మన దేశంలో పండ్లను ఇష్టపడే వాళ్లలో చాలామంది జాక్ ఫ్రూట్ ను తెగ ఇష్టంగా తింటారనే సంగతి తెలిసిందే. జాక్ ఫ్రూట్ తో పాటు జాక్ ఫ్రూట్ గింజలను కూడా చాలామంది తింటూ ఉంటారు. జాక్ ఫ్రూట్ శరీరానికి ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలను చేకూర్చడంతో పాటు అనేక ఆరోగ్య సమస్యలకు సులభంగా చెక్ పెడుతుంది. అయితే జాక్ ఫ్రూట్ విత్తనాలు తినడం వల్ల కొన్నిసార్లు ఆరోగ్య సమస్యలు వచ్చే అవకాశాలు కూడా ఉంటాయి.
ఎవరైతే జాక్ ఫ్రూట్ ను తింటారో వాళ్లలో రక్తపోటు అదుపులో ఉంటుంది. రక్తపోటును తగ్గించడంలో జాక్ ఫ్రూట్ ఎంతగానో సహాయపడుతుంది. అయితే తకువ రక్తపోటు ఉన్నవాళ్లు మాత్రం జాక్ ఫ్రూట్ కు దూరంగా ఉంటే మంచిది. రక్తంలో చక్కెర శాతాన్ని తగ్గించడంలో జాక్ ఫ్రూట్ తోడ్పడుతుంది. హైపోగ్లైసీమియా సమస్యతో బాధ పడేవాళ్లు వైద్యుల సలహాలు, సూచనల ప్రకారమే జాక్ ఫ్రూట్ ను తీసుకోవాలి.
అయితే డయాబెటిస్ కు మందులు వాడేవాళ్లు మాత్రం ఈ ఫ్రూట్ కు దూరంగా ఉంటే మంచిది. రక్తంలోని చక్కెర స్థాయిలను జాక్ ఫ్రూట్ ప్రభావితం చేస్తుంది. ఎవరి చర్మం సున్నితంగా ఉందో వాళ్లు జాక్ ఫ్రూట్ ను ఎట్టి పరిస్థితుల్లోనూ తీసుకోకూడదు. సున్నితమైన చర్మం ఉన్నవాళ్లు జాక్ ఫ్రూట్ తింటే అలెర్జీ వచ్చే అవకాశం ఉంటుంది. జాక్ ఫ్రూట్ విత్తనాలను తినేవారిలో దురద, దద్దుర్లు వచ్చే అవకాశాలు కూడా ఉంటాయి.
రక్తం గడ్డకట్టకుండా ఉండటానికి మందులను వాడేవాళ్లు జాక్ ఫ్రూట్ తినకూడదు. జాక్ ఫ్రూట్ వల్ల రక్తం మందం అయ్యే అవకాశం ఉండటంతో ఇప్పటికే రక్త సమస్యతో బాధపడుతున్న వాళ్లు జాక్ ఫ్రూట్ ను తింటే సమస్య పెద్దదయ్యే అవకాశాలు ఉన్నాయి.