రత్తగా ఉండాలి. అనవసర విషయాలను భూతద్ధంలో చూసుకుని బాధపడే వారు ఎంతో మంది ఉంటారు. అలాంటి వారితో కూడా జాగ్రత్తగా వ్యవహరించాల్సిందే. లేదంటే మనకే చిక్కులు వస్తాయి.