Intestines : మనిషి ఆరోగ్యంగా ఉండడానికి శరీరంలోని ప్రతి ఒక్క అవయం సక్రమంగా ఉండాలి. ఏ ఒక్క అవయం బాగా లేకపోయినా మిగతా వాటిపై ప్రభావం పడి అనారోగ్యం వచ్చే అవకాశం ఉంటుంది. శరీరంలోని ప్రతి పార్ట్ ఇంపార్టెంట్. అందువల్ల అన్నిటిని కాపాడుకునే ప్రయత్నం చేయాలి. వీటిలో ప్రధానంగా పేగుల విషయంలో మరింత జాగ్రత్తగా ఉండాలి. మనం తినే ఆహారం సక్రమంగా జీర్ణం కావడానికి పేగులు ఎంతో సహకరిస్తాయి. అయితే ఈ పేగులు అనారోగ్యానికి గురైతే తిన్న ఆహారం జీర్ణం కాకుండా ఉంటుంది. దీంతో అధిక బరువు పెరిగి అనేక సమస్యలు ఎదురవుతాయి. అయితే పేగుల్లో సమస్య లేకుండా ఉండాలంటే ఎటువంటి ఆహారాన్ని తీసుకోవాలి? ఎలాంటి ఆహారం తీసుకుంటే పేగులు పాడవుతాయి? ఆ వివరాలు కి వెళితే.
ప్రస్తుత కాలంలో చాలామంది ఇంట్లో ఫుడ్ కంటే బయట ఎక్కువగా తింటూ ఉంటున్నారు. అయితే చాలా వరకు ఓటర్లలో నాణ్యమైన నూనెను వాడడం లేదు. దీంతో తిన్న ఆహారంతో శరీరంలో అనేక అనారోగ్యానికి గురవుతున్నారు. ముఖ్యంగా కల్తీ నూనె వల్ల శరీరంలోని పేగులు దెబ్బ తినే అవకాశం ఉంటుంది. కల్తీ నూనెతో తయారుచేసిన ఆహార పదార్థాలు తినడం వల్ల పేగుల్లో క్రోనిక్ ఇంట్లో మిషన్ లేదా ఐబీఎస్ వంటి సమస్యలు వస్తాయి. కల్తీ నూనెతో తయారుచేసిన మాంసాహారం తినడం వల్ల ఈ సమస్య మరింత అతిగా తయారవుతుంది. దీంతో పేగులు పాడైపోయి ఆహారం సక్రమంగా సరఫరా కాకుండా ఉంటుంది.
అయితే నూనెలో వాడే తిండికి బదులు సాఫ్టు ఫుడ్ ను ఎంచుకోవాలి. ముఖ్యంగా వేసవి కాలంలో నూనెతో చేసిన ప్రాసెస్ ఫుడ్ కంటే.. లూజుగా ఉండే ఆహార పదార్థాలను ఎక్కువగా తీసుకోవాలి. అయితే ఒకవేళ అనుకోకుండా లేదా తప్పనిసరి పరిస్థితుల్లో ప్రాసెస్ ఫోటో తీసుకున్నా కూడా.. ఆ తర్వాత మజ్జిగ వంటి చల్లని పానీయాలు తాగాలి. అప్పుడు పేగులకు సమస్యలు రాకుండా ఉంటాయి.
చాలామంది వేసవికాలంలో భోజనంలో పెరుగు తప్పనిసరిగా ఉంచుకుంటారు. కానీ ప్రస్తుత కాలంలో పెరుగు కూడా కల్తిమయంగా మారిపోతుంది. ఈ క్రమంలో ఇంట్లో తయారుచేసిన పెరుగుని ఎక్కువగా తీసుకోవాలని అంటున్నారు. ఇంట్లో తయారుచేసిన పెరుగు తినడం వల్ల కడుపులోని పేగుల్లో మంచి బ్యాక్టీరియా పెరుగుతుంది. దీంతో ఇవి ఎలాంటి అనారోగ్య సమస్యలను రాకుండా కాపాడుతాయి. అలాగే తరచు పండ్లు తో పాటు పీచు పదార్థాలను ఎక్కువగా తీసుకుంటూ ఉండాలి. ఇలా చేయడం వల్ల పేగులు ఆరోగ్యంగా ఉంటాయి. అంతేకాకుండా ప్రతిరోజు కాకుండా వారానికి ఒకటి లేదా రెండు సార్లు మాత్రమే ప్రాసెస్ ప్పుడు తీసుకునే ప్రయత్నం చేయాలి.
వేసవికాలంలో ఉష్ణోగ్రత ఎక్కువగా ఉండటం వల్ల ప్రాసెస్ తినడం వల్ల పేగుల్లో వేడి ఎక్కువవుతుంది. దీంతో కడుపు మంటగా ఉంటుంది. ఇలాంటి సమయంలో మజ్జిగ ఎక్కువగా తీసుకోవాలి. మజ్జిగ తీసుకోవడం వల్ల కడుపులో ఉష్ణోగ్రతను తగ్గిస్తుంది. అంతేకాకుండా కడుపులో మంట ఉన్న ఈ సమస్య పరిష్కారం అవుతుంది.
Also Read : మనిషి ప్రేగుల్లో రెండవ మెదడు ఉందా.. అయితే అది ఎలా పని చేస్తుంది?