Chanakya Neeti: ఆచార్య చాణక్యుడు స్త్రీల గురించి ఎన్నో విషయాలు తెలియజేశాడు. వారి ఆలోచన విధానం, ప్రవర్తన, గుణాలు ప్రత్యేకంగా ఉంటాయి. మహిళలకు కోరికలు ఎక్కువగా ఉంటాయి. కాకపోతే వారు బయట పడరు. మగవారు చిన్న విషయాలకే ఉద్వేగానికి గురవుతుంటారు. కానీ స్త్రీలు భావోద్వేగానికి రావాలంటే సమయం పడుతుంది. అంత త్వరగా కోపం కూడా వారికి రాదు. ఒకవేళ వచ్చిందంటే పోదు. ఆడవారికి ఏదైనా అంత త్వరగా నచ్చదు. నచ్చిందంటే చాలు వదలరు. అంతటి శక్తియుక్తులు వారి సొంతం. ఒకసారి నిర్ణయం తీసుకుంటే వారికి తిరుగే ఉండదు. అది కచ్చితంగా చేసి తీరాల్సిందే.
ఆకలి ఎక్కువ..
మగవారి కంటే ఆడవారికి ఆకలి ఎక్కువగా ఉంటుంది. ఎందుకంటే వారు పొద్దున లేచింది మొదలు పడుకునే వరకు ఎన్నో రకాల పనులు చేస్తుంటారు. ఉదయం నుంచి సాయంత్రం వరకు పనులు చేస్తూనే పోతారు. దీంతో తొందరగా అలసటకు గురవుతారు. ఆకలి కూడా ఎక్కువగా వేస్తుంది. వంట పాత్రలు తోమడం, పిల్లల పనులు చేయడం, బట్టలు ఉతకడం, ఇల్లు శుభ్రం చేయడం వంటి పనులు చేయడం వల్ల వారికి తొందరగా ఆకలి వేస్తుంది. పురుషుల కంటే స్త్రీలకు ఎక్కువ ఆకలి వేయడం సహజమే.
ధైర్యం కూడా..
పురుషుల కంటే స్త్రీలకు ధైర్యం కూడా ఎక్కువే. చిన్న విషయాలకు ఎక్కువగా భయపడుతున్నా తెగించినట్లయితే వారిని మించిన వారుండరు. వారికి ఇష్టమైన విషయాల్లో మానసికంగా పురుషుల కంటే స్త్రీలకే ఎక్కువ ధైర్యం ఉంటుంది. మనం రోజు పత్రికల్లో చదువుతుంటాం. పిల్లలతో సహా తల్లి ఆత్మహత్య అని చూస్తుంటారు. తన పిల్లలను బావిలో వేసి తరువాత ఆమె దూకుతుంది. అంతటి తెగువ వారికి ఆభరణం లాంటిదే. ఇలా స్త్రీలు అనుకున్న పని చేయకపోతే ఆగిపోరు. తమ పని కానచ్చాక ఇతర విషయాలపై దృష్టి సారించడం గమనార్హం.
కోరికలు ఎక్కువే..
మహిళలకు కోరికలు ఎక్కువ. బంగారం, బట్టలు అంటే కట్టుకున్న వాడిని సైతం పట్టించుకోరు. బంగారమైతే దేన్ని లెక్క చేయరు. బంగారం కోసం దేనికైనా రెడీ అంటారు. ఇలా బంగారమైనా, బట్టలైనా వారికి కోరికలు మెండుగా ఉంటాయి. ఇంకా అనేక విషయాల్లో పురుషుల కంటే మహిళలే ఎక్కువ రెట్లు ముందుంటారు. కాకపోతే వారు బయటపడరు. పురుషులు తొందరగా తమ అభిప్రాయాలు వ్యక్తం చేస్తారు. కానీ వారు అలా కాదు తమకు బాగా నచ్చితేనే ముందుకొస్తారు. లేదంటే వెనకే ఉండిపోతారు.