https://oktelugu.com/

Diabetes: షుగర్ ఉంటే మద్యం తాగొచ్చా? ఎంత తాగాలి?

డయాబెటిస్ పేషెంట్లు అన్నం తినకూడదు. అన్నంకు బదులుగా గోధుమ, ధాన్యాలు, ఆకుకూరలు, కూరగాయలు వంటివి ఎక్కువగా తీసుకోవాలి. స్వీట్లు తినకూడదు.

Written By:
  • Srinivas
  • , Updated On : May 9, 2023 / 06:58 PM IST

    Diabetes

    Follow us on

    Diabetes: ఇటీవల కాలంలో చాపకింద నీరులా మధుమేహం విస్తరిస్తోంది. డయాబెటిస్ కు రాజధానిగా తెలుగు రాష్ట్రాలు నిలుస్తున్నాయి. ఉత్తర భారతదేశం కంటే దక్షిణ భారతదేశంలోనే ఎక్కువ మంది షుగర్ బారిన పడుతున్నారు. దీంతో ప్రస్తుతం మధుమేహుల సంఖ్య అధికమవుతోంది. భవిష్యత్ లో వీరి సంఖ్య ఇంకా పెరిగే అవకావాలున్నాయి. ఈ క్రమంలో డయాబెటిస్ బారిన పడిన వారు ప్రత్యేకమైన ఆహారం తీసుకోవాలని నానా తిప్పలు పడుతున్నారు.

    షుగర్ ఉన్న వారు ఏం తినాలి?

    డయాబెటిస్ పేషెంట్లు అన్నం తినకూడదు. అన్నంకు బదులుగా గోధుమ, ధాన్యాలు, ఆకుకూరలు, కూరగాయలు వంటివి ఎక్కువగా తీసుకోవాలి. స్వీట్లు తినకూడదు. తియ్యని పండ్లు తినొద్దు. మామిడి, సపోట, సీతాఫలం వంటి పండ్లు తినరాదు. ఉప్పు, చక్కెర తినకూడదు. దీని వల్ల షుగర్ లెవల్స్ పెరిగి తీవ్ర ఆరోగ్య సమస్యలు వస్తాయి. దీంతో మన ఆహార అలవాట్లు మార్చుకోవాలి.

    వైన్ తాగొచ్చా?

    షుగర్ ఉన్న వారు మద్యం తాగొచ్చా? తాగితే ఏమవుతుంది? డయాబెటిక్ పేషెంట్లు మందు తాగడం వల్ల ఇబ్బందులు వస్తాయి. దీంతో అవయవాలు దెబ్బ తింటాయి. ఆరోగ్యం క్షీణిస్తుంది. ఈ క్రమంలో షుగర్ ఉన్న వారు మద్యానికి ఎంత దూరం ఉంటే అంత మంచిది. మధుమేహం ఉన్నవారు ఎట్టి పరిస్థితుల్లో కూడా మద్యం సేవించడం మానుకోకపోతే ఇబ్బందులు రావడం ఖాయం. ఒకవేళ అలవాటు ఉన్నా ఎప్పుడన్నా ఓ పెగ్ తీసుకోవాలి. అంతేకాని అదే పనిగా తాగితే అంతే సంగతి.

    జీవనశైలి

    డయాబెటిక్ పేషెంట్లు పరిమిత ఆహారం తీసుకుంటూ రెండు పూటలా వాకింగ్ చేయాలి. దీంతో షుగర్ లెవల్స్ నియంత్రణలో ఉంటాయి. ఆరోగ్యం బాగుంటుంది. ఎలాంటి సమస్యలు రాకుండా ఉంటాయి. దీంతోనే చక్కెర లెవల్స్ పెరగకుండా చేసే పనులు చేసుకుంటూ ఉంటే కష్టాలు రావు. ఇలా షుగర్ ఉన్న వారు తమ జీవనశైలిని మార్చుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది.