Husband And Wife Relation: మనదేశంలో సనాతన సంప్రదాయాలు మనుగడలో ఉన్నాయి. దీంతో మనలో చాలా మంది సంస్కృతి, సంప్రదాయాలకు పెద్దపీట వేస్తారు. పూర్వ కాలంలో మన వ్యవస్థలో బాల్య వివాహాలు ఉండేవి. దీంతో వరుడు, వధువు వయసులో భారీ వ్యత్యాసం ఉండేది. దీంతో సహజంగా భర్త వయసు ఎక్కువగా ఉండేది. కాలక్రమంలో వయసు తారతమ్యాలు తగ్గాయి. దీంతో సమ వయసుల వారికే వివాహం చేయడం ఇప్పుడున్న ట్రెండ్. దీంతో భార్యాభర్తల్లో సమభావం ఏర్పడుతోంది.
గతంలో భార్యను ఏమోయ్ అని పిలిచే వారు. కాలక్రమంలో ఇంకా మార్పులు వస్తున్నాయి. ప్రస్తుత పరిస్థితుల్లో పద్ధతులు మారుుతన్నాయి. అందుకే భార్యను పేరు పెట్టి పిలిచేందుకే నిర్ణయించుకుంటున్నారు. అందుకు నలుగురిలో సైతం తమ భార్య అనే ఉద్దేశంతోనే ఉండటంతో పేరు పెట్టి పిలుస్తున్నారు ఇంకా మన పూర్వీకులు మాత్రం వారి భార్యను పేరు పెట్టి పిలిచే సందర్భాలు లేవు. కానీ ఇప్పుడొస్తున్న తరం మాత్రం తన ట్రెండ్ మార్చుకుంటోంది.
ఈ నేపథ్యంలో భార్యాభర్తల్లో సఖ్యత పెరుతోంది. దీంతో వారి మధ్య వయసు తారతమ్యం లేకుండా పోవడంతో పేర్లు పెట్టి పిలుచుకునేందుకు వెనుకాడటం లేదు. అది ఇంట్లో అయినా నలుగురిలోనైనా అలాగే పిలుచుకుంటున్నారు పేర్లు పెట్టి పిలుచుకోకపోవడం గత తాలూకు తరం వాళ్లది. కానీ మారుతున్న పరిస్థితుల్లో అన్ని మార్పు చెందుతున్నాయి. భార్యాభర్తల్లో కూడా ఇలాంటి మార్పులు రావడం సహజమే.
అయితే గతంలో ఉమ్మడి కుటుంబ వ్యవస్థ కూడా ఓ కారణం. అందరిలో భార్యను పేరు పెట్టి పిలవాలంటే ఏదో ఫీలింగ్ ఉండేది. దీంతో వారు మారు పేరుతో పిలిచేవారు. మావ అనో బావ అనో పిలుచుకుంటుండే వారు. భవిష్యత్ లో కూడా ఇంకా మారే సూచనలు కనిపిస్తున్నాయి. అందరిని మా అని సంబోధించినా ఒక పెళ్లాన్ని మాత్రం నా అని సంబోధిస్తారు. ఈ క్రమంలో భార్య పేరును పెట్టి పిలవడం ఓ అరిష్టంగా భావించేవారు పూర్వం రోజుల్లో. నేటి కాంలో మాత్రం అదే ఫ్యాషన్ గా మారుతోంది.
పెళ్లాన్ని పేరు పెట్టి పిలవడం కూడా తప్పేనా అంటున్నారు. కట్టుకున్న దాన్ని పేరు పెట్టి పిలువకపోతే ఎలా అని ప్రశ్నిస్తున్నారు. అందుకే ఇప్పుడున్న పరిస్థితుల్లో భార్యను పేరు పెట్టి సంబోధించడం తప్పు కాదనే అభిప్రాయం అందరిలో వస్తోంది. ఏదిఏమైనా సనాతన సంప్రదాయాలకు చెల్లుచీటి పాటి నూతన ఆచారాలకు తెర తీస్తున్నట్లు తెలుస్తోంది.