https://oktelugu.com/

Cholesterol : కొలెస్ట్రాల్ ఉన్న పేషెంట్స్ ఇక నుండి విచ్చలవిడిగా మాంసాహారం తినొచ్చు అంటున్న డాక్టర్లు

కాబట్టి ఒక క్రమ పద్దతి లో మాంసాహారం తింటే ఎలాంటి సమస్యలు ఉండబోవని డాక్టర్ రాజశేఖర్ ఈ సందర్భంగా చెప్పుకొచ్చారు

Written By:
  • Vicky
  • , Updated On : April 27, 2023 / 11:18 PM IST
    Follow us on

    Cholesterol :  బీపీ , షుగర్ వంటి వాటికంటే అత్యంత ప్రమాదకరమైనది కొలెస్ట్రాల్.ఒక వయస్సు వచ్చిన తర్వాత అందరికీ కామన్ గా ఉండే సమస్య కొలెస్ట్రాల్, ఈ సమస్య వల్ల ప్రాణాలకే ప్రమాదం అని డాక్టర్లు అనేక సందర్భాలలో తెలిపారు.దీనికి సరైన డైట్ తీసుకోవాలని కూడా సూచిస్తూ వచ్చారు,దానికి తగ్గట్టుగానే ఫాలో అవుతుంటారు. అయితే రీసెంట్ గా జరిగిన పరిశోధనల ఆధారంగా కొలెస్ట్రాల్ ఉన్నవాళ్లు మాసం తింటే శ్రేయస్కరం అని అంటున్నారు.

    రీసెంట్ గా ఒక లక్ష 40 వేల మంది పేషెంట్స్ కొలెస్ట్రాల్ ఉన్నవాళ్లు మాంసాహారం తినడం వల్ల గుండెపోటు తీవ్రత ని తగ్గించడం గమనించారట, ఇది ఒక రక్షణ కవచం లాగ నిలుస్తుందని ప్రముఖ గుండె సంబంధిత డాక్టర్ రాజశేఖర్ తెలిపాడు.ఈయన యశోద హాస్పిటల్స్ లో స్పెషలిస్ట్ గా పనిచేస్తున్నాడు. ఇతను కేవలం కార్డియాలజిస్ట్ మాత్రమే కాదు, ఎలక్ట్రో ఫీజియోలాజిస్ట్ కూడా, హైదరాబాద్ లో ఈయనకంటూ ఒక బ్రాండ్ ఇమేజి ఉంది.

    చికెన్ , చేపలు వంటివి తినడం వల్ల కొలెస్ట్రాల్ ఉన్న పేషెంట్స్ గుండె పోటుతో మరణించే అవకాశాలు తగ్గుతాయని,కాబట్టి ఒక క్రమ పద్దతి లో మాంసాహారం తింటే ఎలాంటి సమస్యలు ఉండబోవని డాక్టర్ రాజశేఖర్ ఈ సందర్భంగా చెప్పుకొచ్చారు. దీనితో కొలెస్ట్రాల్ ఉన్న మాంసాహారులు ఇక పండగ చేసుకోవచ్చు అన్నమాట.అయితే అమెరికన్ హార్ట్ అస్సోసియేషన్ చెప్పేది ఏమిటంటే కొలెస్ట్రాల్ ఉన్నవాళ్లు చేపలు తినడం ఆరోగ్యానికి ఎంతో మంచిదట.

    అమెరికన్ హార్ట్ అసోసియేషన్ అధిక కొలెస్ట్రాల్ ఉన్నవారికి చేపలను సిఫార్సు చేస్తుంది. ఇది ప్రతి వారం రెండు 3.5-ఔన్సుల పరిమాణంలో వేయించిన చేపలు లేదా 3/4 కప్పు ఫ్లేక్డ్ ఫిష్ తినాలని సిఫార్సు చేస్తోంది. చేపల ఆరోగ్య ప్రయోజనం చేకూరుస్తాయి. వీటిలో ఒమేగా 3 కొవ్వు ఆమ్లాలతో ముడిపడి ఉంటుంది. “ప్రతి వారం కనీసం ఒక రోజు చేపలు తింటే మంచిది. చేపలు తింటే హృదయ ఆరోగ్యానికి మంచిది. ప్రత్యేకించి ఇది సంతృప్త కొవ్వు, ఉప్పు, జోడించిన చక్కెరతో కూడిన ఆహారాన్ని దీంతో భర్తీ చేస్తుంది.

    ఫ్రై చేయనటువంటి చేపలను రెండు మూడు తినడం వల్ల మూడు ఒమేగా ఫ్యాటీ యాసిడ్స్ ఉత్పత్తి అవుతుందని, కార్డియో వాస్క్యూలర్ లో బ్లాక్స్ కూడా సర్దుకుంటుందని ఈ సందర్భంగా డాక్టర్లు చెప్తున్నారు.దీనితో పాటు ప్రోటీన్స్ ఉన్న ప్లాంట్స్ తినడం వల్ల కూడా ఆరోగ్యానికి ఎంతో మంచిదని అంటున్నారు.మరి ఇన్ని రోజులు మాసం తినడం వల్ల కొలెస్ట్రాల్ పెరిగిపోతుంది అని భయపడిన మాంసాహారులకు ఇక మాంసం తినొచ్చు అన్నమాట.