Cancer Awareness Story: సాధారణంగా చెడు అలవాట్లతో( bad habits) ఎక్కువమంది రోగాల బారిన పడతారు. ముఖ్యంగా మద్యపానం, ధూమపానం, మాదకద్రవ్యాలు తీసుకోవడం వంటి కారణాలతో ఎక్కువ మంది క్యాన్సర్ బారిన పడతారు. అయితే ఎన్టీఆర్ జిల్లాకు చెందిన 36 ఏళ్ల యువకుడు మాత్రం ఏ అలవాట్లు లేకుండానే క్యాన్సర్ బారిన పడ్డాడు. ఆరోగ్యంగా, నియమిత జీవితాన్ని గడిపిన అతడికి ఇలాంటి వ్యాధి ఎలా సోకిందని కుటుంబ సభ్యులు, స్థానికులు తీవ్ర ఆశ్చర్యానికి గురయ్యారు. ఎటువంటి దురాలవాట్లు లేని వ్యక్తికి క్యాన్సర్ సోకడం ఏంటి అని ఎక్కువ మంది ప్రశ్నిస్తున్నారు. అయితే ఆ యువకుడు క్యాన్సర్ తో పోరాడుతూ చనిపోయాడు.
Also Read: నుదుట సింధూరం.. జగన్ హిందుత్వ టర్న్ వెనుక కథేంటి?
కేవలం ఆ కారణంతోనే..
అయితే పోస్టుమార్టం రిపోర్టులో ఆసక్తికర విషయాలు వెలుగులోకి వచ్చాయి. అతని మృతదేహాన్ని పరిశీలించిన షాకింగ్ అంశాలు బయటపడ్డాయి. కేవలం ప్లాస్టిక్( plastic) సామాగ్రిని అతిగా వినియోగించడం వల్లే ఆయన ప్రాణాలు మీదకు తెచ్చుకున్నాడని తేలింది. ప్లాస్టిక్ కవర్లలో వేడి వేడి ఆహారం తీసుకోవడం.. ప్లాస్టిక్ సీసాలో నీటిని తరచూ తాగడం వల్ల ద్రవరూపంలో ఉన్న హానికర రసాయనాలు శరీరంలోకి ప్రవేశించాయి. అవి కాలక్రమేనా క్యాన్సర్కు దారితీసాయని వైద్యులు నిర్ధారించారు. ప్లాస్టిక్ గ్లాస్ తో తరచూ వేడి టీ తాగడం.. ప్లాస్టిక్ కవర్లలో తెచ్చిన ఆహారాన్ని తీసుకోవడం చాలా ప్రమాదకరం. ఈ ఘటనతో గట్టి హెచ్చరికలు ఇచ్చినట్లు అయ్యింది. ఎటువంటి దురాలవాట్లు లేని ఓ యువకుడిని.. కేవలం ప్లాస్టిక్ అనే భూతం వెంటాడింది. అంతం చేసింది.
Also Read: ఈసారి అమరావతి పక్కా.. బాబు సింగపూర్ ప్లాన్లు ఫలిస్తాయా?
చాలా ప్రమాదకరం..
సమాజంలో ప్లాస్టిక్ అనేది ప్రమాదకరం. ప్రతి ఒక్కరూ ఉదయం దైనందిన జీవితం ప్రారంభం నుంచి రాత్రి పడుకునే వరకు ప్రతిక్షణం ప్లాస్టిక్ ను వినియోగిస్తూనే ఉన్నారు. అదే మనిషి జీవితానికి అనర్ధాలు తెచ్చిపెడుతోంది. ప్రభుత్వాలు సైతం ప్లాస్టిక్ నిషేధం పై ఆంక్షలు విధిస్తున్నాయి. కానీ అమలు చేయడంలో కఠినంగా వ్యవహరించడం లేదు. ప్రజల్లో సైతం అవగాహన పెరగడం లేదు. దీంతో విచ్చలవిడిగా ప్లాస్టిక్ వినియోగం పెరుగుతోంది. ప్రజల ప్రాణాలు హరించడానికి కారణమవుతోంది. కనీసం ఇటువంటి ఘటనలతోనైనా ప్లాస్టిక్ వినియోగం తగ్గించుకోవాల్సిన అవసరం అందరిపై ఉంది.