https://oktelugu.com/

ఆ బియ్యంతో ఊబకాయం సమస్య తీరినట్టే..?

ఈ మధ్య కాలంలో 30, 35 ఏళ్లకే షుగర్, బీపీ బారిన పడే వారి సంఖ్య అంతకంతకూ పెరుగుతోంది. మారుతున్న జీవనశైలి, ఆహారపు అలవాట్లు ఈ వ్యాధుల బారిన పడటానికి కారణమవుతున్నాయి. ఒకసారి ఈ వ్యాధుల బారిన పడితే జీవితాంతం మందులు వాడుతూ జీవనం సాగించాల్సిందే. అయితే వ్యాధి బారిన పడిన తర్వాత బాధ పడే కన్నా వ్యాయామం చేస్తూ సరైన ఆహారపు అలవాట్లను అలవరచుకోవడం ద్వారా సమస్యలకు సులభంగా చెక్ పెట్టవచ్చు. Also Read : […]

Written By:
  • Kusuma Aggunna
  • , Updated On : September 26, 2020 2:20 pm
    Black rice checks Obesity

    Black rice checks Obesity

    Follow us on

    Black rice checks Obesity

    ఈ మధ్య కాలంలో 30, 35 ఏళ్లకే షుగర్, బీపీ బారిన పడే వారి సంఖ్య అంతకంతకూ పెరుగుతోంది. మారుతున్న జీవనశైలి, ఆహారపు అలవాట్లు ఈ వ్యాధుల బారిన పడటానికి కారణమవుతున్నాయి. ఒకసారి ఈ వ్యాధుల బారిన పడితే జీవితాంతం మందులు వాడుతూ జీవనం సాగించాల్సిందే. అయితే వ్యాధి బారిన పడిన తర్వాత బాధ పడే కన్నా వ్యాయామం చేస్తూ సరైన ఆహారపు అలవాట్లను అలవరచుకోవడం ద్వారా సమస్యలకు సులభంగా చెక్ పెట్టవచ్చు.

    Also Read : వేల మంది ప్రాణాలను కాపాడిన ఎలుక.. ఎలా అంటే..?

    తాజాగా శాస్త్రవేత్తలు చేసిన పరిశోధనల్లో కృష్ణ బియ్యం తీసుకోవడం ద్వారా షుగర్ తో పాటు ఊబకాయానికి, ఇతర ఆరోగ్య సమస్యలకు కూడా సులభంగా చెక్ పెట్టవచ్చని తేలింది. మన దేశంలోనే కాదు ఇతర దేశాల్లో కూడా ఊబకాయంతో ఎక్కువ సంఖ్యలో ప్రజలు బాధ పడుతున్నారు. ఊబకాయం హృదయ సంబంధిత సమస్యలతో పాటు రక్తపోటు, హార్ట్ స్ట్రోక్, షుగర్ లాంటి సమస్యలకు కారణమవుతోంది.

    ఊబకాయనికి దేశవిదేశాల్లో వేర్వేరు మందులు అందుబాటులో ఉన్నప్పటికీ ఆ మందులు ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం చూపిస్తాయి. ఆహారం విషయంలో తగిన జాగ్రత్తలు తీసుకోవడమే ఊబకాయానికి సరైన మందు. ఇలాంటి సమయంలో శాస్త్రవేత్తలు కృష్ణ బియ్యం ఊబకాయంతో బాధ పడే వారి విషయంలో మంచి ఫలితాలను సాధిస్తున్నట్టు గుర్తించారు.

    కృష్ణబియ్యం మనుషుల ఆరోగ్యాన్ని వృద్ధి చేయడంతో పాటు రక్తనాళాలు సంకోచించేలా చేస్తుంది. ఇప్పటికే పలు జంతువులపై సాధారణ బియ్యాన్ని, కృష్ణ బియ్యాన్ని ఇచ్చి చేసిన పరిశోధనల్లో శాస్త్రవేత్తలు మంచి ఫలితాలు సాధించారు. కృష్ణ బియ్యం లిపిడ్ మెటబాలిజానికి దోహదపడుతుంది. ఈ ప్రక్రియ వల్ల మలబద్ధకానికి సంబంధించిన సమస్యలు సైతం తగ్గుముఖం పడతాయి.

    Also Read : డెంగ్యూ ప్రాణాలకే ముప్పు.. ఈ లక్షణాలు కనిపిస్తే జాగ్రత్త!