
మన వంటింట్లో ఉండే దినుసుల సహాయంతో ఎన్నో అనారోగ్య సమస్యలకు సులభంగా చెక్ పెట్టవచ్చు. అలాంటి దినుసుల్లో వాము కూడా ఒకటి వాము సహాయంతో మనకు ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు చేకూరుతాయి. వాము రుచి ఘాటుగా ఉంటుందనే సంగతి తెలిసిందే. రోజూ వామును తినడం వల్ల ఆరోగ్య ప్రయోజనాలు పొందడంతో పాటు పలు ఔషధాల తయారీలో సైతం వామును వినియోగించడం జరుగుతుంది.
రోజూ వాము తినడం వల్ల బీపీ అదుపులో ఉంటుంది. జలుబు, దగ్గు లాంటి సమస్యలకు వాము సులభంగా చెక్ పెడుతుంది. గొంతు బొంగురు పోయిన సమయంలో వాము తినడం వల్ల గొంతు సాధారణ స్థితికి చేరుకునే అవకాశం అయితే ఉంటుంది. రాత్రంతా వామును నీటిలో నానబెట్టి ఉదయాన్నే ఆ నీటిలో తేనె కలిపి తాగితే కిడ్నీ సమస్యలు సులభంగా దూరమయ్యే అవకాశాలు అయితే ఉంటాయి.
వాము టీ తాగడం వల్ల శ్వాసకోశ సమస్యలకు సులభంగా చెక్ పెట్టడం సాధ్యమవుతుంది. వాము టీ తాగడం వల్ల క్యాన్సర్ బారిన పడే అవకాశాలు సైతం తగ్గుతాయి. వాము నీటిని తాగడం వల్ల అసిడిటీ, జీర్ణ సమస్యలకు చెక్ పెట్టవచ్చు. మలబద్దకం, కడుపు ఉబ్బరం తగ్గించడంలో వాము తోడ్పడుతుంది. వాము కీళ నొప్పులను తగ్గించడంతో పాటు గర్భిణీ, బాలింతలకు ఎంతో మేలు చేస్తుందని చెప్పవచ్చు.
కీళ్లకు వాము నూనెను మర్ధనా చేస్తే కీళ్ల నొప్పులు దూరమవుతాయి. శరీరంలో పేరుకుపోయిన కొవ్వును తొలగించడంలో వాము తోడ్పడుతుంది. రకరకాల ఇన్ఫెక్షన్స్ సోకకుండా వాము దివ్యఔషధంలా పని చేస్తుంది. తలనొప్పి, మైగ్రేన్, అలసటను వాము తగ్గిస్తుంది.