Sleeping Drooling While: కొంతమంది నిద్రలో ఉన్నప్పుడు గురక పెడుతుంటారు. మరికొందరు కలవరిస్తూ ఉంటారు. కానీ ఇంకొందరికి నోరు తెరుచుకొని నోటిలో నుంచి లాలాజలం కారుతూ ఉంటుంది. అయితే చూడ్డానికి ఇదే పెద్ద సమస్య కాకపోయినా ఏదో ఆరోగ్య సమస్య ఉంటేనే ఇలా నోటిలో నుంచి లాలాజలం వస్తుందని కొందరు ఆరోగ్య నిపుణులు అంటున్నారు. దీనిని నిర్లక్ష్యం చేస్తే ప్రమాదమే అని పేర్కొంటున్నారు. అసలు నోటిలో నుంచి ఇలా లాలాజలం ఎందుకు కారుతుంది? ఇలా కారడం వల్ల ఎలాంటి ప్రమాదం? ఈ ఈ సమస్య నివారణకు పరిష్కారం ఏంటి?
కొంతమంది వారి ఆరోగ్య దృష్ట్యా నిద్రపోతున్నప్పుడు నోరు తెరుచుకుంటుంది. ఇది ఎడమ లేదా కుడి వైపు తిరిగి పడుకున్నప్పుడు నోరు తెరుచుకొని అందులోకి వెళ్లి లాలాజలం కిందికి వస్తుంది. అయితే ఇలా రావడానికి సైనస్ సమస్య అని కొందరు ఆరోగ్య నిపుణులు తెలుపుతున్నారు. ముక్కులో అలర్జీ, జలుబు ఉండడం వల్ల ముక్కు ద్వారా శ్వాస తీసుకోవడం కష్టం అవుతుంది. దీంతో ఆటోమేటిగ్గా నోరు తెరుచుకుంటుంది. దీనివల్ల లాలాజలం కిందికి వస్తుంది. అలాగే కొందరి శరీరాల్లో అజీర్ణం, గంట సమస్యలు ఉండడంవల్ల లాలాజలం కిందికి వస్తుంది. దవడ మజిల్స్ బలహీనంగా మారినప్పుడు కూడా ఇలాగే ఉంటుంది. ఎడమవైపు లేదా కొడుకువైపు తిరిగి పడుకున్నప్పుడు నిద్రలో శరీర స్థానం కూడా లాలాజలం కారడానికి కారణం అవుతుంది.
అయితే ఇలా లాలాజలం కారడం అనేది తేలికగా తీసుకోవద్దు. ఎందుకంటే రాత్రి సమయంలో ఇలా లాలాజలం వచ్చేవారికి ఊపిరి తీసుకోవడం కష్టంగా మారుతుంది. దీనివల్ల శ్వాస సమస్యలు వచ్చే అవకాశం ఉంది. ప్రధానంగా సైనస్ సమస్యతోనే ఇది ఏర్పడుతుంది. అందువల్ల ప్రారంభంలోనే దీనిని గుర్తించి వెంటనే వైద్యులను సంప్రదించాలి. కొందరికి ఇది ప్రమాదకరంగా మారే అవకాశాలు కూడా ఉన్నాయి. ఇది గ్యాస్ట్రో సంబంధిత సమస్యలు ఉన్నా కూడా ఏర్పడుతుంది. అందువల్ల వైద్యుల వద్దకు వెళ్లి సరైన చికిత్స తీసుకోవడం మంచిది.
అయితే నోటి నుంచి లాలాజలం కిందికి రావడం కొత్తగా అనిపిస్తే ఇంట్లోనే కొన్ని చిట్కాలు పాటించి చూడాలి. నిద్రపోయే స్థానాన్ని మార్చుకోవాలి. అంటే పక్కకు తిరిగి పడుకోకుండా వెల్లకిలా పడుకోవాలి. అలాగే దవడ, మెడ సపోర్ట్ చేసే విధంగా సరైన పిల్లో వాడాలి. సైనస్ సమస్య ఎక్కువ కాకుండా ముందు జాగ్రత్తగా ఆవిరి పీల్చుట, ఎలర్జీ వచ్చే వస్తువులు తినకుండా జాగ్రత్త పడాలి. రాత్రి సమయంలో తొందరగా డైజెషన్ అయ్యే ఆహార పదార్థాలను తీసుకోవాలి. రోజుకు రెండుసార్లు బ్రష్ చేయడం మంచిది. అలాగే కొన్ని నీళ్లను నోటిలో ఉంచి పది సెకండ్ల పాటు దవడను బిగించి మూసుకోవడం.. నాలుక పై భాగంలో నొక్కి 10 సెకండ్లు ఉంచడం వల్ల దవడ ఎక్సర్సైజ్ చేసినట్లు అవుతుంది. దీంతో నోటి నుంచి లాలాజలం కారిపోయే సమస్య తగ్గే అవకాశాలు ఉంటాయి.
అయితే పడుకునే సమయంలోనే కాకుండా ఉదయం కూడా ఎక్కువగా లాలాజలం కారితే.. గురక సమయంలో కూడా లాలాజలం కారితే.. గొంతు ఇన్ఫెక్షన్లు వచ్చినప్పుడు లాలాజలం వస్తే వెంటనే వైద్యులను సంప్రదించాలి.