water: ప్రతిరోజూ శరీరానికి అవసరమైన స్థాయిలో నీళ్లను తీసుకోవాలని వైద్య నిపుణులు సూచనలు చేస్తుంటారు. నీళ్లు ఎక్కువ మొత్తంలో తీసుకోని పక్షంలో అనేక ఆరోగ్య సమస్యలు వేధించే అవకాశం అయితే ఉంటుందని చెప్పవచ్చు. ఈ మధ్య కాలంలో చాలామంది అధికంగా దాహం వేయడం వల్ల అవసరానికి మించి నీళ్లను తీసుకుంటున్నారు. అధికంగా దాహం వేయడం కూడా ఒక సమస్య అని తప్పనిసరిగా గుర్తుంచుకోవాలి.
శరీరంలో నీటి ఆవశ్యకతను దాహం అనే భావన తెలియజేస్తుంది. అధికంగా దాహం వేస్తుందంటే మధుమేహం వ్యాధి పరీక్షలు చేయించుకుంటే మంచిది. శరీరంలో చక్కెర శాతం పెరిగితే తరచుగా దాహం వేసే అవకాశం ఉంటుంది. శరీరంలో సరిపడా నీళ్లు లేకపోతే కిడ్నీలు సరిగ్గా పని చేయవు. చెడు జీవనశైలి వల్ల చాలామంది మధుమేహం బారిన పడుతున్నారు. వయస్సుతో సంబంధం లేకుండా అన్ని వయస్సుల వాళ్లు మధుమేహం బారిన పడుతున్నారు.
Also Read: మీకు పెరుగు ఇష్టమా.. ఈ ఐదు పదార్థాలతో పెరుగు తింటే ప్రమాదం?
స్పైసీ ఫుడ్ తిన్న సమయంలో ఆహారం సరిగ్గా జీర్ణం కాకపోవడం వల్ల అధికంగా దాహం వేస్తుంది. శరీరంలో నీటి కొరత ఏర్పడటం వల్ల అధికంగా దాహం వేస్తుంది. సమృద్ధికి ఉన్న ఆహారం జీర్ణం కావాలంటే ఎక్కువ మొత్తంలో నీళ్లు తాగాలి. శరీరం ఎక్కువగా చెమట పట్టడం ప్రారంభించినా అధికంగా దాహం వేసే అవకాశం అయితే ఉంటుంది. ఎక్కువ నీళ్లు తాగడం వల్ల శరీర ఉష్ణోగ్రత సమతుల్యమవుతుంది.
ఆందోళన సమస్యతో బాధ పడేవాళ్లను కూడా ఈ సమస్య వేధిస్తుంది. ఆందోళన వల్ల నోరు ఎండిపోయే అవకాశం అయితే ఉంటుందని చెప్పవచ్చు. ఆందోళన వల్ల నోటిలో కొన్ని ఎంజైమ్ ల ఉత్పత్తి తగ్గుతుంది. అధికంగా దాహం వేస్తుంటే వైద్య నిపుణులను సంప్రదించి సూచనలు తీసుకుంటే మంచిది.
Also Read: ఈ లక్షణాలు కనిపిస్తున్నాయా.. అయితే గుండెపోటు వచ్చే అవకాశాలు ఎక్కువ!