Glamour tips : ఈ రోజుల్లో మనిషికి పొట్ట రావడం సర్వ సాధారణం అయిపోయింది. అలాగే చర్మం నల్లబడి పోతుంది. ఎవరైనా ఏ వయసు వారు అయినా అందంగా కనబడాలని ఆశ పడతారు. మరి ఈ పొట్ట, ఈ చర్మ రోగాలు కారణంగా అందం పోతుంది. కాబట్టి మీరు అందంగా ఉండాలి అంటే.. ఈ పొట్టను, ఈ చర్మ సంబంధిత రోగాలను తగ్గించుకోవాలి. ఆలా తగ్గించుకోవాడనికి అతి సులభమైన మార్గాలు ఉన్నాయి. అవేమిటో చూద్దామా.
1. మీరు తీసుకునే ఆహారంలో విరివిగా మిరపకాయలను వాడటం ద్వారా పొట్ట దగ్గర కొవ్వు త్వరగా కరుగుతుంది.
2. క్యాలీఫ్లవర్, క్యాబేజీని ఆహారంలో భాగం చేసుకోవడం వల్ల పొట్ట కొవ్వు త్వరగా కరుగుతుంది. వీటిలో ఉండే పీచు పదార్ధాలు పొట్టను తగ్గిస్తాయి.
3. గుమ్మడితో కూర చేసుకుని తినడం, బూడిద గుమ్మడి జ్యూస్ చేసుకుని తాగడం వల్ల కూడా కొవ్వు త్వరగా కరుగుతుంది. పైగా ఇది మంచి ఫలితాన్ని ఇస్తోంది.
1. ఎండ దెబ్బకి చాలామందికి ట్యాన్ వచ్చేస్తుంది. అప్పుడు చర్మం నల్లబడుతుంది. పెరుగు రాసుకుంటే చర్మాన్ని చల్లబరిచి ట్యాన్ తొలగిస్తుంది.
2. కలబంద రాసుకున్నా చర్మాన్ని ఆరోగ్యంగా అందంగా మారుస్తుంది. 3. సొరకాయ రసం కూడా నలుపుదనాన్ని పోగొడుతుందని నిపుణులు చెబుతున్నారు.
4. కీర ముక్కలు, క్యాబేజీ ఆకులను నల్లగా మారిన చర్మంపై కప్పి ఉంచి తర్వాత కడిగేసుకోవాలి. అప్పుడు చర్మం అందంగా మారుతుంది.
5. టొమాటో రసాన్ని రుద్దినా మంచి ఫలితం ఉంటుంది.