Benefits of Wearing a Black Thread on Leg: కాలికి నల్ల దారం కట్టుకోవడం అనేది మనం చూస్తూనే ఉన్నాం. ఒక్క కాలికే కాదు, మెడ దగ్గర, నడుము చుట్టూ మొలదారం లాగా కట్టుకుంటారు.
కాలి దగ్గర కట్టుకుంటే చూడటానికి కూడా చాలా అందంగా కనిపిస్తుంది. దీంతో ఒకరిని చూసి మరొకరు అన్నట్టు చాలామంది ఈ నల్ల దారాన్ని కట్టుకోవడానికి ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. దీంతో ఆటోమేటిక్ గా దీనికి డిమాండ్ పెరిగిపోయింది. ఇదే ఇప్పుడు సరికొత్త ట్రెండ్ అవుతుంది.
అయితే నల్ల దారం కట్టుకోవడం అంటే కేవలం అందం మాత్రమే కాదండోయ్. దీని వెనక చాలా రహస్యాలు దాగి ఉన్నాయిన అంటున్నారు నిపుణులు. మనం చిన్న పిల్లలకు దిష్టి తగలకుండా పెట్టే నల్లని బొట్టు అనేది ప్రతికూల బలాన్ని త్వరగా గ్రహిస్తుందంట. ఇది కొందరు జ్యోతిష్యులు చెబుతున్న మాట. అంతే కాదండోయ్ దీని వెనకాల కొన్ని ఆరోగ్య రహస్యాలు కూడా ఉన్నాయంట.
పొట్ట చుట్టూ కట్టుకునే నల్ల దారం అనేది పొట్ట పెరగడాన్ని నియంత్రిస్తుందంట. నల్ల దారం సైజును బట్టి మన పొట్ట పెరుగుతుందని చెబుతున్నారు. అంతే కాకుండా సుదీర్ఘంగా ఉండే నడుము నొప్పిని కూడా ఈ మొలదారం తగ్గిస్తుందని అంటున్నారు. అందుకే పూర్వ కాలం నుంచి మన హిందువులు ఈ నల్లదారాన్ని కట్టుకోవడం ఆనవాయితీగా చేస్తున్నారు.
Also Read: చిచ్చు రేగింది.. ఉద్యోగులు వర్సెస్ ఉపాధ్యాయులు
ఇకపోతే ఈ నల్ల దారం కట్టుకోవడం వల్ల సంతానోత్పత్తికి దోహదం కలుగుతుందంట. పునరుత్పత్తి అవయవాలు చాలా ఆరోగ్యంగా ఉంటాయని, అందువల్ల పిల్లలు కలగడానికి ఎక్కువ మేలు చేకూరుస్తుందని అంటున్నారు. కాగా ఈ నల్ల దారంతో పాటు మువ్వలు, పూసలు కూడా కట్టుకోవడం మనం చూస్తున్నాం. ఇలా కొత్త తరహా సాంప్రదాయాలు వస్తున్నాయి.
నలుపుకు దిష్టిని నియంత్రించే శక్తి ఉంటుందంట. అందుకే పూర్వం నుంచి ఇలాంటి ఆచారాలను ఆనవాయితీగా పాటిస్తున్నాం మనందరం. కాగా ఇప్పటి తరం దీన్ని కేవలం ఆచారంగా మాత్రమే భావించకుండా ఫ్యాషన్ గా కూడా అనుకుంటుంది. అందుకే ఇప్పటి తరానికి తగ్గట్టు లేటెస్ట్ వెర్షన్ లో ఈ దారాలు దొరకుతున్నాయి.
Also Read: జగన్ కు కౌంటర్ ఇచ్చిన పవన్ కళ్యాణ్