Chicken : చికెన్ తిన్న తర్వాత ఈ పదార్థాలు తింటున్నారా.. తస్మాత్ జాగ్రత్త!

కొన్ని పదార్థాలను చికెన్‌తో కలిపి లేదా చికెన్ తిన్న తర్వాత అసలు తినకూడదు. దీనివల్ల జీర్ణ సమస్యలు, కడుపు సంబంధిత సమస్యలు వస్తాయని నిపుణులు హెచ్చరిస్తున్నారు. చికెన్ తిన్న తర్వాత అసలు తీసుకోకూడదని ఫుడ్స్ ఏంటి? తింటే ఏమవుతుందో ఈ స్టోరీలో తెలుసుకుందాం.

Written By: Srinivas, Updated On : November 5, 2024 4:50 pm

Chicken

Follow us on

Chicken :  కొందరికి ముక్క లేనిదే ముద్ద దిగదు. వెజ్ ఫుడ్ కంటే నాన్‌ వెజ్‌కే ఎక్కువ ఇష్టం చూపిస్తారు. కొంతమంది దేవుడి మీద భక్తితో కొన్ని వారాలు తినరు. కానీ ఈరోజుల్లో చాలామంది వారాలతో సంబంధం లేకుండా ప్రతి రోజూ నాన్ వెజ్ తింటున్నారు. వెజ్ కర్రీలు అయితే పొద్దున్న వండిన కూర మళ్లీ వండితే.. రోజూ ఇదేనా అని తినడం మానేస్తారు. కొందరైతే గొడవ కూడా పెట్టుకుంటారు. అదే నాన్ వెజ్‌ను రోజూ పెట్టినా బోర్ కొట్టదు. మూడు పూటలు పెట్టిన నాన్ వెజ్ తింటారు. అయితే ఇందులో పోషకాలు ఎక్కువగా ఉంటాయి. తినడం ఆరోగ్యానికి మంచిదే. కానీ మితంగా మాత్రమే తినాలి. అయితే ఎక్కువ మంది నాన్‌వెజ్‌లో చికెన్ తింటారు. తెలియక చికెన్ తిన్న తర్వాత కొన్ని రకాల పదార్థాలను తింటారు. దీనివల్ల అనారోగ్య సమస్యల బారిన పడతారని నిపుణులు హెచ్చరిస్తున్నారు. కొన్ని పదార్థాలను చికెన్‌తో కలిపి లేదా చికెన్ తిన్న తర్వాత అసలు తినకూడదు. దీనివల్ల జీర్ణ సమస్యలు, కడుపు సంబంధిత సమస్యలు వస్తాయని నిపుణులు హెచ్చరిస్తున్నారు. చికెన్ తిన్న తర్వాత అసలు తీసుకోకూడదని ఫుడ్స్ ఏంటి? తింటే ఏమవుతుందో ఈ స్టోరీలో తెలుసుకుందాం.

కూల్ డ్రింక్స్
కొందరు చికెన్‌తో కూల్ డ్రింక్స్ తాగుతుంటారు. వీటితో జ్యూస్‌లు కూడా తీసుకుంటారు. అయితే వీటిని తీసుకోకూడదని నిపుణులు చెబుతున్నారు. ఎందుకంటే చికెన్ తర్వాత డ్రింక్ తాగడం వల్ల గ్యాస్ సమస్యలు వచ్చే ప్రమాద ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. దీనివల్ల జీర్ణ క్రియ ఆరోగ్యం దెబ్బతింటుంది. శరీరంలో కూడా విషపూరిత రసాయనాలు పెరుగుతాయని నిపుణులు చెబుతున్నారు.

బంగాళదుంపలు
చికెన్‌తో లేదా తిన్న తర్వాత కొందరు బంగాళదుంపలతో చేసిన చిప్స్ తింటారు. వీటిని తినడం వల్ల అజీర్ణ, కడుపు సంబంధిత సమస్యలు వస్తాయని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఎందుకంటే బంగాళదుంపల్లో కార్బోహైడ్రేట్లు అధికంగా ఉంటాయి. ఇవి కొన్నిసార్లు వాంతులు, విరేచనాలను కూడా కలిగిస్తాయి.

పాల పదార్థాలు
కొందరు చికెన్ తిన్న తర్వాత పెరుగు, పాలు వంటి పదార్థాలు తీసుకుంటారు. చికెన్‌తో కూడా పెరుగున్నం తింటారు. ఇలా కలిపి తినడం ఆరోగ్యానికి ఏమాత్రం మంచిది కాదని నిపుణులు అంటున్నారు. ఎందుకంటే పాలు, చికెన్ కలిసి కడుపులోకి వెళ్తే విషపదార్థాలను కలిగిస్తుంది. దీంతో జీర్ణ సమస్యలు వస్తాయి. కాబట్టి వీటిని అసలు తినవద్దు. కొందరు చికెన్ బిర్యానీతో మజ్జిగ, పెరుగు, రైతా ఇలా తింటారు. ఇలా తినడం వల్ల జీర్ణ కాదని, జీర్ణ సమస్యలు వస్తాయని నిపుణులు హెచ్చరిస్తున్నారు.

తేనె
చికెన్ తిన్న వెంటనే తేనె అసలు తీసుకోకూడదు. ఎందుకంటే తేనె తొందరగా జీర్ణం కాదు. ఈ రెండు కడుపులో కలిస్తే శరీరానికి చాలా ప్రమాదకరం. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో కూడా ఈ పదార్థాలను కలిపి తీసుకోవద్దు. వేర్వేరుగా కాస్త సమయం తర్వాత తీసుకోవడం ఉత్తమం. తేనే ఆరోగ్యానికి మంచిదే. కానీ ఇలా చికెన్‌తో కలిపి తినడం వల్ల అనారోగ్య సమస్యల బారిన పడాల్సి వస్తుంది.

Disclaimer : ఈ సమాచారం కేవలం అవగాహన, ప్రాథమిక సమాచారం కోసం మాత్రమే. దీన్ని oktelugu.com నిర్ధారించదు. ఈ సూచనలు పాటించేముందు వైద్య నిపుణుల సలహాలు తీసుకోగలరు.