Cancer: భారత ఆహార ఉత్పత్తుల్లో క్యాన్సర్‌ కారకాలు.. ఈఎఫ్‌ఎస్‌ఏ షాకింగ్‌ వివరాలు!

భారత దేశంలోని 527 రకాల ప్రమాదకర ఆహార ఉత్పత్తుల్లో 87 రకాల ఉత్పత్తులను ఈ కారణంగానే తిరస్కరించినట్లు తెలుస్తోంది.

Written By: Raj Shekar, Updated On : April 25, 2024 5:06 pm

Cancer

Follow us on

Cancer: భారత ఆహార ఉత్పత్తులు ప్రాణాంతకంగా మారుతున్నాయా.. అంటే అవుననే అంటోంది యూరోపియన్‌ ఫుడ్‌ సేఫ్టీ అథారిటీ(ఈఎఫ్‌ఎస్‌ఏ). ఇప్పటికే భారత బ్రాండ్లు అయిన ఎవరెస్ట్, ఎండీహెచ్‌ ఎత్పత్తుల్లో ఇథిలీన్‌ ఆక్సైడ్‌ అనే కార్యన్సర్‌ కారకం ఉందని గుర్తించింది. దీంతో సింగపూర్, హాంకాంగ్‌ ఈ ఉత్పత్తులను నిషేధించాయి. ఇదిలా ఉంటే.. ఇండియాలో తయారైన దాదాపు 527 రకాల ఆహార ఉత్పత్తుల్లో క్యాన్సర్‌కు దారితీసే కారకాలు ఉన్నట్లు రాపిడ్‌ అలర్ట్‌ సిస్టమ్‌ ఫర్‌ ఫుడ్‌ అండ్‌ ఫీడ్‌(ఆర్‌ఏఎస్‌ఎఫ్‌ఎఫ్‌) డేటా ప్రకారం నిర్ధారణ అయినట్లు ఈఎఫ్‌ఎస్‌ఏ అధికారులు షాకింగ్‌ విషయాలు తెలిపారు.

87 ఉత్పత్తులు తిరస్కరణ..
భారత దేశంలోని 527 రకాల ప్రమాదకర ఆహార ఉత్పత్తుల్లో 87 రకాల ఉత్పత్తులను ఈ కారణంగానే తిరస్కరించినట్లు తెలుస్తోంది. మరోవైపు 332 ఉత్పత్తుల్లో భారత్‌లోనే తయారైన హానికర రసాయనాలను వినియోగించినట్లు తేలింది. మిగతావాటిలో వాడిన రసయనాలు ఎక్కడివో తెలియాల్సి ఉంది. ఇథిలీన్‌ ఆక్సైడ్‌ వాస్తవానికి వైద్య పరికరాలపై క్రిములను చంపడానికి, వాటిని శుభ్రం చేయడానికి వాడుతారు. పురుగుమందు, స్టెరిలైజింగ్‌ ఏజెంట్‌గా వినియోగిస్తారు. దీనిని ఆహార ఉత్పత్తుల్లో వాడడంతో లింఫోమా, లుకేమియా క్యాన్సర్‌ వచ్చే ప్రమాదం ఉందని తేలింది.

ఇథిలీన్‌ ఆక్సైడ్‌ ఎంత డేంజర్‌ అంటే..
ఇథిలీన్‌ ఆక్సైడ్‌ ఎంత ప్రమాదకరమో రామయ్య అడ్వాన్స్‌డ్‌ టెస్టింగ్‌ ల్యాబ్స్‌లో చీఫ్‌ ఆపరేటింగ్‌ ఆఫీసర్‌గా పనిచేస్తున్న జుబిన్‌ జార్జ్‌ జోసెఫ్‌ వెల్లడించారు. ఇథిలీన్‌ ఆక్సైడ్‌ ఉప ఉత్పత్తి అయిన ఇథిలీన్‌ గ్లైకాల్‌ చాలా ప్రమాదమని చెప్పారు. దీనిని గతంలో దగ్గు సిరప్‌లలో వాడడంతో ఆఫ్రికాలో మరణాలు సంభవించాయని తెలిపారు. ఇప్పటికే ఇథిలీన్‌ ఆక్సైడ్‌ కలిగిన ఆహార పదార్థాలను తీసుకున్న వారికి గామా కిరణాలతో చికిత్స అందించాలన్నారు. ఫుడ్‌ సేఫ్టీ అండ్‌ స్టాండర్డ్స్‌ అథారిటీ ఆఫ్‌ ఇండియా వంటి ప్రభుత్వ సంస్థలు అధ్యయనాలు నిర్వహించాలని సూచించారు.