Hair Treatment: ఈ రోజుల్లో వయసుతో సంబంధం లేకుండా జుట్టు సమస్యలు ఇబ్బంది పెడుతున్నాయి. జుట్లు తెల్లగా మారడం, ఊడిపోవడం వంటి సమస్యలతో సతమతమవుతున్నారు. పాతికేళ్లు కూడా లేకుండానే బట్టతల కనిపిస్తోంది. ఇంకా వెంట్రుకలు తెల్లబడి ముసలి ప్రాయం సమస్యల్ని తీసుకొస్తోంది. నలుగురిలో తిరగడానికి ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. మనం తినే ఆహారాలే మనకు ఇలాంటి చిక్కులు తెచ్చిపెడుతున్నాయి. వీటి నుంచి తప్పించుకోవడానికి ఏవేవో ఇంగ్లిష్ మందులు వాడుతూ ఇంకా సమస్యల్ని పెంచుకుంటున్నారు.
బంగాళాదుంప తొక్కలను తీసుకుని నీటిలో ఉడికించి ఆ నీటిని వడకట్టి ఉంచుకోవాలి. షాంపూతో స్నానం చేసిన తరువాత జుట్టు ఆరాక బంగాళాదుంప తొక్కల నీటిని తలకు పట్టించి అరగంట అయ్యాక చల్లని నీటితో శుభ్రం చేసుకోవాలి. ఇలా వారంలో రెండు సార్లు చేస్తే తెల్ల జుట్టు నల్లగా మారుతుంది. తెల్ల జుట్టు ఎక్కువగా ఉంటే ఎక్కువ సార్లు చేయాలి. ఇలా ఓపికగా చేస్తుంటే సైడ్ ఎఫెక్ట్స్ కూడా రావు.
ఆయుర్వేదంలో తెల్ల జుట్టును నల్లగా చేసుకోవడానికి ఎన్నో పరిహారాలున్నాయి. కలబంధ దీనికి మంచి మందులా ఉపయోగపడుతుంది. గతంలో కూడా ఎన్నో రకాల చిట్కాలు తెలియజేశాం. తెల్ల జుట్టును నల్లగా చేసుకోవడంలో గుంటగలగర ఆకు, కరివేపాకు, మునగాకు కూడా ప్రధాన పాత్ర పోషిస్తున్నాయి. పూర్వం రోజుల్లో ఆముదం నూనె వాడేవారు. వారి వెంట్రుకలు వందేళ్లయిని తుమ్మెల్లా మెరిసేవి.
ఇప్పుడు మనం స్నానానికి షాంపూలు వాడుతున్నాం. మన పూర్వీకులు మాత్రం కుంకుడు కాయలు వాడి జుట్టును సంరక్షించుకునే వారు. కాలక్రమేనా మన ఆచార వ్యవహారాలు మారి సమస్యలు తెస్తున్నాయి. కానీ ఈ రోజుల్లో ఎవరిని చూసినా తెల్ల వెంట్రుకల సమస్య వేధిస్తోంది. ఈ నేపథ్యంలో వారు నలుగురిలో తిరిగేందుకు కూడా జంకుతున్నారు.