spot_img
Homeలైఫ్ స్టైల్Effects Of Alcohol On Youth Health: సరదాగా ఒక పెగ్గు.. చివరికి వ్యసనం.. యుక్త...

Effects Of Alcohol On Youth Health: సరదాగా ఒక పెగ్గు.. చివరికి వ్యసనం.. యుక్త వయసులో అదే పనిగా తాగితే జరిగేది ఇదే..

Effects Of Alcohol On Youth Health: ఫ్రెండ్స్ కలుస్తారు.. అందులో ఒకడు ఒక పెగ్గు తాగు మామ అంటాడు. అతి బలవంతంగా తాగాల్సి వస్తుంది. ఆ తర్వాత అకేషన్ బట్టి అలవాటవుతుంది. చివరికి వ్యసనం గా మారుతుంది. వ్యసనం అనేది ఏడూర్ల ప్రయాణం వంటిది. దానివల్ల ఎన్ని అనర్ధాలు జరుగుతాయో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.

నేటి కాలంలో మద్యం తాగే వారిలో యువత కూడా అధికంగా ఉండడం ఆందోళన కలిగిస్తోంది. యువత తాగి తాగి తమ ఆరోగ్యాలను పాడు చేసుకుంటున్నది. సరదాగా మొదలైన అలవాటు చివరికి వ్యసనానికి దారి తీస్తోంది. ఇలా తాగడం వల్ల శరీరం నాశనం అవుతుంది. అంతర్గత ఆరోగ్యాలు పాడవుతాయి. చివరికి తీవ్రమైన అనారోగ్యం దరి చేరుతుంది. అప్పుడు ఎన్ని రకాలుగా చికిత్స పొందినప్పటికీ ఉపయోగముండదు. ఎందుకంటే మద్యం అనేది అత్యంత ప్రమాదకరమైనది. అది శరీరంలో ఉన్న అవయవాలను మొత్తం నాశనం చేస్తూ ఉంటుంది. ముందుగా లివర్.. ఆ తర్వాత మూత్రపిండాలు.. ఇతర అవయవాలు పాడవుతాయి. చివరికి మరణం సంభవిస్తుంది.

నేటి కాలంలో యువత ఒత్తిడి నుంచి బయటపడేందుకు మద్యం తాగుతున్నారు. యంగ్ ఏజ్ లో ఆల్కహాల్ ఎక్కువ తీసుకుంటే మధ్య వయసుకు వచ్చేసరికి మెదడు పనితీరు పూర్తిగా మందగిస్తుంది. అప్పటికి మద్యం మానేసినప్పటికీ ఉపయోగము ఉండదు. ఎందుకంటే అప్పటికే మెదడు పనితీరు పూర్తిగా మందగిస్తూ ఉంటుంది. స్వతహాగా నిర్ణయాలు తీసుకునే సామర్థ్యం పూర్తిగా కోల్పోతుంది. తద్వారా భవిష్యత్తు కాలంలో ఇది జ్ఞాపకశక్తి మీద తీవ్రమైన ప్రభావం చూపిస్తుంది. అప్పుడు కోలుకోవడానికి అనేక రకాలైన చికిత్సలు తీసుకోవాల్సిన అవసరం ఏర్పడుతుంది.

యంగ్ ఏజ్ లో మద్యం తీసుకునే వారి మీద ఇటీవల మసాచు సెట్స్ యూనివర్సిటీ అధ్యాపకులు పరిశోధన చేశారు. ఆ తర్వాత వారి జ్ఞాపకశక్తిని పరిశీలించారు. కొన్ని సందర్భాలలో వారు తీసుకున్న నిర్ణయాలను గమనించారు. మద్యం తాగకముందు.. తాగిన తర్వాత వారి మెదడు లో మార్పులను గమనించారు. ఈ మార్పులు క్రమేపి మెదడు పనితీరు మీద ప్రభావం చూపిస్తున్నట్టు వారు గుర్తించారు. దీనివల్ల జ్ఞాపకశక్తి తగ్గడం మాత్రమే కాకుండా.. నిర్ణయాలు తీసుకునే విషయంలో కూడా మెదడు ప్రభావితమవుతోందని గుర్తించారు. అందువల్లే మద్యం తాగడం ఆరోగ్యానికి అత్యంత ప్రమాదకరమని యూనివర్సిటీ అధ్యాపకులు పేర్కొన్నారు. అయితే కొంతమంది యువకులు అదేపనిగా మద్యం తాగడం వల్ల వారి మెదడు పని మరింత తీవ్రంగా ప్రభావితం అవుతుందని శాస్త్రవేత్తలు గుర్తించారు.

Anabothula Bhaskar
Anabothula Bhaskarhttps://oktelugu.com/
Anabothula Bhaskar is a Senior Political Content writer who has very good knowledge on Telugu politics. He is a senior journalist with good command on writing articles with good narative.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Exit mobile version