Naming Children: పిల్లలకు పేరు పెట్టే సమయంలో చేయకూడని తప్పులు ఇవే.. లైఫ్ లాంగ్ ఇబ్బందులంటూ?

Naming Children: ప్రతి ఒక్కరి జీవితంలో పేరుకు ఎంతో ప్రాధాన్యత ఉంటుందనే సంగతి తెలిసిందే. తల్లిదండ్రులు సైతం తమ పిల్లలకు అందరికీ నచ్చే పేరును పెట్టాలని భావిస్తారు. అయితే పేర్లు పెట్టే సమయంలో కొన్ని జాగ్రత్తలను తప్పనిసరిగా తీసుకోవాలి. ఎవరైతే పిల్లల కీర్తి, ప్రతిష్టలను కోరుకుంటారో వాళ్లు పిల్లలకు రెండక్షరాల పేరును పెట్టాలి. పిల్లలకు దేవుళ్ల పేర్లు పెడితే మరింత మంచి జరుగుతుందని చాలామంది భావిస్తారు. కొడుకు లేదా కూతురు పుట్టిన 11వ రోజున లేదా 12వ […]

Written By: Kusuma Aggunna, Updated On : March 29, 2022 10:26 am
Follow us on

Naming Children: ప్రతి ఒక్కరి జీవితంలో పేరుకు ఎంతో ప్రాధాన్యత ఉంటుందనే సంగతి తెలిసిందే. తల్లిదండ్రులు సైతం తమ పిల్లలకు అందరికీ నచ్చే పేరును పెట్టాలని భావిస్తారు. అయితే పేర్లు పెట్టే సమయంలో కొన్ని జాగ్రత్తలను తప్పనిసరిగా తీసుకోవాలి. ఎవరైతే పిల్లల కీర్తి, ప్రతిష్టలను కోరుకుంటారో వాళ్లు పిల్లలకు రెండక్షరాల పేరును పెట్టాలి. పిల్లలకు దేవుళ్ల పేర్లు పెడితే మరింత మంచి జరుగుతుందని చాలామంది భావిస్తారు.

Naming Children

కొడుకు లేదా కూతురు పుట్టిన 11వ రోజున లేదా 12వ రోజున నామకరణం చేస్తే మంచిది. ఆడపిల్లల పేర్లను బేసి అక్షరాలతో పెడితే మంచిది కాగా మగపిల్లల పేర్లను మాత్రం బేసి అక్షరాలతో పెట్టకూడదు. రాశుల ఆధారంగా వచ్చే అక్షరాలను బట్టి పిల్లలకు పేర్లు పెడితే అనుకూల ఫలితాలు వస్తాయి. మగ పిల్లలకు 2, 4, 6 అక్షరాల పేర్లు ఉత్తమమని చెప్పవచ్చు. పిల్లల బ్రహ్మచర్యానికి ప్రాధాన్యత ఇచ్చే తల్లిదండ్రులు నాలుగు అక్షరాల పేరు పెడితే మంచిది.

Also Read: Junior NTR- TDP: జూనియర్ ఎన్టీఆర్ తోనే టీడీపీకి మనుగడ ఉందా?

పిల్లలకు అమావాస్య, పౌర్ణమి రోజున పేర్లు పెట్టకూడదు. నవమి, చతుర్దశి, రికట తిథి, చతుర్థి రోజులలో పిల్లలకు నామకరణం చేయకూడదు. అష్టమి, చతుర్దశి రోజులలో పేర్లు పెట్టడం కూడా మంచిది కాదు. తల్లిదండ్రులు పిల్లలకు పెట్టే పేరు పిల్లల జీవితాలపై ఎంతో ప్రభావం చూపుతుందని గుర్తుంచుకోవాలి. పిల్లల పేరు విషయంలో పొరపాట్లు చేస్తే వాళ్లు జీవితాంతం బాధపడాల్సి ఉంటుంది.

జ్యోతిష్యుల సలహాలు తీసుకుని పిల్లల పేర్లు పెడితే మరీ మంచిది. పిల్లల జాతకంలో ఏవైనా దోషాలు ఉంటే పరిహారాలు చేయడం ద్వారా పిల్లలు శుభ ఫలితాలు పొందే అవకాశాలు అయితే ఉంటాయి. పిల్లలకు తల్లిదండ్రులు అర్థవంతమైన పేర్లను మాత్రమే పెట్టాలి.

Also Read: Yadadri Temple: నేడే యాదాద్రి ప్రారంభం.. తొలి దర్శనం కేసీఆర్ కే..