
కరోనా ఫస్ట్ వేవ్, సెకండ్ వేవ్ తర్వాత ఆరోగ్యానికి ప్రాధాన్యతనిచ్చే వారి సంఖ్య అంతకంతకూ పెరుగుతోంది. ఆహారం, ఒత్తిడి, మానసిక ఒత్తిళ్లు, ఆర్థిక ఇబ్బందుల వల్ల చాలామంది అనారోగ్య సమస్యలతో బాధ పడుతున్నారు. వేర్వేరు పండ్లను తీసుకోవడం వల్ల ఆరోగ్యంగా ఉండటంతో పాటు శరీరానికి కావాల్సిన విటమిన్లు, మినరల్స్ లభిస్తాయి. అయితే ఇతర పండ్లతో పోలిస్తే డ్రాగన్ పండ్లను తినడం వల్ల ఎక్కువ ప్రయోజనాలను పొందే అవకాశం ఉంటుంది.
గులాబీ రంగులో లోపల తెల్లటి గుజ్జుతో కనిపించే ఈ పంccడ్లు దాదాపు ప్రతి పట్టణం, నగరంలో లభ్యమవుతూ ఉండటం గమనార్హం. మన దేశంతో పోలిస్తే థాయ్ లాండ్, వియత్నాం ప్రజలు ఈ పండును తినడానికి ఎక్కువగా ఇష్టపడతారని సమాచారం. ఈ పండ్ల ఖరీదు ఎక్కువే అయినా ఈ పండ్ల ద్వారా శరీరానికి శక్తినిచ్చే న్యూట్రియెంట్స్ లభిస్తాయి. అందువల్ల ఈ పండు తినడం మంచిదని వైద్య నిపుణులు చెబుతున్నారు.
ఈ పండు శరీరంలో ఇమ్యూనిటీ పవర్ ను పెంచడంతో పాటు క్యాన్సర్ ను, షుగర్, గుండెజబ్బుల బారిన పడకుండా రక్షిస్తుంది. ఈ పండులో ఉండే పీచు పదార్థం వల్ల జీర్ణ సంబంధిత సమస్యలు దూరమవుతాయి. ఐరన్ లోపానికి ఈ పండు తినడం ద్వారా సులువుగా చెక్ పెట్టవచ్చు. ఈ పండ్లు తినడం ద్వారా సులువుగా బరువు తగ్గే అవకాశాలు కూడా ఉంటాయి. ఈ పండ్ల ద్వారా శరీరానికి అవసరమైన మెగ్నీషియం లభిస్తుంది.
ఒక్కో డ్రాగన్ ఫ్రూట్ ధర 70 రూపాయల నుంచి 100 రూపాయల వరకు ఉంటుంది. ఒక్కో పండు దాదాపుగా 400 గ్రాముల బరువు ఉంటుంది. ఈ పండ్లు కొంచెం తీపిగా కొంచెం పుల్లగా ఉంటాయి. ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉండటం వల్లే ధర ఎక్కువైనా ఈ పండును కొనుగోలు చేయడానికి చాలామంది ఆసక్తి చూపుతారు.