గర్భంతో ఉన్న సమయంలో మహిళలు తీసుకోవాల్సిన జాగ్రత్తలివే..?

ప్రతి మహిళ గర్భంతో ఉన్న సమయంలో ఆరోగ్యకరమైన శిశువు కోసం పౌష్టికాహారం ఎక్కువగా తీసుకోవాలి. ప్రోటీన్ మరియు క్యాల్షియం ప్రధానంగా ఉండే ఆహారాలకు ప్రాధాన్యత ఇవ్వాలి. గర్భంలోని బిడ్డ వేగంగా పెరగడంలో ఇవి సహాయపడతాయి. గర్భంతో ఉన్న మహిళ పాలు, ఆకుకూరలు, పండ్లు, కూరగాయలు, మాంసం, చేపలు ఎక్కువగా తీసుకోవాలి. వైద్యుల సలహాలు, సూచనలు తీసుకోకుండా ఇష్టానుసారం మందులు వాడకూడదు. చిన్న ఆరోగ్య సమస్య ఎదురైనా వైద్యులను సంప్రదించాలి. గర్భం ధరించినప్పటి నుంచి ప్రసవం వరకు ఒకే […]

Written By: Kusuma Aggunna, Updated On : January 27, 2021 12:49 pm
Follow us on

ప్రతి మహిళ గర్భంతో ఉన్న సమయంలో ఆరోగ్యకరమైన శిశువు కోసం పౌష్టికాహారం ఎక్కువగా తీసుకోవాలి. ప్రోటీన్ మరియు క్యాల్షియం ప్రధానంగా ఉండే ఆహారాలకు ప్రాధాన్యత ఇవ్వాలి. గర్భంలోని బిడ్డ వేగంగా పెరగడంలో ఇవి సహాయపడతాయి. గర్భంతో ఉన్న మహిళ పాలు, ఆకుకూరలు, పండ్లు, కూరగాయలు, మాంసం, చేపలు ఎక్కువగా తీసుకోవాలి. వైద్యుల సలహాలు, సూచనలు తీసుకోకుండా ఇష్టానుసారం మందులు వాడకూడదు.

చిన్న ఆరోగ్య సమస్య ఎదురైనా వైద్యులను సంప్రదించాలి. గర్భం ధరించినప్పటి నుంచి ప్రసవం వరకు ఒకే ఆస్పత్రిలో చికిత్స చేయించుకుంటే మంచిది. గర్భం ధరించిన సమయంలో వేగవంతంగా చేసే పనులకు వీలైనంత దూరంగా ఉండాలి. గర్భంతో ఉన్న మహిళలకు వైద్యులు అనేక పరీక్షలు చేయించుకోవాలని సూచిస్తారు. చాలామంది ఆ పరీక్షల విషయంలో నిర్లక్ష్యం వహిస్తారు.

గర్భం ధరించిన తొలి రోజు నుంచి మందులను క్రమం తప్పకుండా వాడాలి. గర్భంతో ఉన్న మహిళలకు రోజుకు ఏడు నుంచి తొమ్మిది గంటల నిద్ర అవసరం అవుతుంది. తగినంత నిద్రపోతే శారీరక, మానసిక సమస్యల బారిన పడకుండా మనల్ని మనం రక్షించుకునే అవకాశం ఉంటుంది. అవసరమైతే తప్ప విమాన ప్రయాణాలు చేయకుండా ఉంటే మంచిది. గర్భం ధరించిన తర్వాత హార్మోన్లలో కూడా మార్పులు వస్తాయి.

వీలైనంత వరకు నెగిటివ్ ఆలోచనలకు దూరంగా ఉంటే మంచిది. మహిళలు వీలైనంత వరకు వదులుగా ఉండే దుస్తులను ధరిస్తే మంచిది. వీలైనంత వరకు పరిశుభ్రంగా ఉండాలి. గర్భంతో ఉన్న మహిళలు కాఫీ, కెఫినేటెడ్ డ్రింక్స్, బొప్పాయి, ద్రాక్ష, పైనాపిల్, ఆల్కహాల్, ధూమపానం, ఫాస్ట్ ఫుడ్ కు వీలైనంత వరకు దూరంగా ఉంటే మంచిది. ఐస్ క్రీం, బేకరీ ఫుడ్ లకు దూరంగా ఉంటే మంచిది.