https://oktelugu.com/

Parenting Tips: మీ పిల్లలు మీ మాట వినడం లేదా? ఇలా చేయండి!

ఐదారు దశాబ్దాల క్రితం వరకు ఉమ్మడి కుటుంబాలు ఉండేవి. దంపతులు కూడా అరడజన్‌కు పైగా పిల్లల్ని కనేవారు. కానీ అందరూ తల్లిదండ్రుల అదుపులోనే ఉండేవారు. సంపద, ఆదాయం లేకపోయినా ఉన్నంతో సర్దుకుపోయేవారు.

Written By:
  • Raj Shekar
  • , Updated On : May 10, 2023 / 04:08 PM IST

    Parenting Tips

    Follow us on

    Parenting Tips: అడ్డాలనాడే బిడ్డలు కానీ.. గడ్డాలనాడు కాదు అనేది నానుడి.. కానీ అదే నేటి వాస్తవం. స్కూల్‌ స్టేజ్‌ వరకే పిల్లలు తల్లిదండ్రుల చెప్పుచేతల్లో ఉంటున్నారు. తర్వాత చేయిదాటిపోతున్నారు. అయితే ఇది ఇప్పుటికప్పుడు వచ్చిన మార్పు కాదు.. మారుతున్న కాలంతోపాట తల్లిదండ్రులు వస్తున్న మార్పు.. ప్రవర్తన తీరు.. బిజీ లైఫ్‌.. మారుతున్న పెంపకం తీరు.. గారాబం.. అందుబాటులోకి వచ్చిన టెక్నాలజీ.. ఉన్నత విద్యాభ్యాసం.. స్నేహితుల ప్రభావం.. వ్యసనాలు.. ఆహారపు అలవాట్లు.. శారీరక మార్పులు.. ఆకర్షణ.. పెరుగుతున్న డబ్బు.. విచ్చలవిడి ఖర్చు.. ఇలా చెప్పుకుంటూ పోతే అనేక అంశాలు పిల్లలను ప్రభావితం చేస్తున్నాయి.. మార్పునకు కారణమవుతున్నాయి.

    నాడు డజన్‌ మంది పిల్లలు..
    ఐదారు దశాబ్దాల క్రితం వరకు ఉమ్మడి కుటుంబాలు ఉండేవి. దంపతులు కూడా అరడజన్‌కు పైగా పిల్లల్ని కనేవారు. కానీ అందరూ తల్లిదండ్రుల అదుపులోనే ఉండేవారు. సంపద, ఆదాయం లేకపోయినా ఉన్నంతో సర్దుకుపోయేవారు. నేడు ఒకరు లేదా ఇద్దరు పిల్లలతోనే సరిపెట్టుకుంటున్నారు. ఆ ఒకరిద్దరిని ఉన్నత స్థానాల్లో నిలపాలని చూస్తున్నారు. అందుకోసం తల్లిదండ్రులిద్దరూ కష్టపడుతున్నారు. తమ శ్రమ, శక్తిని దారపోసి డాక్టర్లు, ఇంజినీర్లను చేస్తున్నారు. పిల్లల భవిష్యత్‌ బాగుండాలని అప్పులు చేసి మరీ విదేశాలకు పంపుతున్నారు.

    ఉన్నత చదువుల మాటున తప్పటడుగు..
    ఉన్నత విద్య కోసం తల్లిదండ్రులకు దూరంగా ఉంటున్న పిల్లల, అక్కడి వాతావరణం, సహచరులు, స్నేహితుల ప్రభావం, అధిక స్వేచ్ఛ కారణంగా చాలా మంది పిల్లలు తల్లిదండ్రుల చేయి దాటిపోతున్నారు. మరోవైపు పిల్లలు దూరంగా ఉంటున్నారని తల్లిదండ్రులు చేసే గారాబాన్ని కూడా అడ్వాంటేజ్‌గా తీసుకుంటున్నారు. చదువులు పూర్తయ్యేనాటికి ‘మా నిర్ణయాలు మేమే తీసుకుంటాం.. మేం చిన్న పిల్లలం కాదు’ అనే స్థాయికి వస్తున్నారు.

    ఇక విదేశాల్లో విపరీత ధోరణి..
    ఇక ఉన్నత చదువుల కోసం, ఉద్యోగాల కోసం విదేశాలకు వెళ్తున్నవారిలో మార్పు వేగంగా వస్తోంది. పాశ్చాత్య సంస్కృతికి సులభంగా అలవడుతున్నారు. మన సంస్కృతి, సంప్రదాయాలను పక్కన పెట్టి పాశ్చాత్య పోకడలతో పెడదారి పడుతున్నారు. తల్లిదండ్రులను పట్టించుకోవడం మానేస్తున్నారు. కట్టుబాట్లు, బంధాలు, అనుబంధాలను తెంచుకుంటున్నారు. దీంతో చాలా మంది తల్లిదండ్రులు తమ పిల్లల ఫోన్‌ కోసం అర్ధరాత్రి వరకు మెలకువతో రోజుల తరబడి నిరీక్షిస్తున్నారు.

    కుటుంబాల పరిస్థితీ అంతే..
    ఇక కుటంబాలతో సహా విదేశాలకు వెళ్లిన వారు కూడా భారత దేశంతో సబంధాలు తెంచుకుంటున్నారు. అక్కడి సిటిజన్‌షిప్‌ రాగానే తాము స్థానికులమే అని ఫీల్‌ అవుతున్నారు. మాతృభూమిని మర్చిపోతున్నారు. ఉన్నత చదువులు, ఉద్యోగాల కోసం కొత్తగా వచ్చే వారిని చిన్నచూపు చూస్తున్నారు. అక్కడ పుట్టిపెరిగిన వారు విదేశీయులను గౌరవిస్తుంటే బతుకుదెరువు కోసం వెళ్లి స్థిరపడిన వారు మాత్రం అక్కడికి వచ్చేవారిని అగౌరవంగా చూస్తున్నారు. వివక్ష ప్రదర్శిస్తున్నారు.

    అమెరికాలో ఎక్కువ..
    ఇలాంటి పరిస్థితులు అగ్రరాజ్యం అమెరికాలో స్థిరపడిన భారతీయుల్లో ఎక్కువగా కనిపిస్తుంది. బతుకుదెరువుకు అక్కడికి వెళ్లి స్థిరపడిన పెద్దలు తాము అమెరికన్లమే అన్నట్లు ప్రవర్తిస్తున్నారు. ఇక అక్కడే పుట్టిన వారి పిల్లల్లో అయితే ఈ ధోరణి ఇంకాస్త ఎక్కువే. అక్కడి పరిస్థితులు, సంస్కృతి, సంప్రదాయాలనే పాటì స్తున్నారు. భారతీయ మూలాలను పూర్తిగా విస్మరిస్తున్నారు. అమెరికాతోపాటు ప్రపంచంలోని అనేక దేశాల పౌరులు భారతీయ సంస్కృతిని గౌరవిస్తుంటే.. విదేశాల్లో స్ధిరపడిన వారు మాత్రం.. మూలాలనే మర్చిపోతున్నారు.

    పిల్లను ఇవ్వడానికి వెనుకడుగు..
    విదేశాల్లో స్థిరపడిన తమ కుటుంబాల్లోని దూరపు బంధువులతో బంధుత్వం కలుపుకునేందుకు ఇటీవల భారతీయులు ఎక్కువ ఆసక్తి చూపుతున్నారు. అమెరికాలో ఉద్యోగం చేస్తున్న తమ పిల్లలను అక్కడే స్థిరపిన వారి ఇంటకి అల్లుడిగానో, కోడలిగానో పంపాలని చూస్తున్నారు. ఇటీవల ఓ యువతిని అక్కడే స్థిరపడిన తెలుగువారి కుటుంబంలోకి కోడలిగా పంపేందుకు పెళ్లి సంబంధం మాట్లాడారు. కానీ, పెళ్లి సమయంలోనే అక్కడ స్థిరపడిన తెలుగు కుటుంబం, పెళ్లి కొడుకు పెట్టిన కండీషన్లు చూసి యువతితోపాటు, ఆమె తల్లిదండ్రులు షాక్‌ అయ్యారు. అమ్మాయి చేసే ఉద్యోగం కంటే అబ్బాయిది చిన్న ఉద్యోగమే అయినా వివాహనాకి యువతిని ఒప్పుకుంది. కానీ పెళ్లి తర్వాత యువతి జీతం మొత్తం అత్తగారికి ఇవ్వాలట. మనదే అనుకున్నాక లెక్కలు ఉండవు. కానీ, జీతం వారి అకౌంట్లో ఇవ్వాలని కీడీషన్‌ పెట్టారు. తన అవసరాలకు అత్తను, భర్తను అడుక్కోవాలట. ఇక కుటుంబానికి సేవ చేయాలట. ఏదైనా జరిగి విడిపోవాల్సి వస్తే అమెరికా చట్టాల ప్రకారం.. భార్య జీతం ఎక్కువ కాబట్టి భర్తకే భరణం ఇవ్వాల్సి ఉంటుంది. ఇక అక్కడ వివాహేతర బంధాలు కామన్‌ అట. అడిగే హక్కు ఉండదట. కోడలు మాత్రం చాకిరీ చేయాలట.

    తాము బతకడానికి వచ్చామన్న విషయం మర్చిపోయి..
    అమెరికన్‌ సెటిటర్లు అక్కడి సంస్కృతికి అలవాటు పడి సబంధాలను అక్కడ స్థిరపడిన వారు డబ్బుతోనే పోల్చుతున్నారు. ముప్పై, నలబై ఏళ్ల క్రితం తాము కూడా బతకడానికి వచ్చామనే విషయాన్ని మర్చిపోతున్నారు. తాము తమ మాతృభూమిలో పుట్టిన అమ్మాయిని కోడలిగా తెచ్చుకుంటున్నామని సంతోషించకుండా కండీషన్లతో హింసిస్తున్నారు. అమెరికాలో చాలా మంది ఇదే పరిస్థితి ఎదుర్కొంటున్నారట. దుర్భర జీవనం సాగిస్తున్నారట. కలిసి ఉండలేక విడిపోతున్నారు.

    అయితే అమెరికాలో అందరూ అలా ఉంటారని చెప్పలేం కానీ, చాలా మంది అలాగే ఉన్నారని అక్కడ స్థిరపడిన వారిని పెళ్లి చేసుకున్న యువతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. భారత దేశంలో నలుగురు ఏమనుకుంటారో అన్న భయం ఉంటుందని, అమెరికాలో అవేమీ ఉండవని పేర్కొంటున్నారు.